pizza
Janatha Garage Music Launch
'జనతాగ్యారేజ్‌' ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 August 2016
Hyderaba
d

ఎన్టీఆర్‌సమంతనిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేనివై.రవిశంకర్‌సి.వి.మోహన్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'జనతాగ్యారేజ్‌'. దేవిశ్రీప్రసాద్‌ సంగీతంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌చిత్ర దర్శకుడు కొరటాల శివదేవిశ్రీ ప్రసాద్‌నిత్యామీనన్‌సాయికుమార్‌ఉన్ని ముకుందన్‌సుకుమార్‌ శుభగృహ కల్యాణ్‌ చక్రవర్తిశ్రీనివాస్‌అజయ్‌బ్రహ్మాజీరాజీవ్‌ కనకాలబి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ప్రసాద్‌ వి.పొట్లూరిదిల్‌రాజువక్కంతం వంశీసినిమాటోగ్రాపర్‌ తిరుఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రసాద్‌ వి.పొట్లూరిబి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌దిల్‌రాజు సహా చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఎన్టీఆర్‌ బిగ్‌ సీడీనిఆడియో సీడీలను విడుదల చేశారు.

సుకుమార్‌ మాట్లాడుతూ ''నటనలో చాయిస్‌ వదలకుండా యాక్ట్‌ చేసే నటుడు ఎన్టీఆర్‌. తనతో సినిమా చేసిన తర్వాత మా మధ్య ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడింది. దేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిశ్శబ్దం తప్ప వేరే ఏం లేదు. కొరటాల శివ కమర్షియల్‌ సినిమాకు అప్‌డేట్‌ వెర్షన్‌. నేను నెక్ట్స్‌ సినిమా చేయబోయే సినిమా నిర్మాతలు చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్‌కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సెన్సేషన్‌ క్రియేట్‌ అవుతుంది. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ''ఈ చిత్రంలో ఉడుకు రక్తాన్ని కొత్తగా చూపిస్తాడు ఎన్టీఆర్‌. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలి. మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన కొరటాల శివగారికి థాంక్స్‌. దేవిశ్రీప్రసాద్‌ సహా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ ''నిర్మాతలు మైత్రీ మూవీ బ్యానర్‌లో లాగానే అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారు. కొరటాల శివ నిజాయితీ ఉన్న దర్శకుడు. సినిమా చూసే ఆడియెన్స్‌కు గూస్‌ బవ్స్‌ు వస్తాయి. సీనియర్‌ ఎన్టీర్‌తో యాక్ట్‌ చేసే అదృష్టం రాలేదు కానీ ఇప్పుడున్న ఎన్టీఆర్‌తో కలిసి యాక్ట్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మందితో యాక్ట్‌ చేశాను. తను గూగుల్‌లాంటోడు. డ్యాన్సులు రిహార్సల్‌ కూడా చేయకుండా చేసేస్తుంటాడు. డైలాగ్స్‌ కూడా సింగిల్‌ టేక్‌లో చేసేస్తాడు. తనకు ఇన్ని కళలు ఎలా వచ్చాయనిపిస్తుంది. సీనియర్‌ ఎన్టీఆర్‌ ఆశీస్సులు వల్లే తనకు ఇది సాధ్యమవుతుంది. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు.

అజయ్‌ మాట్లాడుతూ ''చాలా మంచి క్యారెక్టర్‌ చేశాను. దేవిశ్రీ మ్యూజిక్‌ మామూలుగా లేదు. ఆరాచకంగా ఉంది. నిర్మాతలు బాగా చూసుకున్నారు. జయహో జనతాగ్యారేజ్‌'' అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ లుక్‌ బావుంది. గ్యారంటీ మంచి చిత్రమవుతుంది'' అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ''నేను షూటింగ్‌ టైంలో సాంగ్స్‌ విన్నాను. టైటిల్‌ సాంగ్‌ప్రణామం సాంగ్‌ వినగానే షూర్‌ ష్యాట్‌ హిట్‌ అవుతుందనిపించింది. సింహాద్రి ఎలాంటి వేవ్‌ ఇచ్చిందో అలాంటి వేవ్‌తో ఈ సినిమా రాబోతుందనిపించింది. జనతాగ్యారేజ్‌ తన కెరీర్‌లో నెంబర్‌వన్‌ సినిమా అవుతుంది. ఈ సినిమాతో కొరటాల శివ హ్యాట్రిక్‌ కొట్టి మరో రేంజ్‌లో ఉంటాడు. నిర్మాతలు శ్రీమంతుడుతో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ కొడతారు. మరో సినిమాను వారు హ్యాట్రిక్‌ కోసం రెడీ చేసుకోవాలి'' అన్నారు.

