pizza
Nani's Gentleman music launch
‘జెంటిల్ మన్’ ఆడియో ఆవిష్కరణ
ou are at idlebrain.com > News > Functions
Follow Us

22 May 2016
Hyderabad


నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం `జెంటిల్‌మ‌న్‌`. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో నాని, రానా, ఇంద్రగంటి మోహనకృష్ణ, మణిశర్మ, జెమిని కిరణ్, అల్లరి నరేష్, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, హనురాఘవపూడి, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, సుమంత్, ఈషా, అవసరాల శ్రీనివాస్, మారుతి, సురభి, నివేదిత థామస్ తదితరులు పాల్గొన్నారు.

ఏవీ ద్వారా యాక్షన్ కింగ్ అర్జున్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

బిగ్ సీడీని దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఆడియో సీడీలను రానా విడుదల చేసి తొలి సీడీని మణిశర్మకు అందజేశారు. ఈ సందర్భంగా...

నాని మాట్లాడుతూ ‘’జెంటిల్ మన్ జూన్ 17న విడుదల కానుంది. 2007లో ఇంద్రగంటిగారు నాలోని హీరోను చూశారు. 2016లో నాలోని విలన్ ను చూశారు. మొదటి సినిమా చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసి చేశామో, ఇప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాం. నిర్మాత కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. మణిశర్మగారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చిన్నప్పుడు నేను ఓ సందర్భంలో మణిశర్మగారి ఆడియో సీడీ కొనడానికి డబ్బులు లేక దొంగతనం చేశాను. ఇప్పుడు నేను నెగటివ్ రోల్ చేస్తున్న సినిమాకు ఆయన మ్యూజిక్ చేయడం ఆనందంగా ఉంది. విందా, మార్తాండ్ గారు సహా మంచి టీం కుదిరింది. నివేదిత, సురభి నటనను చూస్తే వారు తప్ప ఆ పాత్రలను మరెవరూ చేయలేరనిపించింది. నివేదితను నటనను చూస్తే లేడీ కమల్ హాసన్ లా అనిపిస్తుంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘’ కృష్ణప్రసాద్ గారు జయాపజయాలకు అతీతంగా నన్ను సినిమా చేయమని అన్నారు. నానితో నేను సినిమా చేయాలంటే ఇద్దరికీ ఎగ్జయిట్ మెంట్ ఉన్న కథ కావాలని కథ రెడీ చేసుకున్నాం. కథ వినగానే నాని నటించడానికి ఒప్పుకున్నారు. నాని మాత్రం చేయగల సినిమా ఇది. సినిమాటోగ్రాఫర్ విందా, ఆర్ట్ డైరెక్టర్ రవి, మణిశర్మగారు మంచి టీంతో కుదిరింది. ముఖ్యంగా మణిశర్మగారితో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీముఖి ఈ చిత్రంలో మంచి రోల్ చేసింది. సినిమాలో ముఖ్యపాత్రలో కనపడుతుంది. అలాగే సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కు థాంక్స్’’ అన్నారు.

Glam galleries from the event

దగ్గుబాటి రానా మాట్లాడుతూ ‘’నాని విలన్ గా అద్భుతంగా చేసుంటాడు. ఇందులో నటీనటులు, టెక్నిషియన్స్ కు అభినందనలు’’ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’ఈ టీంకు ఇంద్రగంటి మోహనకృష్ణగారు జెంటిల్ మన్. మంచి వ్యక్తి. నివేదిత, సురభి మంచి నటీమణులు. నాని, మణిశర్మగారి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రమిది. నేను చాలా ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. కృష్ణప్రసాద్ గారికి, ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’నానిలోని మంచి స్పీడు ఉంది. ఆ స్పీడు తెరపై కనపడుతుంది. నాని పెద్ద స్టార్ అవుతాడు. హీరోలాగా, విలన్ గా కలిపి చేస్తూ ఇమిడి పోతూ చేయగల నటుడు. ఇంద్రమోహనకృష్ణ చాలా ఆలోచించి సినిమాలు చేసే దర్శకుడు. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మంచి తపన గల నిర్మాత. ఆయన తపనతోనే మంచి మ్యూజిక్ రాగలిగింది’’ అన్నారు.

కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘’నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు పాతికేళ్లుగా ఇండస్ట్రీలోని నిర్మాత. ఆదిత్య 369లాంటి గొప్ప సినిమాను చేసిన నిర్మాత. అప్పుడు ఎంత నిబద్ధతతో ఉన్నారో ఇప్పుడు కూడా అదే నిబద్ధతతో ఉన్నారు. అన్నీ శాఖల్లో పరిపూర్ణ అవగాహన ఉన్నవ్యక్తి. మణిశర్మగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా నానికి భలే భలే మగాడివోయ్ చిత్రం కంటే పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

హనురాఘవపూడి మాట్లాడుతూ ‘’మణిశర్మగారికి నేను పెద్ద ఫ్యాన్ ని. నాని ప్రతి సినిమాకు కొత్త సబ్జెక్ట్ ను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఎంటర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ‘’సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంద్రగంటి గారు మంచి డైరెక్టరే కాదు, మంచి టీచర్. నాని వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ ను అయినా సింపుల్ గా చేసేస్తాడు. మణిశర్మగారు లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్, సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా కొత్త ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఈ సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది. నాని సహా ఎంటర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’హీరో, విలన్ కాకుండా ప్రవర్తించేవాడే జెంటిల్ మన్, నాని ఈ సినిమాల పక్కా జెంటిల్ మన్ లా ఉంటాడు’’ అన్నారు.

మారుతి మాట్లాడుతూ ‘’నాని నాతో బ్రదర్, ఫ్రెండ్ లాగా కలిసిపోయిన వ్యక్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన చలి అనే షార్ట్ ఫిలిం చూసి నేను డైరెక్టర్ అయ్యాను. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తగా చేయాలని చూస్తుంటారు. నాని, ఇంద్రగంటి కాంబినేషన్ లో ఏడేళ్ల తర్వాత వస్తోన్న మూవీ. మంచి టీం కుదిరింది. నానిగారితో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నాను. నిర్మాతగారికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

అవసరాలశ్రీనివాస్, తనికెళ్లభరణి, వెన్నెలకిశోర్, ఆనంద్, రోహిణసత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved