రఫి కీలక పాత్రలో నటించిన సినిమా రాహుల్ పక్కా ప్రొఫెషనల్. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కోదండరామ్ ప్లాటినమ్ డిస్కును ఆవిష్కరించారు.
రఫి మాట్లాడుతూ ``రెగ్యులర్ ఫోర్ములాలకు భిన్నంగా నిజజీవితాలను ఆవిష్కరిస్తూ , యువతకు నచ్చే విధంగా సందర్భోచిత పాటలతో, ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలతో, రొమాన్స తో పాటు యువత ఎదుగుదలకు ఉపయోగపడే సందేశాన్ని ఇస్తూ కుటుంబసమేతంగా చూడగలిగేల రూపొందించిన ప్రయోగాత్మక చిత్రమే మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ సినిమా . ఈ నెల 29న విడుదల చేస్తున్నాం. వేములపల్లి రాధాకృష్ణ అనే గురువుదగ్గర మెథడ్ యాక్టింగ్‌ను నేర్చుకున్నాను. దాన్ని బేస్ చేసుకుని చేసిన సినిమా ఇది. కో ఆపరేటివ్ కమిటీ విధానంతో విడుదల చేస్తున్నాం. మూడంచల వ్యవస్థ రాఆవల్సిన అవసరం ఉంది. మినీ థియేటర్లు వస్తాయని ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం అందుకు సహకరించాలి`` అని అన్నారు.
కోదండరామ్ మాట్లాడుతూ `మా జేఏసీలో తెలంగాణ సినిమా గురించి మేం కొన్ని విషయాలను అనుకున్నాం. మినీ థియేటర్లు అనేవి అందులో ఉన్న విషయమే. పుణె తరహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ని కూడా ఇక్కడ కట్టాలనుకుంటున్నాం. థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యం రద్దు చేయాలి. ఫిల్మ్ ఫైనాన్స్ సంస్థ తెలంగాణకు విడిగా రావాలి. వీటన్నిటి గురించి తెలుగు పరిశ్రమలోని తెలంగాణ వాళ్లు ఐక్యం కావాలి. సదస్సులను నిర్వహించాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దేన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొనే సత్తా తెలంగాణ వాళ్లది`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రఫి సన్నిహితులు లక్ష్మణ్ ఏనుగు, భవానీ , డీపీ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.