15 April 2017
Hyderabad
మాణిక్య మూవీస్ బ్యానర్‌పై నామన లోహిత్ సమర్పణలో మోహన్‌కృష్ణ, శిరీష, సౌజన్య హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `బావ-మరదలు`. గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బండారు దానయ్యకవి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా..
వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ - ``హీరో మోహన్‌కృష్ణ బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, రజనీకాంత్‌కు వీరాభిమాని. తనకు మంచి కథ, దర్శకుడు దొరికితే భాగ్యరాజాలాంటి హీరో అవుతాడని నేను తనకు చెబుతుంటాను. మరి బావమరదలు సినిమాతో మోహన్‌కృష్ణ ఎలా ఎదుగుతాడోనని ఆసక్తిగా ఉంది. నిర్మాత రాజుగారు ఇప్పుడు చేసే ట్రావెల్ ఆయన్ను పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ బండారు దానయ్య కవి మంచి సంగీతం ఇచ్చారు. టీంకు అభినందనలు`` అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ - ``గోదావరి జిల్లా నుండి హీరో, ప్రొడ్యూసర్‌గారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. పాటలు, ట్రైలర్ బావుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా కనపడుతుంది. కొత్త హీరో మోహన్‌కృష్ణకు అభినందనలు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మోహన్ కృష్ణ మాట్లాడుతూ - ``హీరోగా నా తొలి సినిమా. ఆరు సంవత్సరాల కష్టమిది. తొలిసినిమాలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించి ఆదరించాలి. నా రెండో సినిమా జూన్‌లో సెట్స్‌లోకి వెళ్ళనుంది. మినిష్టర్ పుల్లారావుగారు మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా డైరెక్టర్‌గారు లక్ష్మణమూర్తిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. నిర్మాత రాజుగారు బాగా సపోర్ట్ చేయడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ గంగారపు లక్ష్మణమూర్తి మాట్లాడుతూ - ``మాణక్య మూవీస్ వారు ఓ కథను తయారు చేసుకుని, ఈ కథకు ఎవరు డైరెక్టర్ అయితే బావుంటుందోనని ఆలోచిస్తున్నప్పుడు నా తొలి చిత్రం అతడు ఆమె ఓ స్కూటర్ సినిమా చూసి నచ్చడంతో నాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అందుకు కారణమైన రాజుగారికి థాంక్స్. కొత్త హీరో హీరోయిన్స్ అయిన మోహన్ కృష్ణ, శిరీషగారు మంచి యాక్టర్స్. హీరో మోహన్ కృష్ణ మంచి ఎనర్టీ ఉన్న నటుడు. డైలాగ్స్ బాగా చెబుతాడు. తను భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
అఖిల్ సర్ తక్, రవివర్మ, దిలీప్, వైజాగ్ శ్రీనివాస్, తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ః నందమూరి హరి, కెమెరాః సాహిద్, ఎగ్జిక్యూటివ్ః కొనికినేని ధరణేష్, కథ-మాటలుః మాణిక్యం మూవీస్, సంగీతంః బండారు దానయ్య కవి, నిర్మాతః రాజు(ఎన్.బి.ఆర్), స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః గంగారపు లక్ష్మణమూర్తి.