Hare Rama Hare Krishna', produced by Sai Arunachaleshwara Creations as its Production No. 1 and directed by Arjun Sai, was today launched at Ramanaidu Studios. Dileep Prakash and Regina Cassandra are the main leads.
The muhurath shot was given a clap by Chandoo Mondeti, while ace editor Kotagiri Venkateshwara Rao switched the camera on. The first shot was given honorary direction by Veera Shankar.
Director Arjun Sai said, "I have worked as a writer for 'Srimannarayana', 'Damarukam' and 'Nakshatram'. This is my first film as director. This is a comedy-driven movie. In the first half of May, we will shot in Kulu Manali".
Regina Cassandra said, "This is a story and screenplay with a difference. I am playing a HR personnel who tries to save traditional art forms. The director has designed my character so well. Senior actress Amani garu is playing my mother in the movie".
Producer Naveen Reddy S said, "It was about a year and a half that the director narrated to me this story. I liked it as soon as I listened to it. Our film is going to be different from the regular ones. I wouldn't have done the film had Prakash Raj garu and Rasool Ellore garu not come on board. Even though she is a busy actress, Regina gave the nod as she liked the story. We are going to make the film simultaneously in Telugu and Tamil".
Rasool Ellore said, "This should have been made in Hindi. Such different is this film. If you accept new artistes, new films will be made".
Debut actor Dileep Prakash said, "This is my first film as hero. I am happy to be doing a film on which senior talent are working. I am confident that the audience will accept me".
Brahma Kadali and others also participated in the event.
Prakash Raj, Amani, Nasser, Krishna Bhagawan, Kashi Viswanath, Ali, Prudhvi, Nagineedu, Racha Ravi, Raghu Babu and others are a part of the cast.
Dialogues are by Ramana Gopishetty. Music is by Anoop Rubens. Art direction is by Brahma Kadali. Editing is by Kotagiri Venkateshwara Rao. Cinematography is by Rasool Ellore. The director himself has written the movie.
సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 `హరే రామ హరే కృష్ణ` ప్రారంభం
సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిలీప్ ప్రకాష్, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్ రెడ్డి ఎన్ నిర్మాతగా కొత్త చిత్రం `హరే రామ హరే కృష్ణ` శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్ కొట్టగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా....
దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ - ''శ్రీమన్నారాయణ, ఢమరుకం, నక్షత్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది'' అన్నారు.
రెజీనా మాట్లాడుతూ - ''డిఫరెంట్ కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్.ఆర్.డిపార్ట్మెంట్లో కనపడే అమ్మాయి. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను. నా పాత్రను దర్శకుడు అర్జున్‌గారు బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో నా మదర్ పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమనిగారు నటిస్తున్నారు'' అన్నారు.
Glam gallery from the event
నిర్మాత నవీన్‌రెడ్డి ఎన్ మాట్లాడుతూ - ''ఏడాదిన్నర క్రితం ఈ కథను దర్శకుడు అర్జున్ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మా సినిమాను రూపొందిస్తాం. మంచి టీం కుదిరింది. ప్రకాష్‌రాజ్, రసూల్ ఎల్లోర్‌గారు ఒప్పుకోకుంటే సినిమా చేసేవాడిని. రెజీనా చాలా బిజీగా ఉన్నా, కథ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను తెరకెక్కిస్తాం'' అన్నారు.
రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ - ''హిందీలో చేయాల్సిన సినిమా ఇది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రేక్షకులకు చేంజ్ కలిగించే కాన్సెప్ట్ చిత్రమిది. కొత్త నటీనటులను ఆదరిస్తే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి'' అన్నారు.
దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ - ''హీరోగా నా తొలి చిత్రమిది. తొలి సినిమానే మంచి సీనియర్స్ ఉన్న టీంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.