pizza

Guntur Talkies music launch
‘గుంటూరు టాకీస్’ ఆడియో ఆవిష్కరణ

You are at idlebrain.com > News > Functions
Follow Us

20 February 2016
Hyderabad

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. రఘుకుంచె, మధురశ్రీధర్ డిజిటల్ గా లహరి చానెల్ లో అప్ లోడ్ చేయడం ద్వారా ఆడియో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కుమార్.ఎం, సిద్ధు జొన్నలగడ్డ, రష్మీ, శ్రద్ధాదాస్, ఎ.కోదండరామిరెడ్డి, యలమంచిలి సాయిబాబు, రేవంత్, విశ్వంత్, రాజా రవీంద్ర, శ్రీచరణ్; అల్లరి నరేష్, బెక్కం వేణుగోపాల్, రఘుకుంచె, షామిలి, మధుశాలిని, అనసూయ, మధురశ్రీధర్, సముద్ర తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత రాజ్ కుమార్.ఎం మాట్లాడుతూ ‘’ఇది గుంటూరుకు మాత్రమే సంబంధించిన కథ కాదు. యూత్ అందరికీ సంబంధించిన కథ. సిద్ధు, రష్మీ, శ్రద్ధాదాస్, నరేష్ సహా అందరూ చక్కగా నటించారు. నేషనల్ అవార్డు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంటైర్ థియేట్రికల్ రైట్స్ తీసుకుని విడుదల చేస్తున్న వారాహిచలన చిత్రం సాయికొర్రపాటి గారికి థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

 

Glam galleries from the event

ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘’నేను ప్రొడ్యూసర్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ సినిమాకు నిర్మాతలుగా మారే అవకాశాన్ని కలిగిస్తున్నాం. సినిమాను కామన్ మ్యాన్ కు దగ్గరగా తీసుకెళుతున్నాం. సినిమా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. నరేష్ గారికి ముందుగా థాంక్స్ చెప్పాలి. ఆయన స్థాపించిన కళాకారుల ఐక్యవేదిక ద్వారా కళాకారులను అందించారు. ఆయన సపోర్ట్ లేకుండా సినిమా త్వరగా పూర్తయ్యేది కాదు. హిందూపూర్ ప్రజలు ఎంతోగానో సపోర్ట్ చేశారు. మార్చి 4న విడుదలవుతుంది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో చిన్నమార్పును తీసకొస్తుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ ‘’సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కొత్త స్కీమ్ తో సినిమాను రిలీజ్ చేయడం బావుంది. బిజినెస్ త్వరగానే పూర్తవుతుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా ప్రవీణ్ సత్తారుగారు చేసిన సినిమా. డెఫనెట్ గా సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కొత్త ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాన్ని నేను కూడా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘’’’సిధ్ధు చాలా బ్రిలియంట్ యాక్టర్. మంచి టీం కుదిరింది. దర్శకుడు ప్రవీణ్ తో గత చిత్రం చందమామ కథలు పనిచేశాను. ఆయన గురించి బాగా తెలుసు. ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటుంది’’ అన్నారు.

నరేష్ మాట్లాడుతూ ‘’ప్రవీణ్, సిద్ధు ఓ రోజు మా ఇంటికి వచ్చి ఓ కథ వినమన్నారు. వినగానే నాకు బాగా నచ్చింది. చందమామ కథలో ప్రవీణ్ దర్శకత్వంలో సినిమా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించడం గొప్పకాదు. ఒక ఫస్ట్ ఫిలింలా భావించి నటించాను. టీంతో ఒక వ్యక్తిలా ట్రావెల్ చేశాను. ట్రైలర్ విడుదలైన తర్వాత 48 గంటల్లో సినిమా బిజినెస్ పూర్తయ్యింది. ఇప్పుడు రీసేల్ కూడా అవుతుంది. సిద్ధు గురించి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. తనతో సహా అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సముద్ర మాట్లాడుతూ ‘’ప్రవీణ్ సత్తారు, నిర్మాత రాజ్ కుమార్ సహా నటీనటులకు, టెక్నిషియన్స్ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ ‘’నాకు ప్రవీణ్ సత్తారు ఇష్టమైన దర్శకుడు. చాలా ధైర్యస్థుడు. ఇలాంటి దర్శకులు మరికొంత మంది వస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ ‘’శ్రీచరణ్ మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ఉంది. దర్శక నిర్మాతలకు థాంక్స్. సిద్ధు మంచి కోస్టార్. సినిమా మార్చి 4న విడుదలవుతుంది. ప్రేక్షకలు ఆదరిస్తారని భావిస్తున్నాను‘’ అన్నారు.

సిద్ధు మాట్లాడుతూ ‘’శ్రీచరణ్ ఈ సినిమా తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. నరేష్ గారు, శ్రద్ధాదాస్ హార్డ్ వర్కింగ్ పర్సన్. రష్మీ పనిచేయడం హ్యపీగా ఉంది. ప్రవీణ్ సత్తారు గారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు తెలియని విషయాలను చాలా నేర్పించారు. సెన్సిబుల్ డైరెక్టర్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ ‘’ అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, నరేష్, శ్రద్ధాదాస్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవిప్రకాష్, అపూర్వ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల, నిర్మాత: రాజ్ కుమార్.ఎం., కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved