17 June 2016
Hyderabad
నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, ఎ.ఆర్.రెహమాన్, గోపీచంద్, నాగచైతన్య, అఖిల్, మంజిమ మోహన్, కోనవెంకట్, వంశీపైడిపల్లి, ఎం.వి.వి.సత్యనారాయణ, డి.వి.వి.దానయ్య, దశరథ్, బాబీ(కె.ఎస్.రవీందర్), కల్యాణ్ కృష్ణ, రెజీనా, రాకేందుమౌళి, అనంత్ శ్రీరాం, కృష్ణచైతన్య, డి.సురేష్ బాబు, అనిల్ రావిపూడి, డిజిపి దినేష్ రెడ్డి,సునైన తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీని అక్కినేని నాగార్జున, హీరో గోపీచంద్ విడుదల చేశారు. ఆడియో సీడీలను ఎ.ఆర్.రెహమాన్ విడుదల చేసి తొలి సీడీని అక్కినేని నాగార్జునకు అందించారు. ఈ సందర్భంగా...
కోనవెంకట్ మాట్లాడుతూ ``ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప టెక్నిషియన్స్ అయిన గౌతమ్ మీనన్, ఎ.ఆర్.రెహమాన్‌గారితో పనిచేసే అవకాశం నాకు కలిగింది. వాళ్ల వర్క్ చూస్తున్నప్పుడు మనం వాళ్లకు స్వాధీనమైనపోతాం. అటువంటి గొప్ప టెక్నిషియన్స్ చేతికి ఇద్దరు వజ్రాలైనా నాగచైతన్య, మంజిమమోహన్ లాంటి వాళ్లు దొరికినప్పుడు ఏ మాయ చేస్తారో చూడాల్సిందే. ఈ సినిమా కథ నా దగ్గరకు రాగానే నేను నిర్మాత రవీందర్‌రెడ్డిగారిని కలిసి కథ చాలా కొత్తగా ఉంది. అంతేకాకుండా గౌతమ్‌మీనన్, ఎ.ఆర్.రెహమాన్‌తో కలిసి పనిచేస్తున్నాం అనగానే ఆయన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మా బెస్ట్ మేం ఇచ్చాం. త్వరలోనే సినిమా మన ముందుకు రానుంది. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన గౌతమ్‌మీనన్‌గారికి థాంక్స్`` అన్నారు.
వంశీపైడిపల్లి మాట్లాడుతూ ``రెహమాన్ వంటి టెక్నిషియన్స్ ముందు నిలబడి ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. నేను ఊపిరి సినిమా చేసినప్పుడు నాగార్జునగారు,కార్తీగారిని హ్యండిల్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మరి గౌతంగారు రెండు భాషల్లో ఇద్దరు హీరోలతో ఎలా చేశారో అర్థం కావడం లేదు. నాగచైతన్య తనకంటూ ఓ దారిని క్రియేట్ చేసుకున్నారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ``ఈ మూవీ ఏ మాయ చేసావే అంత పెద్ద హిట్ కావాలి. కోనవెంకట్‌గారు ఏ పనిచేసినా డైనమిక్‌గా, కొత్తగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ``ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
దశరథ్ మాట్లాడుతూ ``అందరూ తమకంటూ ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసుకున్న వ్యక్తులు అందరూ కలిసి చేసిన సినిమా ఇది. గౌతమ్‌మీనన్‌గారు నాకు ఇష్టమైన దర్శకుడు. టీంకు అభినందనలు`` అన్నారు.
డైరెక్టర్ బాబీ(కె.ఎస్.రవీందర్) మాట్లాడుతూ ``నేను గౌతంమీనన్‌గారికి పెద్ద అభిమానిని, రెహమాన్ గారంటే ఎంత అభిమానమో చెప్పలేను. నాగచైతన్య ఇప్పటి తరం హీరోల్లో డేరింగ్ స్టెప్ట్స్ తీసుకుని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్టవుతుంది`` అన్నారు.
కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ``రెహమాన్‌గారు ఈ చిత్రంలో మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారు. గౌతంమీనన్, రెహమాన్‌గారు, చైతు కాంబినేషన్ ఏ మాయ చేసావే తర్వాత రిపీట్ అవుతుంది`` అన్నారు.
గౌతంమీనన్ మాట్లాడుతూ ``ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాను. అయితే ఈ సినిమా చేయడం ఆనందంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే రెహమాన్‌గారి మ్యూజిక్‌లో ఇంత మంచి సాంగ్స్ పొందినందుకు ఆయనకు థాంక్స్. చైతన్య జెంటిల్‌మన్, తనతో, మంజిమతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. చైతు కోసం మరో స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది. తను అవకాశం ఇస్తే కథ చెబుతాను. ఈ సినిమా యూనిట్ అంతటికీ థాంక్స్. కోనవెంటక్‌గారికి, నిర్మాత రవీందర్‌రెడ్డిగారి ఓపికకు థాంక్స్`` అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ``నా లైఫ్‌లో చిన్నప్పటి ప్రేమకథలకు గౌతంమీనన్‌గారి సినిమాలే కారణం. ఆయన నన్ను బాగా ఇంఫ్లూయెన్స్ చేశారు. చైతు, గౌతంమీనన్ గారు సహా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
Glam galleries from the event |
|
|
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ``రెహమాన్‌గారి సాంగ్స్ వింటుంటే లైవ్‌లో చూసినట్టు ఫీలింగ్ కలిగింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మరోసారి ఏ మాయ చేసావే తర్వాత మ్యాజిక్ రిపీట్ అవుతుంది. కోనవెంకట్, రెహమాన్ గారు, గౌతంమీనన్ గారికి అభినందనలు`` అన్నారు.
రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ ``ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ ``గౌతమ్ మీనన్, చైతన్య, రెహమాన్‌గారికి మరోసారి కలసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. రెహమాన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు`` అన్నారు.
చిత్ర నిర్మాత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ``సినిమా ప్రొడ్యూసర్‌గా నేను ఏం మాట్లాడినా తక్కువ అవుతుంది. సినిమా గురించి ఏం మాట్లాడాలన్నా గౌతంమీనన్‌గారే మాట్లాడాలి. నాగచైతన్య సినిమాలోనే కాదు, బయట కూడా హీరోనే. మాకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో డేట్స్ ఆడ్జస్ట్ చేశాడు. చాలా క్లారిటీతో ఉండే హీరో. ఆయన అందించిన సపోర్ట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. గౌతమ్ మీనన్‌గారు ఇంట్రడ్యూస్ చేసిన సమంతగారు ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉన్నారో తెలుసు. అలాగే మంజిమ కూడా పెద్ద సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అవుతుంది. రెహమాన్‌గారి గురించి నేను మాట్లాడేంతటివాడిని కాను. ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవాలంటే దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. కోనవెంకట్ సహా టీం అంతటికీ ధన్యవాదాలు`` అన్నారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ``రెహమాన్‌గారు మ్యూజిక్ వింటే థ్రిల్ ఫీలయ్యాను. అన్నయ్య ఏం చేసినా బావుంటుంది. ఈ సినిమాను తనెంత నమ్మారో నాకు తెలుసు. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ``గౌతమ్‌మీనన్‌గారు,రెహమాన్‌గారంటే నాకు ఇష్టం, గౌరవం. గౌతంగారి సినిమాలను ఇష్టపడతాను. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ చూస్తుంటే గీతాంజలిలో నాగార్జునగారిని చూస్తున్నట్లే ఉంది. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ ``నిర్మాత రవీందర్‌రెడ్డిగారితో మంచి పరిచయం ఉంది. రెహమాన్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్. గౌతమ్‌మీనన్‌గారితో గోలీమార్ సమయంలో పరిచయం ఏర్పడింది. చాలా స్టైలిష్ డైరెక్టర్. ఈ సినిమా ట్రైలర్ బావుంది. చైతన్య కొత్తగా కనపడుతున్నాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ ``రెహమాన్‌గారు అందిస్తున్న సపోర్ట్‌కు థాంక్స్. ఈ సినిమా ఆడియో అంచనాలకు మించి ఉంది. ఏ మాయ చేసావే సినిమాకు సంగీతం అందించినందకు ఆయనకు థాంక్స్ చెప్పలేకపోయాను.ఇప్పుడు ఆయనకు థాంక్స్ చెప్పుకునే అవకాశం కలిగింది. రెహమాన్‌గారితో పనిచేయాలనే కల అందరికీ ఉంటుంది. కానీ గౌతమ్‌మీనన్‌గారు ఆయన మ్యూజిక్‌లో నటించే అవకాశాన్ని రెండుసార్లు కలిపించారు. ఒక నటుడిగా నాకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్స్‌తో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటాను. అలాగే గౌతంమీనన్‌గారితో పనిచేయడం హ్యపీగా అనిపించింది. ఆయనతో పనిచేసిన ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఆయన నేర్పించిన విషయాలకు ఆయనకు థాంక్స్. ఏ మాయ చేసావే తర్వాత నాకు ఒక దారి ఏర్పడింది. ప్రేక్షకులు నన్ను లవ్ సినిమాల్లో చూడ్డానికి ఇష్టపడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మరో చాప్టర్ మొదలవుతుందని నమ్ముతున్నాను. కోనవెంకట్‌గారు, రవీందర్‌రెడ్డిగారు, హీరోయిన్ మంజిమ మోహన్ సహా టీం అందరికీ థాంక్స్. జూలైలో సినిమా విడుదలవుతుంది. అప్పుడు మళ్లీ కలుద్దాం`` అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``ఈ సినిమాకు సంబంధించి కొన్ని నిజ ఘటనలు చెప్పాలనుకుంటున్నాను. నాగచైతన్య పాటలను వినమని సీడీని తెచ్చి ఇచ్చాడు. నేను పాటలు వింటున్నాను. సడెన్‌గా అమల నా రూంలోకి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. వెళ్లిపోమాకే సాంగ్ వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సాంగ్స్ వింటుంటే ఎక్కడికో వెళ్లిపోతాం. ఇప్పుడు పాటలు విజువల్స్ చూసి థ్రిల్ అయ్యాను. నేను ఇలాంటి పాటలను మిస్ అవుతున్నందకు బాధగా ఉంది. నేను 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రెహమాన్‌గారి మ్యూజిక్‌లో ఒకే సినిమా చేశాను. చైతు అప్పుడే రెండు సినిమాలు చేసేశాడు. రెహమాన్‌గారు చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు ఆయన మనతో ఉన్నందుకు మనం గర్వపడాలి. గౌతంమీనన్ నన్ను కలిసిన ప్రతిసారి సార్ మీకొక కథ ఉంది. నెగటివ్ రోల్ చేస్తారా అని అడుగుతాడు. నేను నీ దర్శకత్వంలో అయితే తప్పకుండా చేస్తానని చెబుతాను. తర్వాత తను మాయమైపోతాడు. చైతుతో సినిమా చేస్తాడు. గౌతం మీనన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా విజువల్స్ బావున్నాయి. సినిమా విడుదలకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు ఈ టైటిల్ అంటే చాలా ఇష్టం. ఆ టైటిల్‌లోని సాహసం అనే పదాన్ని నేను గట్టిగా నమ్మాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ``నా తల్లిదండ్రుల పూజలు, గురువుల ఆశీర్వాదమే నా ఉన్నతికి కారణం. మంచి టీంతో వర్క్ చేశాను. వారితో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. విజువల్స్ నన్ను బాగా ఇన్‌స్ఫైర్ చేశాయి. అందుకే ఈ సినిమా పాటల కోసం రీవర్క్ చేశాను. నేను మన క్లాసిక్ మ్యూజిక్ విన్నాను. గేయ రచయితలు చాలా చక్కటి సాహిత్యాన్ని అందించారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్ ఆర్థర్, ఎడిటింగ్: ఆంటోని, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.