అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన సినిమా `ఒక్క క్షణం`. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ``నిర్మాత చక్రి చిగురుపాటిగారికి ముందు థాంక్స్. ఎందుకంటే నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను దిల్‌రాజుగారితో జర్నీ స్టార్ట్ చేసినట్లే..మీతో శిరీష్ జర్నీని స్టార్ట్ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని కోరుకుంటున్నాను. శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్ ఛోటా సహా అందరి టెక్నిషియన్స్‌కు థాంక్స్. అవసరాల శ్రీనివాస్‌గారు ఇందులో సెకండ్ హీరో రోల్ చేశారు. అలాగే శీరత్ కపూర్, సురభి చూడటానికి అందంగా కనపడతున్నారు. టైగర్ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. అదే విషయం శిరీష్‌కి చెప్పి..తన సినిమా టేకింగే కాదు..థర్డ్ ప్రాసెస్ కూడా బావుందని చెప్పాను. కానీ ముందు తను పెద్దగా విన్నట్లు కనపడలేదు. తర్వాత ఓ రోజు నన్ను కలిసి నిజంగానే మంచి విషయం చెప్పావు. నేను ఆనంద్ గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న భూమికను పోషించాననిపిస్తుంది. ఇక ఆనంద్‌గారి గురించి చెప్పాలంటే..వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఇన్ తెలుగు. ఫ్యూచర్‌లో ఆయన్నుండి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. శిరీష్‌తో ఇంత మంచి సినిమాను చేసినందుకు ఆనంద్‌గారికి థాంక్స్. ఈ సినిమా కథ కూడా నాకు తెలియదు. ట్రైలర్‌ని కూడా అందరిలాగానే చూశాను. అయితే ఓ వారం ముందు మాత్రమే సినిమాను చూశాను. ఓ ఆడియెన్‌లా సినిమా చూశాను. సినిమా హిట్ మూవీ అనిపించింది. కానీ రేంజ్ ఎంత అని చెప్పలేను. ఇక నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా గురించి చెప్పాలంటే..నేను ఎన్ని సినిమాలు చేసినా ..నేను గర్వపడే టైటిల్ ఇదే అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నేను గర్వపడే సినిమా కూడా అవుతుందని అనుకుంటున్నాను. జనవరి 1న ఫస్ట్ ఇంపాక్(టీజర్) విడుదల కానుంది`` అన్నారు.
దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - ``నిర్మాత చక్రిగారు నాపై నమ్మకంతో సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హీరో శిరీష్ 14 నెలలుగా ఈ సినిమా కోసమే వర్క్ చేశారు. ఈ సినిమాలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - ``ఇది ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా. టీజర్, ట్రైలర్ చూశారు. ఇక సినిమాయే మాట్లాడాలనుకుంటున్నాను. ఇలాంటి కథ నేనెప్పుడూ వినలేదు. కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యి చేశాను. 14 నెలలుగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నాను. జనాలకు కొత్త రకం సినిమా అవుతుందని గట్టిగా నమ్మాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో ఎలాగైతే ఓ కథను లవ్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా మిక్స్ చేసి దర్శకుడు ఆనంద్‌గారు తెరకెక్కించారు. ఈ కథను కూడా..ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో ఎక్కడా డైవర్ట్ లేకుండా ఆనంద్ తెరకెక్కించారు. ఈ సినిమా నాకెంత పెద్ద సక్సెస్ కావాలో అంత కంటే పెద్ద సక్సెస్ ఆనంద్ అనే విజనరీ ఫిలిం మేకర్ కోసం హిట్ కావాలి. రానున్న రోజుల్లో ఈ దర్శకుడి పేరు చాలాసార్లు వింటారు. అంత మంచి కథలు తన దగ్గర ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఆడినా పర్వాలేదు కానీ తనతో ఓ సినిమా చేయాలనుంది. హరిగారు, రాజేష్, ఆనంద్‌గారి శ్రీమతి అనూషగారి వల్లే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. సురభి చాలా క్యూట్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత తనను ఇష్టపడేవాళ్లు ఎక్కువ అవుతారు. తను క్యారెక్టర్‌లో అంత బాగా ఇన్‌వాల్వ్ అయ్యింది. అలాగే అవసరాల శ్రీనివాస్ ఇందులో కీలకమైన పాత్ర చేశారు. ఈ సినిమాకు తనే సెకండ్ హీరో. అలాగే శీరత్ కపూర్ ఓ చాలెంజింగ్‌గా తీసుకుని ఇందులో సెకండ్ లీడ్ చేసింది. ఇక సినిమాలో నటించిన ఇతర నటీనటులకు థాంక్స్. మణిశర్మగారు నా సినిమాకు సంగీతం అందించడం నా అదృష్టంగా బావిస్తున్నాను. పాటలన్నీ ఒక ఎత్తు అయితే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. రేపు సినిమా చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. శ్యామ్ కె.నాయుడు వంటి మంచి సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు పనిచేశారు. నాగేంద్రగారి ఆర్ట్ వర్క్ సినిమాకు మేజర్ ఎసెట్. అబ్బూరి రవి, విజయ్ కామిశెట్టి అందించిన కథ మాటలు సినిమాకు బలాన్నిచ్చాయి. చక్రి చిగురుపాటి నిర్మాతగా నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. సతీష్ వేగేశ్న, రాజేష్ దండాకు థాంక్స్. చాలా ప్రేమతో, కొత్త తరహా కథలో ఇండస్ట్రీ స్థాయిని పెంచాలనే జెన్యూన్ అటెంప్ట్‌ను ఈ సినిమా ద్వారా చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
సురభి మాట్లాడుతూ - ``ఈ సినిమా నా లైఫ్‌లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆనంద్ గారికి థాంక్స్. ఆయన ప్రతి క్యారెక్టర్‌ను ఎంతోఅందంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు సినిమా మేకింగ్‌లో ఎంతగానో సపోర్ట్ చేశారు. హీరో శిరీష్ ఎంతో ఓపికగా ఉండి నాకు సపోర్ట్ చేశారు. మంచి ఇన్‌టెన్స్ ఉన్న నటుడిని ఈ సినిమాలో చూస్తారు. అవసరాల శ్రీని, శీరత్‌లకు థాంక్స్`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``ఈ సినిమా గురించి చెప్పేక్రమంలో ముందుగా దర్శకుడు ఆనంద్ గురించి చెప్పాల్సిందే. తను ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు. నేను కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాను. ఇంత మంచి సినిమాను శిరీష్‌తో తెరకెక్కించినందుకు ఆనంద్‌గారికి థాంక్స్. సినిమా మేకింగ్‌లో అనుకున్న సమయం కంటే మూడు నెలలు ఆలస్యమైనా. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చక్రి చిగురుపాటి సినిమా చేశారు. మణిశర్మగారు చక్కటి మ్యూజిక్‌ను అందించారు. సురభి, శీరత్ ఇద్దరూ ఎక్సలెంట్ పెర్ ఫార్మ్ చేశారు. అవసరాల శ్రీనివాస్ సెకండ్ హీరో క్యారెక్టర్‌ను చక్కగా చేశాడు. శిరీష్..గ్రాఫ్ చూస్తే తన పెర్ఫామెన్స్ బెటర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమాను తప్పకుండా హిట్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
కె.నాగబాబు మాట్లడుతూ - ``డైరెక్టర్ ఆనంద్‌తో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. మంచి కథ ఇది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు..అందులో అగ్గిపుల్లల సీన్ బాగా నచ్చింది. ప్రాబబులిటీ అనే థియరీపై సీన్‌ను చెప్పిన ఆలోచనకు థ్రిల్ అయ్యాను. సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించింది. సైంటిఫిక్ ఆలోచనలతో తెలుగులో వచ్చే సినిమాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఆ అగ్గిపుల్లల సీన్ చూడగానే నాకు సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనిపించింది. మణిశర్మగారు మాకు ఎంతో ఆప్తుడు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించాడు. ఆయన సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లోని పాత్రల ద్వారా రాని సంతృప్తి ఈ సినిమాలోని పాత్ర ద్వారా నాకు వచ్చింది. అలాంటి మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. శిరీష్ ఓ కొత్త తరహా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో పదేళ్లలో తెలుగు సినిమాను కొత్త దిశగా నడిపిస్తాడని నా నమ్మకం. బన్నిగారిని ఆదరించినట్లే శిరీష్‌గారిని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.