విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ..
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ - ``ఈ సంక్రాంతి పండుగకి ఎఫ్ 2 రావడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం. నేను పెద్దహీరోలాగా ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడిని నమ్మి సినిమా చేశాను. అనిల్‌తో ఎది బావుంది.. బాలేదు అని డిస్కస్ చేశాను. అలాగే దిల్‌రాజుగారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు నేను పనిచేస్తుంటే కో ప్రొడ్యూసర్, మేనేజర్‌లా కలిసి పోయి పనిచేశాను. దృశ్యం, గురు సినిమాలా తర్వాత చేసిన సినిమా ఇది. ఓ రకమైన ఎనర్జీని ఉండటం నాకే తెలిసింది. చాలా నేచురల్‌గా చేశాను. అనీల్ కూడా చాలా ఫ్రీ డమ్ ఇచ్చి చేయించుకున్నాడు. వరుణ్‌తేజ్, రాజేంద్రసాద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించింది. తమన్నా, మెహరీన్ వండర్ వర్క్ చేశారు. సినిమాకు పనిచేసిన సమీర్‌రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్‌లకు థాంక్స్.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో వరుణ్ తేజ్‌లా కాదు.. వరుణ్ యాదవ్‌లా కనపడతాను. ఫస్ట్ టైం ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. కామెడీ క్యారెక్టర్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు అయిపోయిందో తెలియడం లేదు. ఎంటైర్ టీం కారణంగానే సినిమా చాలా త్వరగా పూర్తైపోయింది. అందరికీ పేరు పేరునా థాంక్స్. డైరెక్టర్ అనిల్‌ను చూస్తుంటే తను మాకంటే బావున్నాడనిపిస్తుంటుంది. ఈ జర్నీ నాకు మెమొరబుల్‌గా ఉండిపోతుంది. ఆయన నా జర్నీ ఓ నటుడిగా ప్రారంభమై, బ్రదర్‌లా మారింది. ఈ సినిమాతో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ఫిదా చేశాం. అది చేశానో లేదో ఈ సినిమా స్క్రిప్ట్‌ను పంపేశారు. ఈ బ్యానర్‌లో పనిచేయడం హ్యాపీగా ఉంది. మరిన్ని సినిమాలను ఈ బ్యానర్‌లో చేయాలనుకుంటున్నాను. నేను చిన్నప్పట్నుండి చిరంజీవిగారు, బాబాయ్‌గారి సినిమాలు ఎలానూ చూస్తారు. అయితే నవ్వుకోవాలంటే మాత్రం రాజేంద్ర ప్రసాద్‌గారి సినిమాలే చూసేవాడిని. అలాంటి ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తమన్నా, మెహరీన్‌లతో కలిసి సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. మా పెద్దనాన్నగారి కాన్‌టెంపరరీ హీరో వెంకటేష్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. ఫ్రెండ్‌లా, మెంటర్‌లా మాతో ఉన్నారు. నెక్స్‌ట్ టైం ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి నేను రెడీ. ఈ సినిమాలో మా ఇద్దరి బ్రోమాన్స్ అద్భుతంగా ఉండబోతోంది. ప్రేక్షకులు సీట్లో కుదురుగా కూర్చొని సినిమా చూడలేకుండా నవ్వుతూనే ఉంటారు. సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. అన్నయ్య వినయవిధేయరామకు కూడా ఆల్ ది బెస్ట్. ఈ సంక్రాంతికి అన్నీ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తమన్నా మాట్లాడుతూ `` కొన్ని సినిమాలు మైలురాళ్లులాగా అలా నిలిచిపోతాయి. నాకు ఈ సినిమా అలాంటిది. ఊపిరి తర్వాత నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. చాలా షేడ్స్ ఉండే పాత్ర. ఎఫ్ 3 చేస్తే బావుంటుంది. మళ్లీ మేమంతా కలిసి సనిచేయవచ్చు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``ఎఫ్ 2 సినిమా రేపు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుంది. సినిమాను 75 రోజుల్లో పూర్తి చేశాం. సినిమాని 80 శాతం కామెడీతోనే నింపేశాం. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు. వెంకటేష్‌గారు, తమన్నా మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. వరుణ్ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటాడు`` అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ `` ఓ సినిమా సిద్ధం అవ్వడానికి 24 క్రాఫ్ట్స్ కష్టం ఉండాల్సిందే. ఈ సినిమాకీ మేమంతా అలానే కష్టపడ్డాం. `కలియుగ పాండవులు`తో వెంకటేష్‌గారి అభిమానిని అయ్యా. వారం రోజుల ముందే టికెట్ బుక్ చేసుకుని అభిమానిగా చూశా. ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. కథ విన్న వెంటనే `నా పాత్ర ఏంటి` అని అడక్కుండా ఒప్పుకున్నాడు వరుణ్. అనిల్ దగ్గర ఓ మ్యాజిక్ ఉంది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు`` అన్నారుఇంకా ఈ కార్యక్రమంలో మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.