నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను తెచ్చింది. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ - ``నేను ఎ.ఐ.బిలో నవీన్ వీడియోస్‌ను చాలానే చూశాను. అతన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడిని. తను మంచి యాక్టర్. ఇప్పుడు తన సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. పోస్టర్స్‌ను చూసి చాలా ఇన్‌స్ఫైర్ అయ్యాను. నాకు చాలా ఇష్టమైన సినిమా చంటబ్బాయ్. అదే జోనర్‌లో ఈ సినిమాను చేయడం ఆనందంగా ఉంది. జూన్ 21న విడుదలకానున్న ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను. నవీన్, హీరో స్వరూప్, నిర్మాత రాహుల్‌గారికి అభినందనలు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - ``మేం ట్రైలర్ విడుదల చేసినప్పుడు మాకు ట్విట్టర్ ద్వారా ఏ సెలబ్రిటీ సపోర్ట్ చేస్తారా? అని ఎదురుచూస్తున్న తరుణంలో సాయితేజ్ మా ట్రైలర్‌ను షేర్ చేయడం ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు. తనకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే డైరెక్టర్ స్వరూప్‌కి స్పెషల్ థాంక్స్. ఆయన కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఎందరో హీరోలు ముందకు వచ్చినా, నాతోనే సినిమా చేయాలని వెయిట్ చేశారు. మా అందరినీ 720 పిక్సల్ వీడియో నుండి 70 ఎం.ఎం స్క్రీన్ వరకు తీసుకు వచ్చిన అందరికీ థాంక్స్. సినిమా హీరో కావాలనేది నా డ్రీమ్. ఆ కల నేరవేరింది. రెండున్నరేళ్ల కష్టపడి చేసిన సినిమా ఇది. 21న ఈ సినిమా విడుదల కానుంది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని.. హిలేరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పగలను`` అన్నారు.
డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె మాట్లాడుతూ - ``డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ రాసే క్రమంలో నాకు చాలా టిప్స్ చెబుతూ వచ్చాడు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత థ్రిల్లర్ మూవీకి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారని కొందరు స్నేహితులు చెప్పారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కుటుంబ కథా థ్రిల్లర్ చిత్రం. మరికొందరు చంటబ్బాయ్ సినిమాలాగే ఉందని కూడా అన్నారు. అయితే చంటబ్బాయ్ అనేది ఓ క్లాసిక్. దాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. కాబట్టి, మేం చంటబ్బాయ్ సినిమా చేయలేదు. చిరంజీవిగారి, జంధ్యాలగారి టైమింగ్ మేం 1 శాతం కూడా మ్యాచ్ చేయలేం. రాహుల్ నిర్మాతగా కంటే మంచి స్నేహితుడిగా నాకు సపోర్ట్ ఇచ్చారు. దాదాపు అందరూ కొత్తవాళ్లతో చేసిన చిత్రమిది. 21న సినిమా చూసే ప్రేక్షకులకు, మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో బయటకు వెళతారని చెప్పగలను`` అన్నారు.
గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ - ``నిర్మాత రాహుల్ కొత్త దర్శకులపై నమ్మకంతో సినిమా చేయడం గొప్ప విషయం. నాకు కూడా తనే డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. భవిష్యత్‌లో చాలా మంది కొత్త వారిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.