
02 July 2014
Hyderabad

యథార్థ సంఘటన ఆధారంగా మరో సంచలన మూవీ తెలుగులో రాబోతోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా 'దావూద్' సినిమా ప్రారంభమైంది. దావూద్ జీవితంలోని కొత్త కోణాలను బయటపెడుతూ ఈ సినిమా తెరకెక్కనుందని డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు. దావూద్ ఆ మార్గం ఎంచుకోవడానికి కారణాలేంటో తమ సినిమాలో చూపిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మొత్తం తొమ్మిది భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ ప్రారంభమైంది. 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.
ఆర్టిస్టులు:
ఎస్.కే షరీఫ్,
వీరభద్రం,
తంగల్ రెడ్డి .. తదితరులు
సాంకేతిక వర్గం:
ఆర్ట్ డైరెక్టర్ - డేవిడ్
కెమెరా - మహ్మద్ రఫీ
మ్యూజిక్ - సునీల్ పుత్ర
వీఎఫ్ఎక్స్: సంతోష్ కంభంపాటి, ప్రభు.ఎన్
ఆర్ ఆర్: కన్నా
ఎడిటింగ్ - నాగేంద్ర
కాస్టూమ్స్ - వలీ
కో-డైరెక్టర్ - కోటి
మేనేజర్ - విజయ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
బి. రాజేష్ పుత్ర
నిర్మాణం:
'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' సంస్థ
