pizza
Giri's New Production house Vyanateya Pvt Ltd Launch
వ్యానతేయ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్ లాంఛ్ ....
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 July 2016
Hyderabad

"దిల్ "సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీ లోకి వచ్చి రాజమౌళి తో "సై ",ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, నా అల్లుడు లాంటి భారీ చిత్రాలను తీసిన నిర్మాత గిరి (ఎ.ఎల్.ఎన్.రెడ్డి ) . కొన్నాళ్ల గ్యాప్ అనంతరం గిరి మరలా క్వాలిటీ సినిమాలను తీసెందుకు సిద్దమయ్యారు. వ్యానతేయ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై యు.లావణ్య రెడ్డి మరియు సిరాజుద్దీన్ తో కలిసి గిరి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్బంగా గిరి మాట్లాడుతూ... చాలామంది చిన్న దర్శకనిర్మాతలు సినిమా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి అండగా నిలిచెందుకు మంచి ప్లానింగ్ తొ వస్తున్నాము. ఎవరైనా మంచి కధ ఉంటే 30% షేర్ తొ వస్తే, తాము 70% షేర్ కలిపి సినిమాలను తీసి విడుదల చేస్తాము .అర్దనారి దర్శకుడు భాను శంకర్ కధలో ఎన్నుకునె కమిటీలొ మెంబర్ గా ఉంటారన్నారు.అలాగే కొత్తగా ఓ ఛానెల్ ను మా గరుడ బ్రాడ్ కాస్టింగ్ ప్రై లిమిడెట్ ఆధ్వర్యంలో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము.. త్వరలో ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ ను కూడా ప్రారంభించి చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా తీసుకుంటామని అన్నారు.. దయచేసి చిన్న నిర్మాతలను సినిమా అభిరుచి ఉన్న వారిని ఎంకరేజ్ చేసి, వారిని కూడా బ్రతకెందుకు అవకాశమివ్వ వలసిందిగా ఇండస్ట్రీ పెద్దలను కొరుతున్నామన్నారు

సిరాజుద్దీన్ మాట్లాడుతూ.. క్వాలిటీ సినిమాలను నిర్మించాలని 500కోట్ల టర్నొవర్ తో మంచి థాట్ తో గిరితో కలిసి చిత్ర నిర్మాణం చెసెందుకు సిద్దమయ్యామని అన్నారు.

దర్శకుడు భాను శంకర్ మాట్లాడుతూ.. మంచి సినిమా తీసినా ఈ రోజున సదరు సినిమాకు ధియెటర్స్ లభించే పరిస్థితి లేదు. అందుకె గిరి గారు మంచి చిత్రాలను తీసె వారికి అండంగా ఉండెందుకు ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. నా వంతుగా నేను మంచి కధలను ఎన్నుకునేందుకు కృషి చెస్తానన్నారు..

గిరి మా అర్దనారి సినిమా విడుదల విషయంలో చాలా హెల్ప్ చేశారు.. వారు చెస్తోన్న ఈ మంచి ప్రయత్నం సక్సెస్ కావాలని అర్దనారీ చిత్రయూనిట్ ఆశా భావం వ్యక్తం చేశారు..

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమతి లావణ్య రెడ్డి, ప్రణయ్ రెడ్డి, అర్జున్, మౌర్యాని తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved