నాగార్జున జన్మ ధన్యమైంది : చిరంజీవి
నవరస సమ్రాట్ నాగార్జన, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్వరవాణి
కీరవాణి...ఈ ముగ్గురి కలయికలో రూపొందిన మూడవ అథ్యాత్మిక అధ్బుతం శిరిడి
సాయి. ఇటీవల రిలీజైన శిరిడి సాయి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో
విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శిరిడి సాయి చిత్రాన్ని మెగాస్టార్
చిరంజీవి ప్రసాద్ ల్యాబ్ లో చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ...శిరిడి
సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా
ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని
ఫీలింగ్....చాలా ఎమోషన్ లగా ఫీలయ్యాను. శిరిడి సాయిగా నాగార్జున
అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు...ఇప్పుడు శిరిడి సాయి
చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను.
ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లు కట్టినట్టుగా అనిపించింది.
అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు గారు
కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్ రెడ్డి సాయి
తత్వాన్ని అందరి తెలియచేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు.
విజయయాత్ర..
శిరిడి సాయి చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకాభిమానులను
కలుసుకునేందుకు శిరిడి సాయి చిత్రయూనిట్ విజయయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈనెల 11 వైజాగ్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. శిరిడి సాయి
విజయయాత్రలో నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్ రెడ్డి తదితరులు
పాల్గోంటారు.