`
pizza

CM Revanth Reddy felicitates National Award winners
భార‌తీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైద‌రాబాద్ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌ల‌కు స‌న్మానం....

You are at idlebrain.com > News > Functions
Follow Us


18 August 2025
Hyderabad

హైద‌రాబాద్‌: భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్ ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌నందిస్తాంమ‌ని ఆయ‌న తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో సోమ‌వారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్ర‌హీత‌లైన భ‌గ‌వంత్ కేస‌రి సినిమా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, హ‌ను మాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హ‌ను మాన్ సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంక‌ట్‌, శ్రీనివాస్, టీమ్ స‌భ్యులు, ఫైట్ మాస్ట‌ర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్ట‌ర్ సాయి రాజేశ్‌, సింగ‌ర్ రోహిత్ ల‌ను స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో హ‌ను మాన్ సినిమా నిర్మాత‌లు చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్‌, భ‌గ‌వంత్ కేస‌రి నిర్మాత గార‌పాటి సాహు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved