
24 July 2025
Hyderabad
Audiences shower praises on Hari Hara Veera Mallu
The film is racing ahead with sensational collections
Power Star Pawan Kalyan’s long-awaited film Hari Hara Veera Mallu, released amidst massive expectations and has been receiving overwhelming love from fans and movie lovers across the nation. Premier shows began on the night of July 23, and Pawan Kalyan’s portrayal of Veera Mallu, a warrior who fights for Dharma, is drawing thunderous applause. Every department—from performances to war sequences, music, and direction—is receiving praise. The film is performing strongly at the box office with increasing collections for every show.
To celebrate this response, the team held a grand success meet and extended their heartfelt thanks to audiences for embracing the film.
Speaking at the event, Pawan Kalyan said:
“My life has never been a bed of roses. Nothing has ever come easy to me. Even with this film’s release, we faced many challenges. In my 29-year career, this is the first time I have promoted a film this extensively. Taking on this responsibility brought me unexpected joy.
Emotions are crucial in any film. What stays with the audience is the emotion they carry home. Hari Hara Veera Mallu is rooted in a story about the Mughals. History books often glorify Aurangzeb, ignoring his cruelty. The Mughals ruled for 200 years, but dynasties like the Chalukyas, Pallavas, Kakatiyas, and Vijayanagara ruled for centuries—yet history focuses more on invaders.
During Aurangzeb’s reign, Hindus were forced to pay tax just to practice their faith. We addressed this issue boldly in the film. My knowledge of martial arts, technical skills, and spirit of resistance helped me design the 18-minute pre-climax fight sequence.
It brings me joy that this episode is being widely appreciated. The film isn’t about religion—it’s about the eternal battle between good and evil.
I thank Mythri Movie Makers and People Media Factory for supporting producer A.M. Rathnam garu in getting the film released.
The strength I have today is because of my fans. More than the collections and records, I’m proud that this film revealed a forgotten truth from history. After watching Shankarabharanam, I developed deep respect for classical music. This film proves what cinema can do. It’s not just about telling a story—it’s about inspiring audiences.
In that regard, Veera Mallu has fulfilled its goal. We’ve received technical feedback and will take that into account for Part 2. This film shows that the knowledge in our land is more precious than even the Kohinoor diamond.
I feel standing with A.M. Rathnam garu for such a great film was my responsibility.”
Lead actress Nidhhi Agerwal said:
“I’m extremely happy with the response to Hari Hara Veera Mallu. Ever since the release, I’ve been receiving calls and messages filled with praise—and it’s all thanks to Pawan Kalyan garu.
This film is very special to me. Along with Rathnam garu and Jyothi Krishna garu, the entire team worked hard for five years. I always believed this film would succeed.
Hari Hara Veera Mallu proves once again that sincere hard work always pays off. Thank you to all the audiences for your love.”
Presenter and renowned producer A.M. Rathnam said:
“The compliments we’ve received for Hari Hara Veera Mallu bring immense joy. This isn’t just a film—it’s a slice of history. Aurangzeb wanted only his religion to exist. This is the story of a warrior who stood up to him and protected Dharma.
Pawan Kalyan garu appears like a lion-hearted warrior in this film. He worked so hard, especially in the war sequences. Fans are calling and saying, ‘Sir, this is what we wanted from Pawan Kalyan garu.’ Even family audiences are enjoying the movie.
I’m confident this film will bring us the success we truly deserve.”
Director Jyothi Krishna said:
“Seeing the fans and audience reactions in theaters gives us great joy. Many have called to praise how we ended the film and said they’re excited for the second part. Even little kids are loving the movie.
Hari Hara Veera Mallu is a perfect family entertainer. I’m proud to have made such a good film with Pawan Kalyan garu. This film has two heroes—Pawan garu and Keeravani garu.
Pawan Kalyan garu choreographed an 18-minute action sequence. There’s a 30-minute stretch in the film with almost no dialogue, and Keeravani garu elevated it with his music.
Nidhhi Agerwal stood by this project for five years, believing in it. I also want to thank our direction department. After so long, I saw my father Rathnam garu smile with the joy of a blockbuster. This is clearly his dream project.
I’ll never forget the support of my wife and mother throughout this journey. My heartfelt thanks to Pawan garu for giving me this opportunity.”
Producer Y. Ravi Shankar said:
“We witnessed Pawan Kalyan garu’s true box office power with our own eyes yesterday at Vimal Theatre. One premiere show earned a share of ₹3.36 crores—we were shocked!
We’re heading toward record first-day collections. Audiences are celebrating Pawan Kalyan garu’s presence on screen.”
Producer Naveen Yerneni added:
“Congratulations to Rathnam garu and the entire team on the grand success of Hari Hara Veera Mallu. The film is receiving extraordinary response from all quarters. We’re sure to see record-breaking collections ahead.”
Cast:
Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol, Sathyaraj, Easwari Rao, Tanikella Bharani, Nasser, Sunil, Raghu Babu, Subbaraju, Murali Sharma, Ayyappa Sharma, Kabir Singh, Vennela Kishore, Makarand Deshpande, Kabir Bedi, Sachin Khedekar, Chatrapathi Sekhar
Crew:
Direction: Jyothi Krishna & Krish Jagarlamudi
Producer: A. Dayakar Rao
Presented by: A.M. Rathnam
Banner: Mega Surya Productions
Music: M.M. Keeravaani
Cinematography: Manoj Paramahamsa, Gnana Shekar V.S.
Editing: Praveen K.L
Lyrics: Chandrabose, Penchal Das, Chaitanya Krishna, Rambabu Ghosala
VFX: Hari Hara Sutan, Sojo Studios, Unify Media, Metavix
Art Direction: Thota Tharani
Choreography: Ganesh, Shobi
Stunts: Sham Kaushal, Todor Lazarov Juji, Ram-Lakshman, Peter Hein, Stunt Siva, Dilip Subbarayan, Vijay, Dragon Prakash
Publicity: Lakshmi Venugopal
Creative Producer: Harish Pai
Executive Producer: Ashok
Co-Director: K. Ranganath
Costume Designer: Aishwarya Rajeev
Stills: Venkat
Publicity Design: Ananth
'హరి హర వీరమల్లు' చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం
- సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'హరి హర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 'హరి హర వీరమల్లు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం.. తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా, 'హరి హర వీరమల్లు' సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ళ సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా బాధ్యత తీసుకోవడం కూడా ఓ రకంగా ఆనందాన్ని ఇచ్చింది. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది.. మనం ఏ ఎమోషన్ ని ఇంటికి పట్టుకొస్తామని. ఈ చిత్ర కథ మొఘల్స్ కి సంబంధించినది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. అతని దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పాలించారు. కానీ, చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం.. ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్ లో 18 నిమిషాల ఫైట్ ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము. ఈ చిత్రం విడుదల విషయంలో రత్నం గారికి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డానంటే నాకు అభిమానులు ఇచ్చిన బలమే కారణం. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, రికార్డుల కంటే కూడా.. ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన గౌరవం వచ్చింది. ఒక సినిమా ఏం చేయగలదు అనేదానికి ఇదొక ఉదాహరణ. సినిమా అనేది కథ ఎలా చెప్పాము, ప్రేక్షకుల్లో ఎంత ప్రేరణ కలిగించాము అనేది ముఖ్యం. ఆ పరంగా వీరమల్లు చిత్రం యొక్క లక్ష్యం నెరవేరింది. సాంకేతికంగా కొందరు కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాలను రెండో భాగం విషయంలో పరిగణలోకి తీసుకుంటాము. కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము. హరి హర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నం గారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను." అన్నారు.
చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, "హరి హర వీరమల్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. రత్నం గారు, జ్యోతికృష్ణ గారితో పాటు టీం అంతా ఐదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని మొదటి నుంచి నమ్మాను. మనం మనస్ఫూర్తిగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని హరి హర వీరమల్లుతో మరోసారి రుజువైంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు." అన్నారు.
చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, "సినిమా బాగుందని అందరూ అభినందలు తెలపడం ఆనందాన్ని కలిగించింది. హరి హర వీరమల్లు సినిమా కాదు.. ఇదొక చరిత్ర. ఔరంగజేబు కేవలం తన మతం మాత్రమే ఉండాలని అనుకుంటాడు. అతన్ని ఎదిరించి ధర్మాన్ని రక్షించే వీరుడి కథే ఈ వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సింహంలాంటి యోధుడి లాగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో వీరవిహారం చేశారు. 'ఇది సార్ మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునేది' అని అభిమానులు ఫోన్లు చేసి చెప్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మా కష్టానికి తగ్గ భారీ విజయం లభిస్తుందని ఆశిస్తున్నాను." అన్నారు.
చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, "థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలుగుతోందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అందరూ కలిసి చూస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒకరు పవన్ గారు, ఇంకొకరు కీరవాణి గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేశారు. పెద్దగా సంభాషణలు లేకుండా దాదాపు 30 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ని కీరవాణి గారు తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. నిధి అగర్వాల్ గారు ఐదేళ్లుగా ఈ సినిమాను నమ్మి నిలబడ్డారు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ సపోర్ట్ ను మరువలేను. మా నాన్న రత్నం గారు తన మొదటి సినిమా హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డారో.. మళ్ళీ అంతటి ఆనందాన్ని ఇన్నాళ్లకు ఆయన ముఖంలో చూశాను. ఈ సినిమా ఆయనకు ఎంతటి డ్రీం ప్రాజెక్టో ఆ సంతోషంలోనే తెలుస్తోంది. ఈ సినీ ప్రయాణంలో నా భార్య, మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మరచిపోలేము. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అన్నారు.
ప్రముఖ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, "పవర్ స్టార్ గారి పవర్ ఏంటో మేము నిన్న విమల్ థియేటర్ సాక్షిగా చూశాను. ఒక్క షో ప్రీమియర్ కే రూ.3.36 కోట్ల షేర్ చేసింది. ఆ నెంబర్ చూసి మేము షాక్ అయ్యాము. మొదటి రోజు వసూళ్ల పరంగా రికార్డు నెంబర్లు చూడబోతున్నాం. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తే ఆ ఆనందమే వీరు." అన్నారు.
ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, "హరి హర వీరమల్లు ఘన విజయం సాధించిన సందర్భంగా రత్నం గారికి మరియు చిత్ర బృంద అందరికీ శుభాకాంక్షలు. అన్ని చోట్లా నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రికార్డు కలెక్షన్లు చూడబోతున్నాం." అన్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్,
ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, నాజర్, సునీల్, రఘుబాబు,
సుబ్బరాజు, మురళి శర్మ, అయ్యప్ప శర్మ, కబీర్ సింగ్,
వెన్నెల కిశోర్, మకరందేశ్ పాండే, కబీర్ బేడీ,
సచిన్ కెడేకర్, ఛత్రపతి శేఖర్,
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: చంద్రబోస్, పెంచల్ దాస్, చైతన్య కృష్ణ, రాంబాబు గోశాల.
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్,
యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: గణేష్, శోభి.
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ - లక్ష్మణ్, పీటర్ హెయిన్,
స్టంట్ సెల్వ, దిలీప్ సుబ్బరాయన్, విజయ్, డ్రాగన్ ప్రకాష్.
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పాయ్.
ఎక్సుక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్
కో డైరెక్టర్: కే. రంగనాథ్
కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్
స్టిల్స్: వెంకట్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్


