డా.స్వర్ణలత, సురేష్‌బాబు సమర్పణలో శ్రీ శ్రీనివాస ఫిలింస్ బ్యానర్‌పై డా.అశోక్ చంద్ర, తేజరెడ్డి, కారుణ్య హీరో హీరోయిన్లుగా కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు నిర్మించిన చిత్రం 'ఇదో ప్రేమలోకం'. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను లయన్ సాయివెంటక్ విడుదల చేసి తొలి సీడీని సీనియర్ నరేష్‌కు అందించారు. ఈ సందర్భంగా...
సాయివెంకట్ మాట్లాడుతూ - ''డైరెక్టర్ కరణ్‌రాజ్, కోడి రామకృష్ణగారి వద్ద పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్. చిన్న సినిమా అయినా మేకింగ్ చాలా బావుంది. చిన్న సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొనడానికి ముందుకు రావడం మంచి పరిణామం. వందేమాతరం శ్రీనివాస్‌గారు మంచి మ్యూజిక్ అందించారు. నాటక రంగం నుండి వచ్చిన ఎస్.పి.నాయుడుగారు, కొడుకు అశోక్ చంద్రను డాక్టరు చదివించినా, తన కోరిక తీర్చుకోవాలని కొడుకుని హీరో చేశారు. అశోక్ చక్కగా నటించాడు. సీనియర్ నరేష్‌గారు కీలక పాత్రలో నటించి తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
దర్శకుడు కరణ్ రాజ్ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు నరేష్‌గారి క్యారెక్టర్ హైలైట్. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పిస్తారు. ఆయనకు తప్పకుండా అవార్డు వస్తుందని భావిస్తున్నాను. అలాగే మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో సుమన్‌గారు నటించారు. ఆయన పాత్ర కూడా అద్భుతంగా వచ్చింది. హీరో అశోక్ కొత్తవాడైనా మంచి ఈజ్‌తో నటించాడు. ప్రొడ్యూసర్ ఎస్.పి.నాయుడుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. దర్శకుడిగా అవకాశం ఇవ్వడమే కాకుండా, సినిమాకు ఏం కావాలో అవన్నీ సకాలంలో అమర్చారు. వందేమాతరంగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.
Karunya Glam gallery from the event
నిర్మాత ఎస్.పి.నాయుడు మాట్లాడుతూ - ''నాది కోదాడ. నేను 30 ఏళ్ళు నాటకాల్లో కూడా నటించాను. నా ఆలోచనలతో నా కొడుకుని డాక్టరు చేసినా, కరణ్‌రాజ్ చెప్పిన కథ నచ్చడంతో హీరోగా పెట్టి సినిమాను నిర్మించాను. నరేష్‌గారు ఎంతో అద్భుతంగా నటించారు. వందేమాతరంగారు ఎంతో మంచి ట్యూన్స్‌ను అందించారు. సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్'' అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ''లవ్‌స్టోరీలో కొత్త కోణంలో కనపడుతుంది. కరణ్‌రాజ్‌గారు కోడిరామకృష్ణగారి వద్ద ఎన్నో సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన వ్యక్తి. అశోక్ కొత్తవాడైనా ఎంతో చక్కగా నటించాడు. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
హీరో డా.అశోక్ చంద్ర మాట్లాడుతూ - ''సినిమాలపై మక్కువతో మా నాన్నగారు డాక్టరు చదివిన నన్ను యాక్టరుగా కూడా చేశారు. నరేష్; సుమన్ వంటి సీనియర్ నటీనటులందరూ నటన విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. కరణ్‌రాజ్‌గారు ఎంతో చక్కగా డైరెక్ట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
సీనియర్ నరేష్, సుమన్, భగవాన్, మెల్కోటి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, పాటలు: టి.కరణ్‌రాజ్, ఎ.కరుణాకర్, చిలకర్కరే గణేష్, కెమెరా: కె.శివ, సమర్పణ: డా.స్వర్ణలత, సురేష్‌బాబునిర్మాత: ఎస్.పి.నాయుడ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.కరణ్‌రాజ్.