| 
             
 
                 | 
                
              
  
    | 
      
        
        
                
           
             
          
        
    
      
        22 July 2016 
        Hyderabad 
        తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి సంబంధించిన ఎన్నికలు శుక్రవారం విజయవాడలో జరిగాయి. అధ్యక్ష పదవికి నిర్మాత పి. కిరణ్, సి. కల్యాణ్ పోటీ పడగా, కల్యాణ్ విజయం సాధించారు. కార్య నిర్వాహక సభ్యులు 45 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 19 ఓట్లు పి. కిరణ్‌కు, 26 ఓట్లు సి. కల్యాణ్‌కు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం చలన చిత్ర వాణిజ్య మండలిలో జరిగిన సత్కార కార్యక్రమంలో అధ్యక్షుడు సి. కల్యాణ్‌ని, నిర్మాతల మండలి సెక్టార్ చైర్మన్ సత్యారెడ్డిని పలువురు సినీరంగ  ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దాసరి కిరణ్‌కుమార్, ముత్యాల రమేశ్, ముత్యాల రాందాస్, సురేందర్ రెడ్డి, పోతుల రవికిశోర్, నాగులపల్లి పద్మిని, నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.       
      
 
      
         
     
       | 
   
  
    Photo 
      Gallery (photos by G Narasaiah)  | 
   
  
    |   | 
   
                | 
                
                
            
                 | 
                 
               
             
          | 
             
        
        |