
                                                10 May 2019
                            Hyderabad
                      నాగశౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో చలో, నర్తనశాల తరువాత  ప్రొడక్షన్ నెం-3 చిత్రం ఈ రోజు ప్రారంభమైంది.  ఈ  చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషాముల్పూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో  నాగశౌర్య  కి  జంటగా మెహరీన్ నటిస్తుంది.  ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు  కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి  స్క్రిప్ట్ ని డైరెక్టర్ రమణ తేజకు అందించగా.. 
                        
                        పరశురామ్ గౌరవదర్శకత్వం వహించారు. దర్శకురాలు  నందిని రెడ్డి కెమెరా స్వచాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.
                       హీరో నాగశౌర్య మాట్లాడుతూ - " మా బ్యానేర్ ఐరా క్రియేషన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రాన్ని ప్రారంభించామని తెయజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు కె. రాఘవేంద్రరావు, పరశురామ్, నందిని రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 13నుంచి మొదలవుతుంది. 70శాతం షూటింగ్ వైజాగ్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రమణతేజ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి యు.ఎస్. లో బూస్టన్ ఫిల్మ్ స్కూల్లో కలిశాం. మంచి కథ డెఫినెట్ గా బాగా తీస్తారని ఆశిస్తున్నాను. మెహ్రీన్‌తో కలిసి పని చేయడం ఇదే మొదటి సారి . మా ప్రొడక్షన్‌లో వచ్చిన ఫస్ట్ సినిమాకంటే పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.
                      హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ - "మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కి నా థ్యాంక్స్. మా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్  మాకు కావాలి "అన్నారు. 
                      చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ - " ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి  ఇక్కడికి  పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ సినిమా ఇచ్చిన మా శౌర్య అన్నయ్యకు చాలా థ్యాంక్స్ .నన్ను నమ్మి నాకు ఇంత మంచి కథ ఇచ్చి డైరెక్టర్‌గా నిలబెట్టిన ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు.  కెమెరామెన్ మనోజ్ నాకు  మంచి మిత్రుడు. ఇద్దరం అదే ఫిలిం స్కూల్ లో చదివాము. మా ఇద్దరికి మంచి ర్యాపొ ఉంది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న మెహ్రీన్‌కి థ్యాంక్స్  అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది " అన్నారు. 
                      బుజ్జి మాట్లాడుతూ - "ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రొడక్షన్ నెం-2 డైరెక్టర్‌ని నమ్మి తప్పుచేశాము. ప్రొడక్షన్ నెం.3 సొంతకథ రాసుకున్నాము. ఈసారి అలా జరగదు తప్పకుండా హిట్ అవుతుంది " అన్నారు.
                      మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - " కథ చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. సినిమా చాలా బావుంటుంది " అన్నారు.
                      పోసానికృష్ణమురళీ, సత్య, ప్రొయరమణ, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 
                        
                        మ్యూజిక్: శ్రీచరణ్, 
                        కెమెరా: మనోజ్‌రెడ్డి, 
                        ఎడిటర్ : రీబిహెచ్, 
                        ఆర్ట్‌డైరెక్టర్: రణ్‌కుమార్ 
                        కొరియోగ్రాఫర్ః రఘుమాస్టర్ 
                        స్టోరీః నాగశౌర్య, 
                        స్ర్కీన్‌ప్లేః రమణతేజ, ఫణీంద్రబిక్కిన 
                        డైరెక్షన్ః రమణ్‌తేజ
                        ప్రొడ్యూసర్ః ఉషాముల్పూరి 
                        పిఆర్ ఓః ఏలూరుశ్రీను.
                      
                      
                      
                      
                      