21 July 2016
Hyderabad
చెన్నమనేని శ్రీదర్, జ్యోతిసేథీ, సంజన,శ్రవణ్ కీలక పాత్రధారులుగా శ్రీ నందన్‌మూవీస్ పతాకంపై పల్లెల వీరారెడ్డి దర్శకత్వంలో మహేష్ కల్లే నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `హ్యపీ బర్త్‌డే`. జి.సంతోష్ రెడ్డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోవిడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీని విడుదల చేశారు. ఎమ్మెల్యే బాలరాజు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఈ సందర్భంగా...
బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ``శ్రీధర్ ఒక మంచి నటుడు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంతోష్‌రెడ్డి మంచి పాటలను అందించారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఓ టీంగా చేసిన ప్రయత్నం దర్శక నిర్మాతలు సహా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ``శ్రీధర్ మంచి హార్డ్‌వర్కర్. మ్యూజిక్ డైరెక్టర్‌కు అభినందనలు. దర్శక నిర్మాతలకు నటీనటులు, టెక్నిషియన్స్‌కు మంచి పేరు తెచ్చే చిత్రం కావాలి`` అన్నారు.
Glam galleries from the event |
|
|
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ``టీం అందరికీ ఆల్ ది బెస్ట్. శ్రీధర్‌కు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత మహేష్ కల్లే మాట్లాడుతూ ``ఈ చిత్రంలో కథ, కథనం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు కథను సరికొత్తగా తెరకెక్కించాడు. మేజర్ పార్ట్ అంతా హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందరకీ థాంక్స్`` అన్నారు.
దర్శకుడు పల్లెల వీరారెడ్డి(చేగువేరా) మాట్లాడుతూ ``కొన్ని సంవత్సరాలు క్రితం జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రాసిన కథ. ఒక ఇంట్లో ఓ జంటకు ఎదురైన ఘటనల సమాహారమే ఈ చిత్రం. రాత్రి 8 గంటలు నుండి 12 గంటలు మధ్య ఏం జరిగిందనేదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సంతోష్ రెడ్డి మంచి మ్యూజిక్ అందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ``అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, శ్రీధర్‌గారికి థాంక్స్`` అన్నారు.
శ్రీధర్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను. మంచి కథ, కథనంతో రూపొందుతోన్న చిత్రం. అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు నచ్చే చిత్రమవుతుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.గోపాల్, సంజన, కపిల్ రాజ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
చెన్నమనేని శ్రీదర్, జ్యోతిసేథీ, సంజన, శ్రవణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః వాసిరెడ్డి సత్యానంద్, సంగీతః సంతోష్ రెడ్డి, ఆర్ట్ః మురళీకృష్ణ కొండేటి, ఎడిటర్ః మహేంద్రనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కొటేశ్వరరావు, కో డైరెక్టర్ః గండికోట రవికుమార్, నిర్మాతః మహేష్ కల్లే, దర్శకత్వంః పల్లెల వీరారెడ్డి(చేగువేరా).