సాయికొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సాయి శివాని సమర్పణలో వారాహిచలన చిత్రం బ్యానర్ పై నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద. కల్యాణ్ రమణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్యమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో యం.యం.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి, నారా రోహిత్, నాగశౌర్య, కల్యాణ్ కోడూరి, నాని, శశాంక్, నందినీ రెడ్డి, రమా రాజమౌళి, స్మిత, విజయేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, భాస్కరభట్ల, జెమినికిరణ్, వల్లి తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. పెన్ డ్రైవ్స్ రూపంలో పాటలను మార్కెట్లోకి విడుదల చేశారు.
యం.యం.కీరవాణి మాట్లాడుతూ ``మేజర్ స్కేల్‌లో మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్‌లో మా తమ్ముడు కల్యాణ్‌కు, టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఆ ఇద్దరూ నిజమైన అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు- `జ్యో అచ్యుతానంద` ఆడియోలో రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ -``ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. కామెడి, రొమాన్స్, సంగీతం, సస్పెన్స్ అన్ని మసాలాలు ఉన్న సినిమాలా ఉంది. రొమాంటిక్ ఫిలింలా.. సరాదాగా సాగే మ్యూజికల్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ట్రైలర్‌లో రకరకాల సస్సెన్స్ కనిపిస్తోంది. ఓ సూపర్‌హిట్ ఫిలిం ట్రైలర్ చూసినట్టుంది. రోహిత్, నాగశౌర్యల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అన్నదమ్ముల్లా చక్కగా కనపడుతున్నారు. రెజీనీ మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. కల్యాణ్ రమణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ బావున్నాయి. పాయికొర్రపాటిగారు దర్శకుడిపై నమ్మకంతో సినిమా చేసే నిర్మాత. అదే నమ్మకంతో శ్రీని దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
మరకతమణి యం.యం.కీరవాణి మాట్లాడుతూ - ``మేజర్ స్కేల్‌లో సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్టర్స్‌లో మా తమ్ముడు కల్యాణ్ ఉన్నారు. తనకు, చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ -``శ్రీనిలో సెన్సాఫ్ హ్యుమర్ వైవిధ్యంగా కనిపిస్తుంది. ఈ కథ .. నేను కూడా విన్నా. విన్నంత సేపు బాగా నవ్వాను. కథలోని ఎమోషనల్‌తో బాగా కనెక్ట్ అయ్యాను. పెద్ద హిట్ అవుతుంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌లో నేను `ఈగ` సినిమా చేశాను. కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే నిర్మాతల్లో సాయికొర్రపాటి ఒకరు. కల్యాణ్ కోడూరి చక్కని సంగీతం అందించారు. రోహిత్, నాగశౌర్య, రెజీనాలకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి`` అన్నారు.
చిత్ర కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ- ``జ్యో అచ్యుతానంద టైటిల్ ఎలా కలిసి పోయిందో సెట్స్‌లో నారా రోహిత్, నేను అలా కలిసి పోయాం. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్, తమిళం నుంచి పోటీ ఏర్పడింది. ఎంత పెద్ద యాక్టర్స్ వచ్చినా మా కెమిస్ట్రీని ఎవరూ బీట్ చేయలేరు. జీవితం అంటే సినిమాలా ఓ జర్నీ. ఈ జర్నీలో అవసరాల శ్రీనివాస్, సాయికొర్రపాటిగారిని కలిశాను. ఆ ఇద్దరూ లేకుంటే నేను ఓ సాధారణ అభిమాని అయ్యుండేవాడిని. ఈ బ్యానర్‌లో నేను మరో సినిమా కూడా చేయబోతున్నాను. నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను అంత గౌరవమిచ్చే వ్యక్తి సాయికొర్రపాటిగారికే. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనలా ఏనిర్మాతా ఉండరు. కల్యాణి మాలిక్ మంచి మ్యూజిక్ అందించారు`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ- ``ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న రిలేషన్‌కి సంబంధించిన సినిమా ఇది. శ్రీనివాస్ అవసరాల వల్లే ఈ సినిమా చేశాను. ఈ జర్నీలో నాకు నాగశౌర్య లాంటి సోదరుడు దొరికాడు. కథను నమ్మి సినిమా చేసే మంచి నిర్మాత సాయికొర్రపాటి. నేను ఆయన బ్యానర్‌లో `రాజా చెయ్యి వేస్తే` సినిమా చేశాను. ఆ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా.. ఈ సినిమా కలిసి చేశాం. మూవీకి ఏం అవసరమో దాన్ని నమ్మి పెట్టారు. కల్యాణ్ కోడూరి చక్కని సంగీతం అందించారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా`` అన్నారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ -``ముందుగా నారా రోహిత్‌కు కథ చెప్పాను. ఆయన చేయడనుకున్నాను కానీ చేస్తానన్నారు. అలాగే ఆనంద్ ఆనే పాత్ర రాసుకునేటప్పుడే నాగశౌర్యనే హీరో అనుకున్నాను. నారారోహిత్, నాగశౌర్యలు నిజమైన అన్నదమ్ముల్లా యాక్ట్ చేశారు. నా ఊహలు గుసగులాడే చిత్రాన్ని ఆదరించిన తరహాలోనే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా`` అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ ``శ్రీని అవసరాల నాకు చాలా మంచి మిత్రుడు. బాగా నచ్చిన దర్శకుడు. శ్రీని సినిమాలు హాయినిస్తాయి. ఊహలు గుసగులాడే ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. కల్యాణ్ మెలోడి మ్యూజిక్ ఇచ్చాడు. నాగశౌర్యతో వర్క్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేశాను. రోహిత్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ పోతున్నాడు. రెజీనాకు అభినందనలు. సాయికొర్రపాటిగారి వంటి నిర్మాతలుంటే డిఫరెంట్ సినిమాలు వస్తాయి`` అన్నాయి.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ``శ్రీనిని మొదటిసారి కలిసినప్పుడే ఇతను మంచి రచయిత, దర్శకుడు అవుతాడనిపించింది. తనకు సినిమాలపై మంచి నాలెడ్జ్ ఉంది. మంచి సెన్స్ ఆఫ్ హ్యుమర్, సెన్సిబిలిటీ ఉన్నాయి. స్క్రీన్ ప్లే చదివాను. కొత్త రకమైన కథ. రోహిత్ ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమాలో నేను ఒక షాట్‌ను గౌరవ దర్శకత్వం కూడా చేశాను. శ్రీని ఈ సినిమాతో రాక్ చేస్తాడు`` అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.