శ్రీకాకుళం కిన్నెర థియేటర్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ 50 రోజుల వేడుకను నగర మహేష్‌బాబు సేవా సమితి అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. థియేటర్ మేనేజర్ వరప్రసాద్చే కేక్‌కట్ చేయించి, బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పర్వీన్‌కు పదహేను వేల రూపాయల చెక్కును అందజేశారు. స్టాఫ్‌కు భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో జగన్, మామిడి శంకర్, గౌరీ శంకర్, భద్రం కుమార్, షాజహాన్, రవి, ఈశ్వర్ ప్రసాద్, మహేష్‌రావు తదితర అభిమానులు పాల్గొన్నారు.
చీరాల శాంతి థియేటర్లో ‘శ్రీమంతుడు’ 50 రోజుల వేడుకలను పట్టణ సూపర్‌స్టార్ కృష్ణమహేస్ సేన అధ్యక్షులు సలాది కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా, థియేటర్ లీజ్ దారుడు కొర్రపాటి శ్రీనివాసరావు కేక్ కట్ చేయగా, స్టాఫ్‌కు బట్టలు పంచారు. స్కూల్ పిల్లలకు మహేష్ ఫొటో కవర్‌తో కూడుకుని ఉన్న నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రచించిన ‘నిప్పులాంటి నిజాలు’ మహేష్‌బాబు రికార్డ్స్ పత్రికను వన్‌టౌన్ ఎస్.ఐ యాకూబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి బట్టలు పంచి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో గొనిగళ్ల మోహన్, గొనిగళ్ల జయరావ్, కాకరపర్తి శ్రీధర్, తనవర్తి ప్రసాద్, కావూరి మోహన్, గుంటిశెట్టి వెంకటేశ్వరరావు, రమేష్, కె. నాగరాజు, జి. పోతరాజు, రావి రాఘవేంద్రబాబు, కొర్రపాటి సురేంద్రబాబు, శౌరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.