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ''దర్శక నిర్మాతలకు అభినందనలు. తారక్‌ నా తమ్ముడు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. అలాగే తారక్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు.

Glam galleries from the event

వక్కంతం వంశీ మాట్లాడుతూ ''కొరటాల నాకు ఇష్టమైన డైరెక్టర్‌. ఎన్టీఆర్‌కొరటాలగారు కలిసి చేస్తున్న ఈ సినిమాతో పాత రికార్డులన్నీ రిపేర్‌ అయిపోవాలి. మంచి టీంతో తయారవుతున్న సినిమా. దేవిగారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. ప్రణామం అనే పాట నాకు బాగా నచ్చింది. ఎంటైర్‌టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ ''నేను సీనియర్‌ ఎన్టీఆర్‌గారి ఆశీస్సులతోనే ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అయ్యాను. ఇప్పుడు ఈ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం అవకాశం కలిగింది. ఇప్పుడు ఈ సినిమా అభిమానులదే. నాకు ఈ సినిమాలో క్యారెక్టర్‌ చేసే అవకాశం రాగానే చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. దేవి రాకింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. మోహన్‌లాల్‌ వంటి వండర్‌ఫుల్‌ నటుడితో చేసే అవకాశం వచ్చింది. ప్రతి రోజు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌తో వర్క్‌ చేశాం. తెలుగు ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ ది గ్రేట్‌ ఫిలిం అవుతుంది'' అన్నారు.

ఉన్ని ముకుందన్‌ మాట్లాడుతూ ''అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు చాలా పెద్ద థాంక్స్‌. ఎన్టీఆర్‌తో కలసి ఈ సినిమాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులు ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది'' అన్నారు.

నిత్యామీనన్‌ మాట్లాడుతూ ''నేను సినిమాలు చేసేటప్పుడు ఎన్టీఆర్‌తో ఎప్పుడు సినిమా చేస్తున్నావని అడిగేవారు. ఈ సినిమాలో తనతో పనిచేసే అవకాశం కలిగింది. మంచి కంటెంట్‌ ఉండే కమర్షియల్‌ సినిమాల చేయాలని ఎప్పటి నుండో ఉండేది. కొరటాల శివగారు నా కోరికను తీర్చారు'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ ''ఇది ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఫీలవుతున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. రైటర్‌గా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. పెద్దగా మాట్లాడేవాడిని కాను. ఇదే వేదికపై అన్న ఎన్టీఆర్‌గారు నన్ను పరిచయం చేశారు. అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. అందుకే ఎన్టీఆర్‌ సినిమా అంటే నాకు స్పెషల్‌. ఎన్టీఆర్‌ ఎనర్జీకి మ్యాచ్‌ చేసేలా రాయాలని ఎప్పుడూ అనుకుంటూ ఈ సినిమా కోసం పనిచేశాను. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మెయిన్‌టెయిన్‌ చేయాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు మోహన్‌లాల్‌గారు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలాంటి వ్యక్తికి నేను యాక్షన్‌ చెప్పాను. అంతకు మించి బెస్ట్‌ యాక్టర్స్‌ ఎన్టీఆర్‌మోహన్‌లాల్‌ను ఒక ఫ్రేమ్‌లో పెట్టి యాక్షన్‌ చెప్పాను. అది నాకు చాలు. చాలా సుడి ఉంది. సమంతనిత్యామీనన్‌ వంటి హీరోయిన్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ బెస్ట్‌ టీంను పెట్టుకుంటాను. సినిమాటోగ్రాఫర్‌గారు తిరుగారు అద్భుతమైన టెక్నిషియన్‌. ఆయనతో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. చాలా ఎగ్జయిట్‌మెంట్‌ ఇస్తూ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాడు. ప్రతి సీన్‌కు ఎలాంటి మూడ్‌ ఉంటుందో దానికి తగ్గ వర్క్‌ ఇచ్చారు. రామజోగయ్యగారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. దేవిశ్రీప్రసాద్‌గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. సీన్‌ చెబుతున్నప్పుడే ఆయన ప్రణామం ట్యూన్‌ ఇచ్చారు. అంతటి స్పాంటేనియస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. సాయికుమార్‌గారు నటన నన్ను కట్టి పడేసింది. బెనర్జీబ్రహ్మాజీఅజయ్‌ వంటి వారితో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నెమ్మదస్థులుమంచివాళ్లు. సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టే ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు. వారికి స్పెషల్‌ థాంక్స్‌. సెప్టెంబర్‌2న ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాం. కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''కొరటాలగారితో మిర్చిశ్రీమంతుడు తర్వాత చేస్తున్న సినిమా. కమర్షియల్‌ సినిమాకు వాల్యూస్‌ కలిపి ట్రెండ్‌ను మార్చేశారు. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్‌ అందించారు. నా మిత్రుడు ఎన్టీఆర్‌కు థాంక్స్‌. తనను నేను తలైవా అని పిలుస్తుంటాను. నాకు అన్నీ వేళ్లలో అండగా నిలబడే మిత్రుడు. యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో ఏమో కానీ మహానుభావుడికి మనవడిగాఅద్భుతమైన తల్లిదండ్రులకు కొడుకుగామీ లాంటి వారికి అన్నగాతమ్ముడిగా పుట్టే అవకాశం కలిగింది. ఈ రుణం తీరిపోనిదని అనుకుంటాను. పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కర కాలం వస్తుంది. నిన్ను చూడాలని సినిమా టైంలో ఎక్కడికెళుతున్నానోఏమవుతున్నానో తెలిసేది కాదు. తర్వాత ఆది సినిమాతర్వాత సింహాద్రి సినిమా దక్కింది. అంత బాగా ఉంది కదా అనిపించింది. కానీ మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలేం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి వ్యక్తి క్రిందకు పడిపోవాలి. దేవుడు మొటిక్కాయలు మొట్టి నువ్వు క్రిందకు పడరా..అప్పుడే నీకు జీవితం అంటే తెలుస్తుందని అన్నాడు. చాలా కాలం నేనెంత బాధపడ్డాను. అభిమానులెంత బాధపడ్డారో తెలుసు. నాలో నేను కమిలిపోయాను. కానీ ఒకరోజు వక్కంతం వంశీ టెంపర్‌ కథ చెప్పాడు. దూరంగా వెలుగులా ఆ కథ కనపడింది. పూరి జగన్నాథ్‌ అనే దర్శకుడు స్వతహాగా మంచి రచయితే అయినా ఏదో చేద్దామనుకని నాకంటే ముందు పరిగెత్తాడు. అందరం ముందుకెళ్లాం గమ్యం దగ్గరయ్యాం. తర్వాత నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది. ఆ సినిమాకు ముందు నా లుక్‌ చూసి చాలా మంది ఇదేంటి ఇలా ఉంది. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని అనుకున్నారు. కానీ అభిమానులు ఆశీర్వాదంనమ్మకంతో నా గమ్యం ఇంకా దగ్గరైంది. లైట్‌ ఇంకా దగ్గర కనపడింది. ఆ లైట్‌ ఏదో కాదు జనతాగ్యారేజ్‌. రెండు సంవత్సరాలు క్రితం శివ నాకు చెప్పిన కథే ఇది. నాకున్న ప్లాప్‌ సినిమాలతో బిజీగా ఉండి కథ విని చేయలేదు. రచయిత కలం ఎప్పుడు అగకూడదు. ఆ రచయిత కలం అగిపోతే తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాదు. అదే దర్శకుడికి ఆ రాతను ఎంత తక్కువ చేసి చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది రచయితలకు రచనతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది దర్శకుల్లో నా కొరటాల శివ ఉన్నాడని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. తను ఒక కథే రాస్తాడు. దానికి ఒక కథానాయకుడిని ఎన్నుకుంటే అతనే చివరకు కథానాయకుడు. అంత మనసు పెట్టి కథ రాసుకుంటాడు. చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే వరుస సక్సెస్‌లు ఇస్తారు. ఆ వరుసలో చూసుకంటే జనతాగ్యారేజ్‌ శివకు హ్యాట్రిక్‌ చిత్రమవుతుంది. కొరటాల శివకు థాంక్స్‌. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటుడి పక్కన గొప్ప మనిషివ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన నటించే అవకాశాన్ని కల్పించాడు. ఆయనలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేం. చాలా ఆనందంగా ఉంది. దేవి గురించి ఎన్నిసార్లు చెప్పినా,ఎంత చెప్పినా తక్కువే. వర్క్‌ గురించి ఎప్పుడూ ఆలోచించి దేవిలాంటి వ్యక్తులు అరుదు. పాట కోసం తను పడే కష్టం అంతా ఇంతా కాదు. దేవితో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. సమంతనిత్యామీనన్‌ వంటి మంచి నటీమణులు,అజయ్‌బ్రహ్మాజీఎడిటర్‌ చంటిగారు సహా చాలా మంచి టీంతో పనిచేశాను. నాకు దేవర్‌మగన్‌(క్షత్రియపుత్రుడు) సినిమా అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన తిరుగారుతర్వాత నా ఫేవరేట్‌ సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరాంగారి వద్ద వర్క్‌ చేశారు. ఇప్పుడు నా సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసి ఈరోజు నా ఫేవరేట్‌ సినిమాటోగ్రాఫర్‌ అయ్యారు. తిరుగారితో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామజోగయ్య శాస్త్రి తర్వాత నా సినిమాకు సింగిల్‌ కార్డ్‌ సాంగ్స్‌ రాసిన రచయిత ఆయనే. ఈ చిత్ర నిర్మాతలు ఎంతో మంచి మనసున్న నిర్మాతలు. వీరెన్నో మంచి చిత్రాలు చేసి తెలుగు సినిమా ఎదుగులకు తోడ్పాడాలి. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు వచ్చాయి. పక్క రాష్ట్రాల నుండి ఎంతో మంది ప్రజలు వస్తుంటారు. వారందరికి తెలుగువారి గొప్పతనాన్ని తెలియజేసేలా మన ఆదరణ ఉండాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో నా కటౌట్‌కు పాలాభిషేకం చేయడం నేను గమనించాను. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే పాలాభిషేకం చేసేది దేవుడికి మాత్రమే. నేను దేవుడిని కాను. నేను మీ తమ్ముణ్ణోఅన్ననో. నేను మీ అభిమాన నటుడిని. అదే పాల ప్యాకెట్‌ను ఓ అనాథ అశ్రమానికి ఇస్తే బావుంటుందని నేను కోరకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పోషకాహారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఓ మూగజీవి బలిచ్చారు. సినిమా అంటే ప్రాణం పోసేదే కానీతీసేది కాదు. ఇలా బలి ఇవ్వడానికంటే బదులుగా అన్నదానం చేయండి. ఒక కడుపుకు అన్నం పెడితే చాలా మంచిది. నా అభిమానులు దీన్ని పాటిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి .  నిర్మాతలు - నవీన్ యెర్నేని,వై. రవిశంకర్మోహన్ (C. V. M.)  రచన  - దర్శకత్వం - కొరటాల శివ. 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved