pizza
Adithya release in July
స్పెష‌ల్ నూన్ షోస్ అనుమ‌తి పొందిన ఆదిత్య క్రియేటివ్ జీనియ‌స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 June 2016
Hyderabad

‌

శ్రీల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలింస్ బ్యాన‌ర్ పై భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియ‌స్‌. లాస్ ఏంజిల్స్ లో ఇటీవ‌ల నిర్వ‌హించిన జెన్నీ అంతర్జాతీయ చ‌ల‌న చిత్రోత్సావాల్లో ఈ చిత్రం ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ...

ద‌ర్శ‌క నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ మాట్లాడుతూ ``హైద‌రాబాద్‌లో జ‌రిగిన చిల్డ్ర‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో 1300 చిత్రాలు పోటీ ప‌డితే ఆదిత్య చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎంతో మంది ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల‌చే ప్ర‌శంస‌లు పొందిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద‌శాతం వినోద‌పు ప‌న్ను రాయితీని పొందింది. అంతే కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఈ సినిమా స్పెష‌ల్ నూన్ షోస్ కు అనుమ‌తినిచ్చింది. ఈ నూన్ షోను రాష్ట్రంలో ప్రతి స్కూల్ విద్యార్థి చూసేలా చేస్తాం. ఈ స్పెష‌ల్ షోను జూలై నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శిస్తాం. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకున్న ఓ యువ‌కుడు త‌న తెలివి తేట‌ల‌తో జూనియ‌ర్ సైంటిస్ట్ అవార్డును ఎలా సొంతం చేసుకున్నాడ‌నేదే సినిమా. అబ్దుల్ క‌లాంగారి స్ఫూర్తితో రూపొందిన చిత్ర‌మిది`` అన్నారు.

ప్రేమ్ బాబు మాట్లాడుతూ ``మంచి మేసేజ్ ఉన్న మూవీ. ఇందులో టైటిల్ రోల్ పోషించే అవ‌కాశాన్ని క‌ల్పించిన సుధాక‌ర్ గౌడ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

ప‌ద్మిని మాట్లాడుతూ ``క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు రాజ్యమేలుతున్న ఈ స‌మ‌యంలో పిల్ల‌లు సినిమా తీసిన సుధాక‌ర్‌గౌడ్‌గారిని అభినందిస్తున్నాను`` అన్నారు.



Photo Gallery
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved