విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. జిబ్రాన్ అందించిన ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో డా.దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, డి.సురేష్ బాబు, దిల్ రాజు, వెంకటేష్, జిబ్రాన్, మారుతి, నాని, తమ్మారెడ్డి భరద్వాజ, రామ్ లక్ష్మణ్, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీ, ఆడియో సీడీలను డా.దాసరి నారాయణరావు విడుదల చేశారు. తొలి సీడీని డి.సురేష్‌బాబు అందుకున్నారు. ఈ సందర్భంగా...
డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ``బాబు బంగారం అని ముప్పై ఏళ్ల క్రితమే నేను చెప్పాను. ఈ వేడుక నిజంగా ఓ పండుగ. 30సంత్సరాలను, చాలా మంచి పేరుతో, ఏ నిర్మాతతో ఏ కామెంట్ లేకుండా కెరీర్ లేకుండా రావడమనేది చిన్న విషయం కాదు. రామానాయుడుగారితో నాకున్న అనుబంధం నేను చెప్పనక్కర్లేదు. తెర వెనుక వెంకటేష్ వేరు. తను నిర్మాతల హీరో. నిర్మాత కష్ట సుఖాలు తెలిసిన హీరో. బ్రహ్మపుత్రుడు సమయంలో సౌండ్ బాక్స్ మోసుకుంటూ తను కూడా మాతో పాటు కొండలెక్కాడు. ఎఫర్ట్, ఎన్‌థూసియాసిసం, సిన్సియారిటి కలిపితే వెంకటేష్. తన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. కథను బట్టే నటించాడు. మంచి కథను ఎన్నుకుని, దాని ప్రాధాన్యంగానే నటించాడు. ఎన్నో అణిముత్యాల్లాంటి సినిమాలు చేసి ఎక్కువ నంది అవార్డులు పొందిన నటుడు. ఆయన వెనుక సురేష్‌బాబుగారుండి ముందుకు నడిపించారు. వెంకటేష్ నిజంగా బంగారం లాంటి వ్యక్తి. అలాగే ఈ సినిమా పాటలను జిబ్రాన్ తెలుగుదనంతో కూడుకున్నట్లు అందించాడు. మారుతి చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక్కో మెట్టు ఎదుగుతూ, తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకుని ఈ సినిమా సక్సెస్‌తో ఓ స్టార్ డైరెక్టర్ అవుతాడని మనసారా అతన్ని అభినందిస్తున్నాను. చినబాబు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. అతని కుమారుడు వంశీ, పిడి.ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ``30 ఏళ్లు ఎలా అయిపోయాయో తెలియడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే అభిమానుల ప్రేమ కోసమే నేను ఆడియో వేడుకలకు వస్తాను. నా మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. గత 5 సంవత్సరాల నుండి సినిమాలు తగ్గించేద్దామనుకున్నా, కానీ స్లో అవుదామనుకున్నా నన్ను వదలడం లేదు. మారుతి చాలా కాన్ఫిడెంట్ నన్ను డిపరెంట్ గా చూపిస్తానన్నాడు. నిజంగానే నన్ను డిఫరెంట్‌గానే చూపించాడు. మళ్లీ ఒక ప్రేమించుకుందాం..రా, బొబ్బిలిరాజాలా, నువ్వునాకు నచ్చావ్ లా ఉంటుంది. నన్ను ఈ సినిమా తర్వాత పెళ్లి కానీ ప్రసాద్ అని పిలుస్తారో లేక బాబు బంగారం అని పిలుస్తారో చూడాలి. మారుతి చాలా కూల్‌గా సినిమాను హ్యండిల్ చేశాడు. అందుకు తనకు థాంక్స్. జిబ్రాన్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. అలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సినిమా ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నాం. సినిమా బొబ్బిలిరాజాను చేస్తారో లేక చంటిని చేస్తారో లేక గోపాల గోపాల చేస్తారో అంత ప్రేక్షకుల చేతిలో ఉంది. మంచి సినిమా చేశాం. రిచర్డ్ ప్రసాద్, ఉద్ధవ్ వంటి మంచి టీం దొరికింది. పదేళ్ల, ఇరవైయేళ్ల అని తెలియదు. లేక అర్జున్ వచ్చే వరకు చేస్తానా తెలియడం లేదు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మారుతి మాట్లాడుతూ ``వెంకటేష్‌గారి సినిమాలు చిన్నప్పట్నుంచి చూస్తూ పెరిగాను. ఆయన 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నా డైరెక్షన్‌లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుంది. ఆయన్ను ఎలా చూడాలనుకున్నానో, ఆయనలో ఎంటర్ టైన్మెంట్ యాంగిల్‌లో సినిమా ఉంటుంది. డెఫనెట్‌గా నన్ను స్టార్ డైరెక్టర్‌ను చేసిన వెంకటేష్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా, పాటలు ఇంత రిచ్‌గా ఉందంటే కారణం నిర్మాతలు. ఏం కావాలంటే అది ఇచ్చారు. డైరెక్టర్‌ను నమ్మి వారు సినిమా చేశారు. చినబాబుగారు ఎంతో మంచి నిర్మాత. ఆయనతో పది సినిమాలు చేయాలనేంత హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ను డిస్ట్రబ్ చేయకుండా సినిమాను పూర్తి చేయడంలో సపోర్ట్ చేశారు. రిచర్డ్ ప్రసాద్, జిబ్రాన్ మ్యూజిక్, ఉద్ధవ్ ఎడిటింగ్ సహా మంచి టెక్నికల్ టీం కుదిరింది. స్వామి నా వెంటుండి సినిమాను బాగా రావడానికి బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ``చాలా ఇష్టమైన టైటిల్. జిబ్రాన్ చాలా వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. వి అంటే విక్టరీ అంటూ వెంకటేష్ బాబు ఎప్పుడూ పైనే ఉండాలని కలియుగపాండవుల్లో షాట్ చిత్రీకరించాం. అలా మొదలైన అతని ప్రయాణం ఎప్పుడూ పైనే ఉండేలా కొనసాగింది. దగ్గుబాటిగారి ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. బంగారం లాంటి వెంకటేష్‌గారి సినిమా మళ్ళీ ఆగస్టు 12న విడుదలవుతుంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జిబ్రాన్ మాట్లాడుతూ ``నేను చాలా పెద్ద సినిమాలో పార్ట్ అయ్యానని తెలుసు. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మారుతిగారు, వెంకటేష్‌గారు, నిర్మాతలందరికీ థాంక్స్`` అన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ``మారుతి,చినబాబు సహా అందరికీ ఆల్ ది బెస్ట్. వెంకటేష్ 30 సంవత్సరాలను నటుడిగా పూర్తి చేసుకున్నాడని తెలిసింది. చాలా లాంగ్ జర్నీ. సపోర్ట్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ``రామానాయుడుగారు తనయుడైనప్పటికీ ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చారు. అయన ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బాబు బంగారం సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ``వెంకటేష్‌గారితో సుందరకాండ, కొండవీటిరాజా చిత్రాలను నిర్మించే అవకాశం కలిగింది. సబ్జెక్ట్ బావుంటే చాలు. వెంటనే డేట్స్ ఇచ్చి దర్శక నిర్మాతలను ఎంకరేజ్ చేస్తారు. చాలా మంచి మనిషి. బాబు బంగారం సినిమా ఆయనకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను`` అన్నారు.
ముప్పలనేని శివ మాట్లాడుతూ ``తాజ్‌మహాల్ సినిమాతో రామానాయుడుగారు నన్ను దర్శకుడిగా మార్చారు. సాధారణంగా వెంకటేష్‌గారి సినిమాలో పాటలు చాలా బావుంటాయి. అలాగే ఈ సినిమాలో పాటలు పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ``వెంకటేష్‌గారు 30 సంవత్సరాలను నటుడిగా పూర్తి చేసుకున్నారు. మరో 20 సంవత్సరాలను కూడా కలిపి మొత్తం యాబై ఏళ్లను పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం అలాగే ఆయనతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాను నిర్మించే అవకాశం కూడా కలిగింది. బాబు బంగారం సినిమా విషయానికి వస్తే పాటలు చాలా బావున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ ``ఏ హీరోనైనా ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత ఆఫ్ స్ర్క్రీన్ చూస్తే పెద్దగా అనిపించదు. కానీ ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్లో కూడా ఒకేలా ఉండి నాకు బాగా నచ్చిన హీరో వెంకటేష్‌గారు. అలాగే మారుతిగారి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఎంజాయ్ చేశాను. ఆయన అంత ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కిస్తారు. బాబు బంగారం కథ నాకు తెలుసు. కచ్చితంగా పెద్ద సక్సెస్ సాధిస్తాం`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ``డిజిటల్ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చిన దర్శకుడు మారుతికి, సినిమాలపై మంచి అవగాహన ఉన్న నిర్మాతలు, విక్టరీ వెంకటేష్ వంటి హీరో దొరికినప్పుడు సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ``నేను వెంకటేష్‌గారికి పెద్ద అభిమానిని. టీజర్ చాలా బావుంది. జిబ్రాన్ మ్యూజిక్ బావుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.