pizza

Bhairavam Pre Release Event
భైరవం కంటెంట్ చాలా నచ్చింది. యాక్షన్ సినిమాలు చూసే వారందరికీ సూపర్బ్ వైబ్ ఇస్తుంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి

You are at idlebrain.com > News > Functions
Follow Us


25 May 2025
Hyderabad

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరందరూ కూడా మాకు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. అది మాకు తెలుస్తుంది. ఈ సినిమాల్లో పని చేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ చరణ్ పాకాల గారు మ్యూజిక్ ఇరగదీశారు. మే 30న మీరందరూ సినిమా చూసి మా టీమ్ అందరిని బ్లెస్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. సినిమా మీ అందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి ఇష్టపడి మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలని ఇవ్వాలని ఉద్దేశంతో చేసాం. డైరెక్టర్ విజయ గారు సినిమాని చాలా కష్టపడి తీశారు. ఆయన హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్ కట్ చూశాను. అదిరిపోయింది. మామూలుగా ఉండదు. మే 30న మనందరికీ పెద్ద పండగ. ఆ పండగలో మీరందరూ భాగం కావాలని కోరుకుంటున్నాను. రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. మనోజ్ అన్నకి రోహిత్ గారికి అతిథి ఆనంద్ గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.సినిమా అద్భుతంగా ఉండబోతుంది. సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. లవ్ యు ఆల్'అన్నారు

హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది. రోహిత్ గారు నేను సాయి సొంత బ్రదర్స్ లాగే ఉన్నాం. ఈ సినిమాతో మా బంధం మరింత పెరిగింది. కలకాలం అది ఇలాగే ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను. అతిథి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఆనంది గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మా టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమా అనేది కులం చూడదు. మా కులం సినిమా. మా గుడి సినిమా ధియేటర్. ఇక్కడ ప్రతిభ ఉన్నవాళ్లే పైకి వస్తారు. ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మా నిర్మాత రాధా మోహన్ గారు కూడా మేము సక్సెస్ లో ఉన్నామా? సినిమాలు చేస్తున్నామా? ఇవేవీ లెక్కలేసుకోకుండా కేవలం మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశారు.సినిమా మా తల్లి. ఆ తల్లి అందరినీ సమానంగా చూసుకుంటుంది. డైరెక్టర్ విజయ్ గారు చాలా డెడికేషన్ తో సినిమాలు చేసే వ్యక్తి. ఒక పోస్ట్ కారణంగా ఆయనపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆయన మెగా అభిమాని. ఆయన పోస్టు పెట్టారో లేదో తెలియదు. మీ అందరికీ ఇబ్బంది కలిగినందుకు మా టీమ్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని మేమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన అభిమానులకి కృతజ్ఞతలు. భైరవం 30వ తారీఖున రిలీజ్ అవుతుంది. దుమ్ము రేపేద్దాం. లవ్ యు ఆల్'అన్నారు

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా సురేష్ గారికి థాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ప్రాజెక్టు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆరోజు చూడకపోయి ఉంటే ఒక మంచి సినిమా మిస్ అయ్యే వాడిని. మనోజ్ తో సినిమా చేయడం నాకు వెరీ మెమొరబుల్. అలాగే సాయి చేయబోతున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ విజయ్ గారు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ సినిమాతో ఆయన మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి. మరెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ రాధా మోహన్ గారికి ఈ సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకి ఆయన మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా జరుగుతున్న సమయంలో మా ఫ్యామిలీలో ఒక విషాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఈ టీమ్ అందరూ నాకు ఎంతగానో తోడుగా ఉన్నారు. ఈ సినిమా లైఫ్ లాంగ్ మెమరీ. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మంచి ఘనవిజయాన్ని మా అందరికీ ఇస్తారని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా మే 30వ తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి'అన్నారు

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మల్టీస్టారర్ అని చెబుతున్నారు. కానీ మల్టీ స్టార్ కి మించి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ పాకాల ఈ సినిమా తర్వాత తమన్ మణిశర్మ గారి రేంజ్ లో నిలబడతాడు. తన ఆర్ఆర్ చూసి షాక్ అయ్యాను. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ విజయ్ పెద్ద డైరెక్టర్ లిస్టులో ఉంటాడు. ఆది సినిమాకి వినాయక్ గురించి ఎలా అయితే చెప్పానో ఈ సినిమా తర్వాత విజయ్ కూడా అలానే పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. మనోజ్ నాకు చిన్నప్పుడు నుంచి తెలుసు. మా గురువుగారు మోహన్ బాబు గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నుంచి మనోజ్ ని నేను చూస్తున్నాను. తను చిన్నప్పుడే బోలెడు స్టంట్ లు చేసేవాడు. తనది చాలా మంచి మనసు. ఈ సినిమాతో ఆయన టైం స్టార్ట్ అయింది. నారా రోహిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనది అద్భుతమైన క్యారెక్టర్. పదిమందిలో ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటాడు. తనది గొప్ప మనసు. మా అబ్బాయని చెప్పడం కాదు.. ఈ సినిమా తర్వాత సాయి పెద్ద రేంజ్ కి వెళ్తాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా 100% మీకు నచ్చుతుంది'అన్నారు

నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీడియాకి కృతజ్ఞతలు. ఈ సినిమా అనేది మంచి టీం వర్క్. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ భైరవం సినిమా చేయడానికి ముఖ్య కారకులు బెల్లంకొండ సురేష్ గారు. ఈ సినిమా చేస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చి ముందుకు నడిపారు. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంటే కొందరు భయపడతారు. నేను కూడా ముందు భయపడ్డాను .కానీ మాకు ముగ్గురు కూతుళ్లు ముగ్గురు అల్లుళ్ళు వచ్చినట్టుగా అనిపించింది(నవ్వుతూ) బైరవం సినిమా మా అందరి కృషి ఫలితం. మే 30న వస్తుంది. మీ అందరూ థియేటర్స్ లో చూసి సినిమాకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా థియేటర్స్ లో మరుపురాని ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది'అన్నారు

డైరెక్టర్ విజయ్ కనక మేడల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా మా రైటర్స్ కి థాంక్యూ. చాలా సపోర్ట్ చేశారు. హరి గారు అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. మా లిరిక్ రైటర్స్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమాలో యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శ్రీ చరణ్ నెక్స్ట్ లెవెల్ ఆడియో ఇచ్చారు. ఎడిటర్ చోట కే ప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యు. మనోజ్ అన్న రోహిత్ గారు సాయి గారు థాంక్యూ. 30 తారీఖున నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇవ్వబోతున్నారు. మా నిర్మాత రాధ మోహన్ గారు. సినిమాని చాలా గ్రాండ్ నిర్మించారు. ఈ సినిమా ఆడియన్స్ అందరికీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. సక్సెస్ మీట్ లో మరింత మాట్లాడుకుందాం'అన్నారు

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా టీమ్ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. డైరెక్టర్ విజయ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమా కంటెంట్ నాకు చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. యాక్షన్ సినిమాలు చూసే వారందరికీ కూడా ఇది సూపర్బ్ వైబ్ ఇస్తుంది. తప్పకుండా విజయ్ పెద్ద హిట్ కొడతాడు. మనోజ్ గారు రోహిత్ గారు శీను గారు చాలా మంచి యాక్టర్స్. మనోజ్ గారు చిన్నప్పుడు నుంచి చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాతో తన టైం స్టార్ట్ అయింది. రోహిత్ గారు సెటిల్ పెర్ఫార్మర్. ఆయన కెరీర్ లో కూడా ఈ సినిమా వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. శ్రీనివాస్ గారు మై బ్రదర్ బెల్లంకొండ సురేష్ గారి కందిరీగ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అప్పటినుంచి వారితో పరిచయం ఉంది. శీను చాలా హైపర్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కచ్చితంగా తన మంచి హీరో అవుతాడు అనుకున్నాను అలానే ఇప్పుడు బాలీవుడ్ లో ఇక్కడ అన్నిచోట్ల ఎక్స్ట్రార్డినరీగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలుస్తుంది. ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్నప్పుడు ముందుగా పక్కన పెట్టాల్సింది ఈగో. అది పక్కనపెట్టి ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో చాలా కలిసిపోయి ఒక బ్రదర్స్ లాగా వర్క్ చేస్తున్నారు. కచ్చితంగా అది సినిమా కూడా ప్లస్ అవుతుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్'అన్నారు

అతిధి శంకర్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమాతో నేను తెలుగులో డెబ్యు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకులకు థాంక్యూ. ఈ సినిమా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా వెరీ బ్యూటిఫుల్ జర్నీ. శీను గారు వెరీ అమేజింగ్ కోస్టార్. గ్రేట్ డాన్సర్. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది'అన్నారు

ఆనంది మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ. మా ముగ్గురు హీరోలు హిట్ కొట్టాలని అందరూ గట్టిగా కోరుకుంటున్నారు. మే 30న ఎవరినీ డిసప్పాయింట్ చేయకుండా హిట్టు కొట్టేస్తారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. చాలా అరుదుగా ఇంతమంది యాక్టర్లతో వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. సినిమాని ఇంత గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేసిన నిర్మాతకి నిర్మాత రాధా మోహన్ గారికి థాంక్యూ. డైరెక్టర్ విజయ్ గారి విజన్ ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది'అన్నారు

దివ్య మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంత మంచి స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. చాలా కష్టపడి ఈ సినిమా చేసాం అందరూ కూడా సినిమాని సపోర్ట్ చేసి బిగ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిర్మాత రాధా మోహన్ గారు తమిళ్ గరుడన్ సినిమా చూడమని చెప్పారు. అందులో ఎమోషన్ నాకు చాలా నచ్చింది. మంచి కాస్టింగ్ సెట్ అయితే చాలా బాగుంటుందని చెప్పాను. కానీ ఇంత మంచి కాస్టింగ్ సెట్ అవుతుందని నేను అనుకోలేదు. ముగ్గురు హీరోలు కూడా చిన్న వయసులోనే చాలా కష్టాలు చూసి నిలబడ్డారు. ముగ్గురిలో నాకు ఒక ఫోర్స్ కనిపిస్తుంది. ముగ్గురిని ఒక ఫ్రేమ్ ఫ్రేమ్ లో చూస్తుంటే తెలియని ఫోర్స్ కనిపిస్తోంది. అది థియేటర్స్ లో అందరికీ కనెక్ట్ అవుతుందని, ఆ ఎమోషన్ ఈ సినిమా సక్సెస్ కి కారణం అవుతుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నిర్మాత రాధా మోహన్ గారికి థాంక్యూ. సినిమాకి కావాల్సింది ఇచ్చారు. మా మ్యూజిక్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ విజయ్ తో కలిసి వర్క్ చేయడం ఎప్పుడూ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది మా మూడో సినిమా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. నన్ను నమ్మి ఇత పెద్ద మూవీ ఇచ్చినందుకు విజయ్ కి నిర్మాతలకు హీరోలకు థాంక్యూ. ఈ సినిమా ఆల్బమ్ ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

యాక్టర్ అజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరం కలసి ఈ సినిమా చేసినట్లుగా అనిపించింది. డైరెక్టర్ విజయ్ ఎడీగా ఉన్నప్పటి నుంచి పరిచయం. మా ముగ్గురు హీరోల కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నిర్మాత రాధమోహన్ గారు చాలా పాషన్ తో నిర్మించారు. ఆడియన్స్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూడబోతున్నారు'అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved