ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్‌లో ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్‌హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`. కుమారి 21 ఎఫ్, ఈడోరకం-ఆడోరకం వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు.సక్సెస్‌ఫుల్ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో. నటకిరిటీ డా.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. .
రాజా రవీంద్ర మాట్లాడుతూ ``వెలిగొండ శ్రీనివాస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన చెప్పిన కథను రాజ్ తరుణ్‌కి వినిపించాం. ఆయనకు వినగానే నచ్చింది. ఇందులో నేను విలన్‌గా నటించాను. నా కెరీర్ టర్నింగ్ అయ్యే పాత్ర చేశాను. నేను ఏ ఎయిమ్‌తో పరిశ్రమకు వచ్చానో, ఆ కలను నెరవేర్చారు వెలిగొండ శ్రీనివాస్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం అంటే మా సొంత సంస్థ కింద లెక్క. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాం. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. జూన్ 1 రాత్రి ఏపీ, తెలంగాణలో ప్రీమియర్ షోలను నిర్వహిస్తున్నాం`` అని చెప్పారు.
శేఖర్‌చంద్ర మాట్లాడుతూ ``రాజేంద్రప్రసాద్‌గారి చేతుల మీద సీడీలను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాటలు చేయడానికి నాకు మంచి సిట్చువేషన్స్ దొరికాయి అందరికీ నచ్చే పాటలు ఇందులో ఉన్నాయి. రామజోగయ్యశాస్త్రిగారు, భాస్కరభట్లగారు మంచి పాటలు రాశారు. వెలిగొండ శ్రీనివాస్ చాలా టాలెంటెడ్ డైరక్టర్. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో మరలా పనిచేయాలని అనుకుంటున్నాను`` అని చెప్పారు.
వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ``నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు నా పేరు పత్రికలో చూసి ఎంత ఆనందం పొందానో, ఇప్పుడు అంత ఆనందంగా ఉంది. నేను రైటర్ కావడానికి కారణం ముగ్గురు వ్యక్తులున్నారు. శివనాగేశ్వరరావు, మహేంద్రగారు, శ్రీహరిగారు ఉన్నారు. ఏ రైటర్‌కయినా డైరక్టర్ కావాలనే కోరిక ఉంటుంది. నా కోరిక రాజ్‌తరుణ్ ద్వారా తీరుతోంది. నా మీద బాధ్యతను పెట్టి ఎంకరేజ్ చేశారు. అదే బాధ్యతను నేను నిర్వర్తించాను.రాజా రవీంద్రగారు ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు లేకపోతే మా సినిమా లేదు. చాలా బాగా ఎంకరేజ్ చేశారాయన`` అని అన్నారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ``రాజేంద్రప్రసాద్‌గారు ఉంటే మాకు పిచ్చ ఎనర్జీ వస్తుంది. యూత్‌తో కనెక్ట్ అయిపోతారు ఆయన. సలహాలు, సూచనలు ఇచ్చి మమ్మల్ని మంచి రూట్‌లో తీసుకెళ్తారు. రెస్ట్ లెస్ ఫెలోకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శేఖర్‌చంద్ర. చాలా మంచి సంగీతాన్నిచ్చారు. హెబ్బాతో మూడో సినిమా. వెలిగొండ శ్రీనివాస్ చాలా అద్భుతంగా చేశారు`` అని చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``ఎన్టీఆర్ జయంతిరోజున ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. ఆయన ఇంట్లో పుట్టి, ఆయన చేతుల మీదుగా పెరిగిన వ్యక్తిని నేను. త్రివిక్రమ్, కొరటాల శివ రైటర్లుగా మొదలై అద్భుతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వెలిగొండ కూడా వాళ్ల సరసన చేరుతాడు. శేఖర్‌చంద్ర చాలా మంచి సంగీతాన్నిచ్చారు. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటని చూస్తే ధర్మేంద్ర, హేమమాలిని, కృష్ణ- విజయనిర్మలలాగా అనిపిస్తోంది. వారిద్దరు ఇంకో 30 సినిమాలు చేసినా చూడొచ్చు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామజోగయ్యశాస్త్రి, కెమెరామేన్ బి.రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. యూనిట్ సభ్యులందరికీ వేదిక మీద షీల్డ్ లను అందజేశారు.
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజశేఖర్, సంగీతంః శేఖర్ చంద్ర, ఆర్ట్ః కృష్ణ మాయ, చీఫ్ కోడైరెక్టర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, సహ నిర్మాతః అజయ్ సుంకర, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,దర్శకత్వంః వెలిగొండ శ్రీనివాస్.