ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, వరుస బ్లాక్‌బస్టర్స్ కథలతో సూపర్‌డూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘రోజులు మారాయి’. మురళీకష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, మారుతి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అనిల్ రావిపూడిజి.నాగేశ్వరరెడ్డి, సాయిరాజేష్, దశరథ రామిరెడ్డి, హీరో రోహిత్, సత్యానంద్, కల్వకుంట్ల తేజేశ్వరరావు, ఉద్ధవ్, చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, నక్షత్ర, ఆదిత్య నిరంజన్, డార్లింగ్ స్వామి, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా...
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ``టీం అంతటికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
కాసర్లశ్యామ్ మాట్లాడుతూ``మారుతిగారితో ఈరోజుల్లో చిత్రం నుండి పరిచయం ఉంది. నాకు సినిమాలో అడుగులు నేర్పించింది మారుతిగారైతే ఆ అడుగులను సుప్రీం చిత్రంతో నడకగా మార్చింది మాత్రం దిల్‌రాజుగారే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మూడు పాటలను రాసే అవకాశం కలిగించారు. అందుకు థాంక్స్`` అన్నారు.
జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ``దిల్‌రాజుగారు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా సక్సెస్ కావడం అనేది చిన్న విషయం కాదు. ఆయనలో మంచి ప్రేక్షకుడు ఉన్నాడు, అందుకే ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే మారుతి సక్సెస్‌ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. జె.బి. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయనతో త్వరలోనే సినిమా చేశాను. నిర్మాత శ్రీను చాలా ఆలోచించి పనిచేసే వ్యక్తి. తను ఈ సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా సినిమా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. టీం అంతటికీ థాంక్స్`` అన్నారు.
సాయిరాజేష్ మాట్లాడుతూ``మాటలు, కథ అందించిన మారుతిగారికి, చిన్న సినిమాలను ప్రోత్సాహిస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్. ఎంటైర్ టీంకు అభినందనులు`` అన్నారు.
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ``దిల్‌రాజుగారు మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు. ఈ సినిమా టైటిల్‌లోనే సక్సెస్ కనపడుతుంది. యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కథను అందించగా, సినిమాను అన్నీ వర్గాల ప్రేక్షకుల తీసుకెళ్లగల నిర్మాత శ్రీను చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హవీష్ మాట్లాడుతూ``టీజర్ చూశాను. బావుంది. పాటలు కూడా బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రాధాకృష్ణ మాట్లాడుతూ``దిల్‌రాజుగారు, మారుతిగారు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా బావుంటుందని భావిస్తున్నాను. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ``మారుతిగారు ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగానే సినిమాలను చేస్తారు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ``దిల్‌రాజుగారు,మారుతి సక్సెస్ మీదున్నారు. ఈ చిత్రం వారికి మరో హిట్ తెచ్చిపెడుతుంది. చేతన్ హీరోగా పరిచయమవుతున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్. పార్వతీశం కామెడి టైమింగ్ చాలా బావుంది. జెబిగారికి, డైరెక్టర్ మురళీకృష్ణగారికి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చిత్ర దర్శకుడు మురళీకృష్ణ ముడిదాని మాట్లాడుతూ``కథ, స్క్రీన్‌ప్లే అందించిన మారుతిగారికి థాంక్స్. నిజ ఘటన ఆధారంగా మారుతిగారు తయారు చేసుకున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాకంటే ముందు ఈ సినిమాను ఆయన చేద్దామనుకున్నారు. కానీ ఆ కథను నాకు ఇచ్చి నన్ను దర్శకుడిని చేసినందుకు ఆయనకు థాంక్స్`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జెబి మాట్లాడుతూ``సినిమా, పాటలు బాగా వచ్చాయి. అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, మారుతిగారికి థాంక్స్`` అన్నారు.
చేతన్ మాట్లాడుతూ``నేను సినిమాల్లోకి వెళతాననగానే మా నాన్నగారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మారుతిగారు నాకు కెరీర్‌ను ఇచ్చారు. దిల్ రాజుగారు నాపై నమ్మకం పెట్టుకున్నందుకు ఆయకు థాంక్స్. మురళిగారి వద్ద చాలా విషయాలు నేర్చుకున్నాను. పార్వతీశం డేడికేషన్ ఉన్న నటుడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
కృతిక మాట్లాడుతూ``దిల్ రాజు, మారుతి, మురళీకృష్ణ ఇలా అందరికీ థాంక్స్. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తేజస్వి మాట్లాడుతూ``నేను సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుండి నా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. అప్పటి నుండి దిల్ రాజుగారు ఓ గైడ్‌లా నన్ను ముందుకు నడిపారు. కొత్తవాళ్లను బాగా ఎంకరేజ్ చేసే నిర్మాత. మారుతి, దిల్ రాజుగారు వంటి వ్యక్తులే ఓ మంచి సినిమా రూపొందడానికి కారణం. టీం అంతటికీ థాంక్స్`` అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ``కేరింతతో నాకు బ్రేక్ ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్. మురళిగారు, రవిగారు, లక్కిగారు చాలా కష్టపడ్డారు. తెర వెనుక నిద్ర లేకుండా కష్టపడ్డారు. దిల్‌రాజుగారికి, మారుతిగారికి థాంక్స్`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ``ఈ సినిమా గురించి మారుతి ఓ సారి కలిసి చెప్పాడు. నన్ను కూడా అసోసియేట్ అవమని చెప్పాడు. తన సక్సెస్‌లు, తన వెళ్లే విధానం నాకు నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూశాను. ఏదైతే మారుతి అనుకున్నాడో దర్శకుడు మురళి దాన్ని స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు. దర్శకుడుగా తను సక్సెస్ అయ్యాడు. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక అందరూ చక్కగా యాక్ట్ చేశారు. జెబి మంచి మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే తనతో నా బ్యానర్‌లో సినిమా చేయాలని అనుకుంటున్నాను. చాలా పాజిటివ్ మూమెంట్స్‌తో సినిమా పూర్తయ్యింది. సినిమా రెండు గంటల పదిహేను నిమిషాల వ్యవధితో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 1న విడుదలవుతుంది`` అన్నారు.
మారుతి మాట్లాడుతూ``ఒక ఆర్టికల్ నుండి పుట్టిన కథ ఇది. రవి, మురళి చక్కగా అడాప్ట్ చేసుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత సినిమా చూడగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఏ స్టోరీ అయితే రాసుకున్నామో అలా తెరకెక్కించారు. బాల్‌రెడ్డిగారు ప్రతి సీన్‌ను అంత బాగా చిత్రీకరించారు. మురళీకృష్ణగారు 24 గంటలు కష్టపడే వ్యక్తి. కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చాను. రవి, మురళిగారే కష్టపడి రాసుకున్నారు. కంప్లీట్ క్రెడిట్ టీంకు దక్కుతుంది. జెబిగారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక తమ చక్కటి నటనతో ఎంగేజ్ చేస్తారు. దిల్‌రాజుగారితో కలిసి చేస్తున్న తొలి సినిమా. సినిమా ఎలా వస్తుందోనని భయముండేది. కానీ చూసిన తర్వాత చాలా హ్యపీగా ఉంది. గుడ్ సినిమా గ్రూప్ శ్రీను మంచి నిర్మాత. ఈ చిత్రంతో తనకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజశ్వి, ఆలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర,వాసు ఇంటూరి, జబర్దస్త్ అప్పారావు, శశాంక్, రావిపల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసుదనరావు,హర్ష, సంధ్యజనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,స్క్రీన్‌ప్లే- మారుతి, సమర్పణ- దిల్ రాజు, సంగీతం- జె.బి, మాటలు- రవి నంబూరి, దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని