pizza
Gang Leader pre release function - Hyderabad
సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు - నేచురల్‌ స్టార్‌ నాని
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 September 2019
Hyderabad

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక హీరోయిన్‌. 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలచేసిన ట్రైలర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌తో సినిమాపై హై ఎక్స్‌ పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల సందర్భంగా హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో....

నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ - '' సెప్టెంబర్‌ 13న 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. సినిమా డెఫినెట్‌గా హ్యుజ్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఫ్యామిలీ, యూత్‌ అందరూ చూడదగ్గ చిత్రం. నాని గారితో'కృష్ణగాడివీరప్రేమగాథ' సినిమా నుండే ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. త్రి ఇయర్స్‌ తరువాత 'గ్యాంగ్‌లీడర్‌' కుదిరింది. నెక్స్ట్‌ మూవీ తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. మా బేనర్‌లో బ్రహ్మాండమైన సినిమా తీసిన విక్రమ్‌ గారికి థాంక్స్‌. అలాగే ప్రియాంక, కార్తీక్‌తో పాటు మిగతా ఆర్టిస్టులకి, టెక్నీిషియన్స్‌కి ధన్యవాదాలు'' అన్నారు.

వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ - ''ముందుగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నాని గారికి థాంక్స్‌, నాని గారు ఈ సినిమాకు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. మైత్రి వారు బెస్ట్‌ ప్రొడ్యూసర్స్‌. వారు ఎన్నో గొప్ప సినిమాల్ని నిర్మించారు. వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. కార్తికేయ రోల్‌ చాలా బాగుంటుంది. అలాగే ప్రియాంక వండర్‌ఫుల్‌ పెర్ఫార్మర్‌. అనిరుద్‌ అద్భుతమైన మ్యూజిక్‌, మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. మా సినిమాటోగ్రాఫర్‌మిరోస్లాకుబాబ్రోజెక్‌ పోలెండ్‌ నుండి వచ్చారు. వండర్‌ఫుల్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఎడిటర్‌ నవీన్‌ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్‌ 13న తప్పకుండా సినిమా చూడండి'' అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్‌ సి.ఇ.ఓ.చిరంజీవి(చెర్రీ) మాట్లాడుతూ - '' ఫిబ్రవరి 19న ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. సిక్స్‌మంత్స్‌ టైమ్‌లోనే మూవీఅన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రావడం చాలా గొప్ప విషయం. దీనికి డెఫినెట్‌గా విక్రమ్‌ గారే కారణం. బ్రిలియంట్‌ ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశారు. సినిమాలో సీజీ వర్క్‌ చాలా ఉంది. దానికి సంభందించిన షూటింగ్‌ అంతా ఫస్ట్‌లోనే కంప్లీట్‌ చేసి బెస్ట్‌ అవుట్‌ ఫుట్‌ రావడానికి ఆ కంపెనీకి కావాల్సిన టైమ్‌ ఇచ్చారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరూ చాలా సపోర్ట్‌ చేశారు. లక్ష్మి గారు డాక్టర్‌ని దగ్గర పెట్టుకొని మరీ నటించారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో సినిమా చూడండి'' అన్నారు.

హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ - '' ఈనెల 13న మా సినిమా రిలీజ్‌ అవబోతుంది. మేకింగ్‌ అంతా చాలా ఫన్నీగా సాగింది. తప్పకుండా సినిమా చూడండి'' అన్నారు.

నటుడు కార్తికేయ మాట్లాడుతూ - '' కథ వినగానే చాలా ఎగ్జైటెడ్‌గా అనిపించింది. అలాగే విక్రమ్‌ గారు, నాని గారు ఉన్నారని ఈ క్యారెక్టర్‌ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు అర్ధం అవుతుంది ఒకవేళ నేను ఎవరి వల్ల అయినా ఇన్‌ఫ్లుయన్స్‌ అయ్యి ఈ సినిమా చేయకపోయి ఉంటే ఎంత మిస్‌ అయ్యి ఉండేవాడిని అని. ఈ మూవీ ఇంకో పది పదిహేను సంవత్సరాల వరకూ ఒక కొత్త ట్రెండ్‌ని, కొత్త జోనర్‌ ని క్రియేట్‌ చేసి చాలా సినిమాలకు రిఫరెన్స్‌ అయ్యే సినిమా అవుతుంది. నాని గారికి ఈ ఇయర్‌ 'జెర్సీ' లాంటి డిఫరెంట్‌ మూవీ ఉంది. దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని వేరే భాషలలో చేస్తున్నారు. ఇప్పడు 'గ్యాంగ్‌ లీడర్‌' చేశారు. అందుకే ఆయన నేచురల్‌ స్టార్‌ అయ్యారు. ప్రియాంక చాలా బాగా పెర్ఫామ్‌ చేసింది. టీమ్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''ఈరోజుతో మా ప్రమోషన్‌ పార్ట్‌ ముగుస్తుంది. రెండు రోజుల్లో సినిమా రాబోతుంది. మిగతాది సినిమానే చూసుకుంటుంది. రిలీజ్‌కి ముందు తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్‌ అన్ని చోట్ల మా టీమ్‌కి మీడియా నుండి, ప్రేక్షకులనుండి వామ్‌ వెల్కమ్‌ లభించింది. ఈ సందర్భంగా అందరికి థాంక్స్‌. ఇప్పుడు టీమ్‌ అందరం హైదరాబాద్‌కి వచ్చాం. హైదరాబాద్‌ మీడియాని కలవకపోతే ఈ కంప్లీట్‌ సర్కిల్‌ పూర్తి అవదు అనిపించి మన మీడియా మిత్రులని కలుద్దామని ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం. సినిమా అవుట్‌ ఫుట్‌తో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో మీ నవ్వులు చూద్దామా అని ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లమ్‌ లేకుండా ఈ సినిమా పూర్తి అయింది అంటే దానికి కారణం మైత్రి టీమ్‌. విక్రమ్‌ సర్‌ కెరీర్‌లో ఇది ఫాస్టెస్ట్‌ ఫిలిమ్‌. షూటింగ్‌ ప్రతి ఒక్కరం ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఈ సినిమా మా అందరికి పెయిడ్‌ హాలిడేలా అనిపించింది. డైరెక్షన్‌ డిపార్ట్మెంట్‌ విషయంలో విక్రమ్‌ చాలా లక్కీ డైరెక్టర్‌. సరైన టీమ్‌ కుదిరింది. కార్తికేయ బిజీగా ఉండికూడా కథ విని ఎగ్జయిట్‌ అయి ఒప్పుకున్నాడు. రేపు మీరు కొత్త కార్తికేయనుచూడబోతున్నారు. కూబా పోలెండ్‌ నుండి వస్తున్నారు అనగానే కొంచెం బయపడ్డాం. అతని వల్లే సినిమా బ్రాండ్‌ న్యూగా ఉంది. అనిరుద్‌ మాకు బ్యాక్‌బోన్‌లా అయ్యారు. ప్రతి సాంగ్‌ సెన్సేషన్‌ అవుతుంది. నాకు రిలీజ్‌ ముందు రెండు రోజులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ టెన్షన్‌లో ఒక కిక్‌ ఉంటుంది. ఈ రెండు రోజులు నేను ఎంజాయ్‌ చేస్తాను. సెప్టెంబర్‌ 13 నుండి మీరు ఎంజాయ్‌ చేయండి '' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved