pizza
Music Shop Murthy Pre Release Event
The film 'Music Shop Murthy', made with love and soul, should become a big success: Sai Rajesh at the pre-release event
మనసుతో, ప్రేమతో తీసిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి రాజేష్
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 June 2024
Hyderabad

Ajay Ghosh and Chandni Chowdary played prominent roles in the movie 'Music Shop Murthy'. Harsha Garapati and Ranga Rao Garapati produced this movie under Fly High Cinemas banner. Siva Paladugu has written and directed this movie. 'Music Shop Murthy' is slated to release on June 14th. Meanwhile, a pre-release event of the movie was held on Wednesday. Director Sai Rajesh and producer Dheeraj Mogilineni were the chief guests for this event.

*While speaking at the event, Sai Rajesh said,* “Harsha Garu released our movie 'Baby' overseas. Our film came out because of his confidence. I didn't know before that Music Shop Murthy was Harsha Garu's movie. The trailer shows that the director has made this film with love, soul, and passion. I love Pawan's music. Srinivas captured the visuals brilliantly. Chandni is an amazing actress. I wish her to attain a good break with this film. Ajay Ghosh is enjoying a good phase now. He can play any role. I hope this movie will become a big success.”

*Dheeraj Mogilineni said,* “Harsha distributed our films overseas. He chooses content-based films, after watching teasers and trailers. His judgment is spot-on. Well, he is becoming a producer with this film. I have known Director Siva for a month. He didn't look like a debut director. He has good knowledge in every aspect of filmmaking. I have already seen the movie. Ajay Ghosh makes everyone cry with his performance. It inspires people from all walks of life. It will connect emotionally to everyone. Chandni is the main pillar of this film. Aamani has acted amazingly. The film’s team worked very hard. If this film becomes a success, everyone will get a good name.”

*Ajay Ghosh said,* “Thanks to Sai Rajesh and Dheeraj Mogilineni who came as guests for the event. Dheeraj came forward to release our film after watching it. We can’t move forward without someone recognizing our talent and encouraging us. Everyone will connect with this movie. What we wanted to be? What we have become? Where did we end Up? We will get clarity on all these after watching this movie. You will thoroughly enjoy watching this movie. You will become emotional. Everyone has seen the characters of Murthy, Anjana, and the society around them in Music Shop Murthy, in promos. Dayanand, Chandini, and Aamani have all acted brilliantly. Someone somewhere connects with each character. It's not a movie, it's a life journey. Anyone can achieve anything after watching this movie. I don’t know what did the director see in me. But he waited two and a half years for me. I also faced more difficulties than Murthy in this industry. My wife stood by me a lot during this journey. It’s a must-watch movie for every family. All sections of people will like this movie. They will watch 100 cr movies and also content-based movies. Everyone should watch our movie on June 14th.”

*Chandni Chowdary said,* “Thanks to Sai Rajesh Garu and Dheeraj Garu who came to our event as guests. Every human has hopes and ambitions. Some are known at an early age. Some are closer to reality. Others are far from reality. This film will connect with everyone who has such hopes and aspirations. You are never too old to dream in life. The age limit is set for each and everyone in the society. Most of them disappoint you. Many will compromise. Our film intends to say that having a goal and a dream has nothing to do with age. Ten or twelve years ago I thought I would be a heroine. Many people laughed. There were days when I laughed too. Now, two of my films are releasing on the same day. It is a pleasure to act in such a film. It will emotionally connect to everyone. Even if a hundred people watch this movie and one think like Murthy, then we have won. Watch our movie with families on 14th June. Everyone will like it.”

*Siva Paladugu said,* “Everyone will like our film one hundred percent. The movie 12th Fail came out and became a big hit. It was an inspirational story. A movie titled Laapataa Ladies was also a big success. It was an emotional drama. Our film is also an inspirational and emotional one. Everyone likes our film. Without our team, this film would not have turned out so well. Thanks to everyone who worked on the film. It may be a small film, but it is a big movie because of the story, emotion, and performance of the artists. Everyone will enjoy this movie. Watch our movie on June 14th and support it.”

*Harsha Garapati said,* “I have distributed Hrudaya Kaleyam in New Jersey through Fly High Cinemas. We also distributed Dheeraj's Baby and Ambajipet overseas. I share a good rapport with both of them. Thanks to both of them who came as guests to our event. Everyone will understand the acting prowess of Ajay Ghosh, after watching this movie. Special thanks to Chandni Chowdary. Our film is releasing on June 14th. Please watch and encourage it.”

*Music director Pawan said,* "Before I did RR, I saw the film and felt it would become a hit. I thought it would be enough if I didn’t spoil the experience with the background score. I have given music for a very good film.”

*Cameraman Srinivas said,* “Thanks to Sai Rajesh Garu and Dheeraj Garu for coming to our event. Thanks to the directors and producers who believed in me and gave me a chance. We believe that we have made a good film. Our film is coming on June 14th. I hope everyone will watch and support the film.”

*Editor Nageshwar said,* “We get a feel of watching a biopic of a person. It will have such feel and emotions. The film is releasing on June 14th. Everyone should watch and make it successful.”

*Dayanand said,* “Thanks to Sai Rajesh and Dheeraj who came to the event. I will be seen as a club owner in this movie. This is a very new role for me. Thanks to the director Siva who believed in me and gave me the character. Chandni's character and Ajay Ghosh's characters can't be done by anyone. Our film is coming on June 14th. It is a film that will make everyone emotional.”

మనసుతో, ప్రేమతో తీసిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి రాజేష్

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

*సాయి రాజేష్ మాట్లాడుతూ..* ‘ఓవర్సీస్‌లో మా బేబీ సినిమాను హర్ష గారు రిలీజ్ చేశారు. ఆయనకున్న కాన్ఫిడెన్స్ తోనే మా చిత్రం బయటకు వచ్చింది. ఇది హర్ష గారి సినిమా అని నాకు ముందుగా తెలియదు. మనసుతో, ఇష్టంతో, ప్రేమతో ఈ సినిమాను దర్శకుడు తీశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. పవన్ గారి సంగీతం నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్ గారు చక్కగా చూపించారు. చాందినీ గారు అద్భుతమైన నటి. ఈ చిత్రంతో ఆమెకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అజయ్ ఘోష్‌కు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ఎలాంటి పాత్రైనా ఆయన నటించగలరు. ఈ టీంకు మంచి బ్రేక్ రావాలి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.

*ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..* ‘హర్ష గారు ఓవర్సీస్‌లో మా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. టీజర్, ట్రైలర్ చూసి కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎంచుకుంటారు. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది. అలాంటి ఆయన ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. దర్శకుడు శివ గారితో నాకు నెల నుంచి పరిచయం ఏర్పడింది. కొత్త దర్శకుడిలా అనిపించలేదు. టెక్నికల్‌గా, సౌండింగ్‌ పరంగా ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ నేను సినిమాను చూశాను. అజయ్ ఘోష్ గారు తన నటనతో అందర్నీ ఏడ్పిస్తారు. అన్ని వర్గాల వారిని ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. చాందినీ గారు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా కనిపిస్తారు. ఆమని గారు అద్భుతంగా నటించారు. సినిమా టీం చాలా కష్టపడింది. ఈ చిత్రం సక్సెస్ అయితే అందరికీ మంచి పేరు వస్తుంది. ఈ టీంకు మంచి సక్సెస్ రావాలి’ అని అన్నారు.

*అజయ్ ఘోష్ మాట్లాడుతూ..* ‘మా చిన్న చిత్రాన్ని ఆశీర్వదించడానికి మనసున్న మహారాజులు వచ్చారు. ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సాయి రాజేష్ గారికి, ధీరజ్ మొగిలినేని గారికి థాంక్స్. మా చిత్రాన్ని చూసి రిలీజ్ చేసేందుకు ధీరజ్ గారు ముందుకు వచ్చారు. టాలెంట్‌ను గుర్తించి, భుజం తట్టే వాళ్లు నడిపించే వాళ్లు లేకపోతే ముందుకు వెళ్లలేం. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏం అవ్వాలనుకున్నామో.. ఏం అయ్యామో.. ఏమై మిగిలిపోయామో.. ఈ సినిమా చూసిన తరువాత తెలుస్తుంది. ఈ మూవీ చూసి ఆనందపడతారు. కుమిలిపోతారు. మ్యూజిక్ షాప్ మూర్తి ప్రోమోస్ లో మూర్తి, అంజన పాత్రలు, వాళ్ల చుట్టూ ఉన్న సమాజాన్ని అందరూ చూసి ఉంటారు. దయానంద్, చాందినీ, ఆమని గారు ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్రతీ పాత్రతో ఎక్కడోచోట ఎవరోకరు కనెక్ట్ అవుతారు. ఇది సినిమా కాదు.. జీవితం. ఈ సినిమా చూసిన తరువాత ఎవరైనా ఏదైనా సాధిస్తారు. నాలో ఏం చూశాడో కానీ.. నేను ఈ పాత్ర చేయాలని రెండున్నరేళ్లు ఎదురుచూశాడు. నేను కూడా మూర్తి కంటే ఎక్కువ కష్టాలు ఈ ఇండస్ట్రీలో పడ్డాను. ఈ ప్రయాణంలో నా భార్య నాకు ఎంతో అండగా నిలబడింది. ప్రతీ కుటుంబం చూడాల్సిన సినిమా. అన్ని వర్గాల వారికి ఈ చిత్రం నచ్చుతుంది. వంద కోట్లు పెట్టి తీసినా చూస్తారు.. కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా చూసి సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్లు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. జూన్ 14న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

