9 June 2014
Hyderabad
విక్టరీ 'వెంకటేష్', పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ల పవర్ ఫుల్ కాంబి నేషన్ లో 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'గోపాల ...గోపాల' చిత్రం వైభవం గా ప్రారంభం.
తేది 9-6-2014, ఉదయం 9 గంటల 20 నిమిషాలు
హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో ప్రాంగణం చలనచిత్ర ప్రముఖుల రాకతో సందడిగా ఉంది. విక్టరీ 'వెంకటేష్', పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ల పవర్ ఫుల్ కాంబి నేషన్ లో 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధినేత డి.సురేష్ బాబు, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ అధినేత శరత్ మరార్ లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'గోపాల ..గోపాల' చిత్రం ఈరోజు వైభవంగా ప్రారంభ మైంది.
ప్రముఖ దర్శకుడు కిషోర్ పార్ధసాని' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'శ్రియ' నాయికగా నటిస్తున్నారు. కాగా 'గోపాల ..గోపాల' పేరుతొ ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. నేటి నుంచి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరుకు ఈ చిత్రం నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. పాపులర్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు డి.సురేష్ బాబు.శరత్ మరార్ లు తెలిపారు.
వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ నిర్మాతలు డా. డి.రామా నాయుడు, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, బూరుగ పల్లి శివరామ కృష్ణ, ఎన్.వి.ప్రసాద్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, శానం నాగ అశోక్ కుమార్, పొట్లూరి వరప్రసాద్, రామ్మోహన్, సుప్రియ, సునీత , రచయితలు సత్యానంద్, భూపతి రాజా లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ తనయుడు మాస్టర్ 'అర్జున్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నాయికగా 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని.
'గోపాల..గోపాల' చిత్రానికి కధ - భవేష్ మందాలియ,ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే- కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా - జయనన్ విన్సెంట్, మాటలు - సాయి మాధవ్, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - చంద్ర బోస్, ఎడిటింగ్ - గౌతం రాజు, ఆర్ట్ - బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ - సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ - పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ - వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్.
దర్శకత్వం - కిషోర్ పార్ధసాని (డాలి)
నిర్మాతలు - డి.సురేష్ బాబు,శరత్ మరార్