30 December 2014
Hyderaba
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని ప్రతి శనివారం నిర్వహించే "అన్నమయ్య స్వరార్చన" లో 2014 సంవత్సరానికి చివరి శనివారమైన డిసెంబర్ 27, నాడు ఫణి వంశీ ముడుంబ, ప్రణవ సాయితలల, కృష్ణ ప్రియ మూల అన్న ముగ్గురు యువ కళాకారులు అన్నమయ్య సంకేర్తనలు హృద్యంగా ఆలపించారు.
కళాకారులు ఆలపించిన కీర్తనలలో ఒక దానిని ఆధారంచేసుకుని అన్నమయ్యతత్వార్ధాన్నిడా. శోభారాజు ప్రతి శనివారం చర్చిస్తారు. ఈ వారం "నిత్యాత్ముడైయుండినిత్యుడైయుండి " అన్న కేర్తనను ప్రస్తావిస్తూ శ్రీవేంకటేశ్వరుడుగుడికి పరిమితమైన తొమ్మిది అదుగుల విగ్రహంగా భావించదంపొరబాటని, అడుగడుగునా వ్యాపించి, అనంతంగా వున్న నిరాకార చైతన్య శక్తికి ఓ ప్రతీక శ్రీ వేంకటేశ్వరుడని విశాల భావనతో ఆయనను ఆరాధించాలని ఆమె చెప్పారు.
కార్యక్రమానంతరం కళాకారులను శాలువాలతోను, జ్ఞాపికలతోను సత్కరించారు. కార్యక్రమం అనుసంధాన కర్త శ్రీ ఫణి కుమార్ అక్కిపెద్ది.