గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అరడుగుల బుల్లెట్. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని బీవీయస్‌యన్ ప్రసాద్ విడుదల చేసి ఎ.ఎం.రత్నంకు అందించారు.సంధ్యా ఝనక్, శక్తి రమేశ్, ఆర్.కె.గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ..
ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ ``విజువల్స్ బావున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ ``గోపీచంద్ సినిమాల్లోని మాస్ మొత్తం ఇందులో కనిపిస్తుంది. గోపాల్‌గారి సినిమాల్లో కుటుంబం గురించి మాట్లాడని సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో నా ఫేవరేట్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఈ సినిమాలో అత్యద్భుతంగా ఉంటుంది. రీరికార్డింగ్ అవసరం లేదని ఇంటర్వెల్ బ్లాక్ గురించి మణిశర్మగారు అన్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. . గోపీచంద్‌గారి మీటర్‌లో డైలాగులు రాశాను. బుల్లెట్‌లాంటి డైలాగులు ఇందులో ఉంటాయి. నరసింహనాయుడు సినిమాను వైజాగ్‌లో రెండు సార్లు చూశాను. గోపాల్‌గారు పనిచేయించుకునే విధానం అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన ఎవరినీ బాధపెట్టరు. ఆయన కోసం ఇంకొకటి చేద్దామని అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రకాశ్‌రాజ్‌గారు ఫోన్ చేసి `ఇందులో ఒక్కముక్క కరెక్ట్ చేద్దామంటే కుదరలేదు. అంత మంచి సీన్ రాశావు` అని అన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చాలా పద్ధతిగా ఉంటుంది. బూతు ఉండదు. కుటుంబం అంతా ప్రశాంతంగా కలిసి చూడదగ్గ సినిమా ఇది`` అని చెప్పారు.
శ్రీమణి మాట్లాడుతూ ``నేను రాసిన పాటను ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ప్రతి సాంగ్‌కీ ఓ కాన్సెప్ట్ తీసుకుని చేశాం. మణిగారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. గోపీచంద్‌గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాలోని పాటల్లోనూ కొన్ని లిరిక్స్ విని గోపీగారు అభినందించారు. లైఫంటే గాలిపటం అనే పాట నాకు చాలా బాగా నచ్చింది`` అని తెలిపారు.
బి.గోపాల్ మాట్లాడుతూ `` ఈనెల 9న విడుదల చేస్తాం. మా గోపీతో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. మాస్, యాక్షన్, సాంగ్స్, కామెడీ అన్నీ బాగా చేస్తాడు. సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి `బాబూ చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు` అని చెప్పాను. ఈ సినిమాను చూసి అందరూ ఆశీర్వదించాలి. నయనతార కేరక్టర్ బావుంటుంది. ప్రకాశ్‌రాజ్‌గారు చాలా బాగా చేశారు. గోపీచంద్, ప్రకాశ్‌రాజ్ గారి మధ్య వచ్చే సీన్లన్నీ అద్భుతంగా ఉంటాయి. నాలుగు పాటలు బావుంటాయి. వక్కంతం వంశీగారు, అబ్బూరి రవి చాలా బాగా రాశారు. టీమ్ అంతా కష్టపడి చేశాం`` అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ ``ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి చాలా మంది సహకరించారు. మా సినిమా కాస్త లేట్ అయినా సరే బ్లాక్ బస్టర్ చిత్రమవుతుందని నమ్మకం ఉంది`` అని చెప్పారు.
గోపీచంద్ మాట్లాడుతూ ``మణిశర్మగారు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఆయనతో నా కాంబినేషన్ చాలా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. గోపాల్‌గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. నిర్మాతలు చాలా బాగా తీసుకొచ్చారు. కాస్త లేట్ అయినా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. వంశీ చెప్పిన కథ చాలా బాగా వచ్చింది. ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. లేట్ అయినా సినిమా చాలా బాగా వచ్చింది`` అని తెలిపారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్.