Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ Pre Release Event
Creative director Vamsy’s latest film ‘Fashion Designer s/o Ladies Tailor’ pre-release event took place at JRC Convention yesterday evening. As we all know, it’s a sequel to yesteryears sensational movie Ladies Tailor. ‘Fashion Designer s/o Ladies Tailor’ movie is going to hit the screens on June 2nd.
Songs composed by ‘Melody Brahma’ Mani Sharma are already in the list of top chartbusters and received overwhelming response from the audience.
The pre-release event was made with an innovative concept of 'What is Fashion?' And, mementos were presented for the playback singers of this film.
On this occasion popular director V. V. Vinayak said, "I don’t even remember how many times I have seen Vamsy sir’s Lady Tailor movie. He’s an inspiration for many directors and congrats for the entire team."
Vijay Devarakonda said, "Madhura Sreedhar garu will be always in the front line to recognize talent. I hope that this film will be a memorable moment for him."
Actor, Writer Tanikella Bharani said, "I have never seen such a passionate producer like Madhura Sreedhar. Mani Sharma has given good music and I wish this film will become huge success."
Director B. Gopal said, "Mani Sharma, who has given super hit music for most of my films, producer Madhura Sreedhar, as well as creative director Vamsy garu worked together very well. I wish this film will be a big hit."
Hero Sumanth Ashwin said, “I did not work in this film either as a hero or an artist. I only worked as a fan of Vamsy garu. I thank producer Madhura Sreedhar garu for giving me a chance to work with a wonderful musician like Mani Sharma garu.”
Producer Madhura Sreedhar Reddy said, “I don’t know how to thank Mani Sharma garu for giving me songs, which will be in number one position in my Madhura Audio music catalogue. My dream to work with Vamsy garu has been fulfilled with this film.”
సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం `ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్`. వంశీ దర్శకత్వం వహించారు. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాత. జూన్ 2న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాటలను కూడా విడుదల చేశారు.
ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వి.వి.వినాయక్, మధుర శ్రీధర్‌రెడ్డి, సుమంత్ అశ్విన్, ఎం.ఎస్.రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సీనియర్ వంశీ, దొరై స్వామి, తనికెళ్ళభరణి, తమ్మారెడ్డి భరద్వాజ, బివిఎస్.రవి, లగడపాటి శ్రీధర్, రఘుకుంచె, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి.వి.వినాయక్ రిలీజ్ డేట్ బోర్డ్ ని విడుదల చేశారు. ీ సందర్భంగా...
శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ``నేను సినీ ఇండస్ట్రీకి రావాలనుకుని ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకుంటున్న సమయంలో వంశీగారి సినిమాలనే ఎక్కువగా పరిశీలించాను. ఆయన విజువల్ సెన్స్ అద్భుతం. మన తెలుగుదనాన్ని ప్రతి క్యారెక్టర్‌లో చూపిస్తారు. సినిమా క్యారెక్టర్స్ పరంగా అయినా, మ్యూజిక్, ఎడిటింగ్ సహా అన్నీ విభాగాల్లో చక్కగా ఉంటుంది. వంశీగారికి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు పాతిక సినిమాలను డైరెక్ట్‌చేస్తే, ప్రతి సినిమా నా మూవీ లైబ్రరీలో ఉంచుకున్నాను. ఈ సినిమా కూడా ఆయనకు పెద్ద హిట్ కావాలి.సుమంత్ కెరీర్ బెస్ట్ హిట్ మూవీ అవుతుంది`` అన్నారు.
తనికెళ్ళభరణి మాట్లాడుతూ - ``పాతికేళ్ళ తర్వాత లేడీస్ టైలర్ కొడుకును కలవడం ఆనందంగా ఉంది. పాతికేళ్ళ ముందు లేడీస్ టైలర్ ఓ సంచలనం. అన్నింటి పరంగా వంశీ ప్రభంజనం అలా కొనసాగింది. ఆ స్క్రిప్ట్ అరకులో మొదలై గోదావరిలో పూర్తైంది. వంశీగారికి గోదావరి అంటే చాలా ఇష్టం. ఆయన రాసుకునే కథలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటాయి. ఆయనతో చాలా పెద్ద జర్నీ చేశాను. లేడీస్ టైలర్ అందరీ ఎఫెక్ట్. అందువల్లే ఇప్పటికీ ఆ సినిమా జ్ఞాపకాలు మిగిలిపోయాయి. నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. సుమంత్‌కు ఇదొక టర్నింగ్ పాయింట్ కావాలి. వంశీగారు మళ్ళీ విజృంభించాలి`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``మంచు పల్లకి సినిమా టైంలో వంశీగారు డైరెక్టర్ అని తెలిసి ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను తీసుకొచ్చి డైరెక్టర్ చేయాలనుకోవడం ఏమిటని మనసులో అనుకున్నాను. కానీ చరిత్ర మీకు తెలుసు. ఆయన ఎలాంటి మంచి చిత్రాలను డైరెక్ట్ చేశారో చూశాం. మనకున్న బెస్ట్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు. ఆయన ప్రతి సినిమాలో గోదావరిని, సంగీతంలో క్యారెక్టర్స్‌ను చేసుకుంటారు. మణిశర్మగారు ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేశారు. ఇప్పుడు వంశీ, మణిశర్మ, సుమంత్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యాషన్ డిజైనర్ పెద్ద హిట్ కావాలి. మధుర శ్రీధర్‌కు సినిమా అంటే ఎంతో ఫ్యాషన్. మంచి సినిమాలు తీయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. మంచి నిర్మాతగా, దర్శకుడిగా మధుర శ్రీధర్ మిగిలిపోవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - ``మన ఎం.ఎస్.రాజుగారి అబ్బాయి సుమంత్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాను. వంశీగారు పాతికేళ్ల ముందు సూపర్‌హిట్ మూవీని ఆనందంగా ఉంది. మణిశర్మగారు మ్యూజిక్ వింటుంటేనే సినిమా పెద్ద హిట్ ఖాయమని అర్థం అవుతుంది. ఫ్యాషన్ డిజైనర్ ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలంటే సినిమా మంచి ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతూనే ఉంది. మధురశ్రీధర్ కమిట్‌మెంట్, డేడికేషనే ఆయన్ను నెక్స్‌ట్ లెవల్‌కు తీసుకెళుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ - ``మణిశర్మగారు నా ఎన్నో సినిమాలకు సూపర్‌హిట్ సంగీతం అందించారు. మణిశర్మగారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్‌తో పాటు రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేస్తారు. ఇంకా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మధురశ్రీధర్‌రెడ్డి గారు మంచి సినిమాలు తీయాలని తపన ఉన్న డైరెక్టర్. ఎం.ఎస్.రాజుగారు ఎంతో మంది ప్రొడ్యూసర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. ఆయన కొడుకైన సుమంత్ అశ్విన్ ఆల్ ది బెస్ట్. వంశీగారి సినిమాలు చూడాలనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ యూనిట్ అందరికీ సినిమా సూపర్‌హిట్ అయ్యి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``ఫ్యాషన్ డిజైనర్ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మధురశ్రీధర్‌గారు మా పెళ్ళిచూపులు సినిమా చూసి ముందు మా సినిమాను కొన్న వ్యక్తి. ఆయనే సురేష్‌బాబుగారికి సినిమా చూపించారు. ఆ సక్సెస్ క్రెడిట్‌లో మధుర శ్రీధర్‌గారికి ఎక్కువ భాగం దక్కుతుంది. జూన్ 2న విడుదలవుతున్న సుమంత్ అశ్విన్‌కి సినిమా పెద్ద హిట కావాలి`` అన్నారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు వంశీగారి ఫ్యాన్‌లా పనిచేశాను. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సమయంలో వంశీగారి లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సెకండ్ షెడ్యూల్ సమయంలో సితార, అన్వేషణ సినిమాలు చూసి వంశీగారిని ఆరాధించడం మొదలు పెట్టాను. ఇక మణిశర్మగారు గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన కంపోజ్ చేసిన సినిమాల్లో ఖుషీ సినిమా సాంగ్స్‌ను ఓ వెయ్యి సార్లు చూసుంటాను. ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. మధుర శ్రీధర్‌గారు సినిమాతో పాటు ఈ ఆడియో వేడుకను కూడా గ్రాండ్‌గా చేశారు. వంశీగారితో సినిమా చేయడం నా అదృష్టం.ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ వంశీగారి నుండి కాస్తా నేర్చకున్నాను. అలాగే వేడి వేడి దోసెలు ఎలా తినాలో నేర్చుకున్నాను. కెమెరా డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా సహా అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ - ``వంశీగారు, మణిశర్మగారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక అభిమానిగా సినిమా చేశాను. దీంతో నా కల నిజమైంది. మణిశర్మగారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నా మధుర ఆడియో ఆల్బమ్స్‌లో ఇదే బెస్ట్ ఆల్బ్ అనుకుంటున్నాను.
వి.వి.వినాయ్ మాట్లాడుతూ - ``ఎప్పుడూ లాభనష్టాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాతల్లో మధుర శ్రీధర్ ఒకరు. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఎం.ఎస్.రాజుగారి అబ్బాయి పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంశీగారు, ఇళయరాజాగారి కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటాయి. అలాగే ఇప్పుడు వంశీగారు, మణిశర్మగారి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాటలు కూడా అంతే ఆదరణ పొందుతాయి. లేడీస్ టైలర్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆ సినిమాను చూశామో నాకు తెలియదు. వంశీగారి మేకింగ్ ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయనదొక ప్రత్యేకమైన శైళి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.