*చాందినీ చౌదరి మాట్లాడుతూ..* ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సాయి రాజేష్ గారికి, ధీరజ్ గారికి థాంక్స్. ప్రతీ మనిషికి ఆశలు, ఆశయాలుంటాయి. కొన్ని చిన్నప్పుడే తెలుస్తాయి. కొన్ని రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. ఇంకొన్ని రియాల్టీకి దూరంగా ఉంటాయి. అలాంటి ఆశలు, ఆశయాలతో ఉండే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. కల కనడానికి ఓ వయసంటూ ఉండదు. సమాజంలో ప్రతీ ఒక్క దానికి ఏజ్ లిమిట్ పెడతారు. నిరుత్సాహ పర్చే వారే ఎక్కువగా ఉంటారు. చాలా మంది కాంప్రమైజ్ అవుతారు. ఓ లక్ష్యం, కల కనడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. పది, పన్నెండేళ్ల క్రితం నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా. చాలా మంది నవ్వారు. నేను కూడా నవ్వుకున్న రోజులున్నాయి. కానీ కట్ చేస్తే.. ఒకే రోజు నా రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. వంద మంది ఈ మూవీని చూసి మూర్తిలా ఒక్కరు ఆలోచించినా మాకు విజయం వచ్చినట్టే. జూన్ 14న మా చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.

*శివ పాలడుగు మాట్లాడుతూ..* ‘మా చిత్రం అందరికీ వంద శాతం నచ్చుతుంది. 12th ఫెయిల్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. అదొక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. లాపతా లేడీస్ అనే సినిమా వచ్చింది. అది కూడా పెద్ద విజయాన్ని సాధించింది. అదొక ఎమోషనల్ డ్రామా. మా చిత్రం కూడా ఇన్‌స్పిరేషనల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. అందరికీ మా చిత్రం నచ్చుతుంది. మా టీం లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇది చిన్న చిత్రం కావొచ్చు.. కథ, ఎమోషన్, ఆర్టిస్టుల పర్ఫామెన్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. జూన్ 14న మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

*హర్ష గారపాటి మాట్లాడుతూ..* ‘ఫ్లై హై సినిమాస్ ద్వారా న్యూజెర్సీలో హృదయకాలేయం డిస్ట్రిబ్యూట్ చేశాను. ధీరజ్ గారి బేబీ, అంబాజీపేటను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేశాం. వారిద్దరితో నాకు అనుబంధం ఉంది. మా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన వారిద్దరికీ థాంక్స్. అజయ్ ఘోష్ ఎంతటి నటులో ఈ చిత్రం చూస్తే అందరికీ తెలుస్తుంది. చాందినీ చౌదరి గారికి థాంక్స్. మా చిత్రం జూన్ 14న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ..* ‘ఆర్ఆర్ చేయకముందే సినిమా చూస్తే హిట్ అనిపించింది. నేను ఆర్ఆర్ చేసి చెడగొట్టకుండా ఉంటే చాలని అనుకున్నా. మంచి సినిమా తీశారు. మంచి చిత్రానికి నేను మ్యూజిక్ ఇచ్చాను’ అని అన్నారు.

*కెమెరామెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ..* ‘మా ఈవెంట్‌కు వచ్చిన సాయి రాజేష్ గారికి, ధీరజ్ గారికి థాంక్స్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది. జూన్ 14న మా చిత్రం రాబోతోంది. సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ఎడిటర్ నాగేశ్వర్ మాట్లాడుతూ..* ‘వ్యక్తి జీవితాన్ని బయోపిక్‌గా తీస్తే ఎలా ఉంటుందో.. అంత ఫీలింగ్ ఈ చిత్రంలో ఉంటుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం జూన్ 14న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

*దయానంద్ మాట్లాడుతూ..* ‘ఈవెంట్‌కు వచ్చిన సాయి రాజేష్, ధీరజ్ గారికి థాంక్స్. క్లబ్ ఓనర్‌గా ఈ సినిమాలో కనిపిస్తాను. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నన్ను నమ్మి కారెక్టర్ ఇచ్చిన దర్శకుడు శివ గారికి థాంక్స్. చాందినీ గారి పాత్ర, అజయ్ ఘోష్ గారి కారెక్టర్‌ ఎవ్వరూ చేయలేరు. జూన్ 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి. అందరినీ కంటతడి పెట్టించే చిత్రం అవుతుంది’ అని అన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved