
21 February 2025
Hyderabad
Aadhi Pinisetty and director Arivazhagan, who previously delivered the super hit Vaishali, have teamed up once again for an intriguing supernatural crime thriller, Shabdam. Produced by 7G Films Shiva, the film features Simran, Laila, and Lakshmi Menon in key roles. The promotional content released so far has generated great curiosity among the audience. The film is set to hit theaters on February 28th, with N Cinemas releasing it in Andhra Pradesh and Mythri Distribution handling Nizam.
At the grand pre-release event, with Natural Star Nani as the chief guest, he shared his thoughts about the film:
"Aadhi has been my friend since Ninnu Kori, and over time, we’ve become even closer—he's family now. He rarely asks for favors, but this time, he personally invited me for Shabdam, and I understood why. I have already watched the film, and it is one of the most technically brilliant films I’ve seen in a long time. The movie is full of surprises and presents sound as a weapon in a fresh and unique way. Hats off to the sound-mixing team!
I loved Vaishali’s songs, and Thaman’s album for that film is still one of his best. Even in Shabdam, the songs are impressive. The film is gripping, and presenting such a complex idea convincingly is no easy task. It takes a strong team that truly believes in the concept, and Shabdam is just that—brilliant.
I was deeply moved by the film’s emotional depth. I never imagined that a horror film could bring tears to my eyes. This is not just a horror film—it has a powerful story and high emotional value. Everyone should watch it on February 28th, especially horror movie lovers—gather your friends and experience it in theaters. This is a film meant to be watched on the big screen. I sincerely wish Shabdam a blockbuster success."
Aadhi Pinisetty on Shabdam:
"First of all, I want to thank my dear uncle, Nani, for coming despite the short notice. When we make a unique film like this, it needs the support of a star like Nani to reach the audience. The journey of Shabdam began 16 years ago. If Vaishali hadn’t happened, Shabdam wouldn’t exist. I thank my director Arivazhagan for this. Vaishali remains relevant even today because of its honesty, and we made Shabdam with the same integrity.
Many questioned why I was doing another horror film. But Vaishali was also a horror film, and it became a special movie in my career. I believe Shabdam will be just as special. Thaman played a crucial role in this film, providing music that perfectly complements the visuals. Technically, this film is extraordinary. The entire technical team deserves credit. Simran, Laila, and all the other actors have delivered beautifully crafted performances.
This is a horror film packed with strong emotions and an engaging story. It releases on February 28th, and I truly believe horror fans will love it."
Director Arivazhagan on Shabdam:
"A big thank you to Nani for supporting us. Also, my heartfelt gratitude to our producers for believing in this story. Vaishali was a massive commercial success, and that film had a water backdrop. When Aadhi and I decided to collaborate again, we wanted to use sound as the central horror theme. Visualizing sound and creating horror from it was a big challenge, but we took it on.
Thaman is my best friend, and he has given music that enhances the impact of the film tenfold. His background score brings life to Shabdam. Lyricist Ramajogayya Sastry garu has written wonderful lyrics. I love Telugu cinema, and we made this film with Telugu audiences in mind. Theatrical experience matters, and audiences are embracing films with strong content. I have full confidence that Shabdam will resonate with everyone."
Director Deva Katta on Shabdam:
"I have been closely following Aadhi’s work for a year now, and he is an excellent actor. He brings dignity to every role he plays. The glimpses of this film are simply extraordinary—it feels like a Hollywood-level production. I truly hope this film achieves great success."
Lyricist Ramajogayya Sastry on Shabdam:
"Whenever Nani supports a film, you know it has substance. Aadhi has always chosen unique stories. Director Arivazhagan and Thaman share a great creative journey, and I have written four songs for this film. I am especially excited about a song sung by Chitra garu. This is a film with strong content, and I have full faith that it will be a big success."
Distributor Shashidhar Reddy (Mythri Distribution):
"We thoroughly enjoyed Vaishali, which was based on water, and now Shabdam revolves around sound. Having already watched the film, I can assure the audience that they will love it. I highly recommend experiencing it in Dolby Atmos theaters for the best sound experience. We hope audiences will watch and bless the film."
Distributor Hanumanth Reddy (N Cinemas):
"We watched the film, and it impressed us so much that we immediately acquired the Andhra, Telangana, and Karnataka rights. Shabdam is bound to be a big hit. Every scene is engaging, and the climax is mind-blowing."
Distributor Lakshmikant Reddy (N Cinemas):
"We purchased the AP and Telangana rights after watching the film because it’s truly terrific. Every episode builds curiosity, and audiences will thoroughly enjoy it. It will be an even bigger success than Vaishali."
Cinematographer Arun Padmanabhan:
"I started my journey as an assistant cameraman in Vaishali, and even back then, I told the director that I wanted to shoot one of his films. That dream has now come true with Shabdam. This film is a theatrical experience, so please watch it in cinemas."
With a unique concept, strong emotional depth, and top-notch technical execution, Shabdam promises to be a must-watch horror thriller when it releases on February 28th.
‘శబ్దం’ టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్. మంచి కథ, హై ఎమోషన్ వున్న హారర్ సినిమా. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. ఈ సినిమా ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఆది నాకు 'నిన్ను కోరి' సినిమా నుంచి ఫ్రెండ్. ఆ తర్వాత ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యారు. ఇప్పుడైతే ఫ్యామిలీ అయిపోయాడు. తనకి చాలా మొహమాటం. ఎప్పుడు ఏదీ అడగడు. ఫస్ట్ టైం ‘శబ్దం’ గురించి ఇక్కడికి రమ్మని అడిగాడు. ఈ సినిమాపై తను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో నాకు తెలుసు. ఈ సినిమా ఆల్రెడీ చూశాను. ఇది టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్. సినిమాలో సర్ ప్రైజ్ అయిన విషయాలు చాలా వున్నాయి. సౌండ్ ఒక వెపన్ అని ఒకరకమైన కొత్త యాంగిల్ ని సినిమాలో చూపించారు. సౌండ్ మిక్సింగ్ టీం అందరికీ హ్యాట్సప్. నాకు వైశాలి పాటలు చాలా ఇష్టం. తమన్ గారి టాప్ ఆల్బం అది. ‘శబ్దం’లో పాటలు కూడా చాలా నచ్చాయి. సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారు. ఇలాంటి ఐడియాని కన్వెన్స్ గా చెప్పాలంటే పెద్ద పని. ఒక మంచి టీం ఐడియాని నమ్మి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ విషయంలో ‘శబ్దం’ బ్రిలియంట్. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఎమోషనల్ గా చాలా హై ఇస్తుంది. హారర్ సినిమా చూసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ ఎమోషన్ వున్న హారర్ సినిమా ఇది. ఫిబ్రవరి 28న అందరూ చూడండి, ముఖ్యంగా హారర్ ఫిలిమ్స్ ని ఇష్టపడే వారైతే పదిమంది ఫ్రెండ్స్ తో కలసి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఆదికి,ఈ టీంకి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ 'అన్నారు.
హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. షార్ట్ నోటీస్ లో పిలిచినా కూడా వచ్చి ఈ అకేషన్ ని గ్రేస్ చేసిన మా బాబాయ్ నానికి థాంక్ యూ. ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే నాని లాంటి స్టార్ సపోర్ట్ కావాలి. ‘శబ్దం’ జర్నీ 16 ఏళ్ల క్రితం మొదలైయింది. వైశాలి లేకపోతే ‘శబ్దం’ వుండేది కాదు. మా డైరెక్టర్ అరివళగన్ కి థాంక్ యూ. వైశాలి ఇప్పుడు చూసిన రిలవెంట్ గా వుంటుంది. కథలో వున్న నిజాయితీ అది. అదే నిజాయితీతో శబ్ధం తీశాం. చాలా మంది హారర్ సినిమా ఎందుకు చేయాలి అన్నారు. వైశాలి సినిమా కూడా హారర్. అది నా కెరీర్ స్పెషల్ మూవీ. అలాగే శబ్ధం సినిమా కూడా స్పెషల్ మూవీ అవుతుందని కోరుకుంటున్నాను. తమన్ ఈ సినిమాకి ఇంపార్టెంట్ పర్శన్. విజువల్ కి తగిన మ్యూజిక్ ఇచ్చారు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా అద్భుతంగా వుంటుంది. టెక్నికల్ టీం అందరికీ థాంక్ యూ. ఇందులో సిమ్రాన్ గారు లైలా గారు అందరి పాత్రలు చాలా బ్యూటీఫుల్ గా వుంటాయి. మంచి కథ ఎమోషన్ తో వస్తున్న హారర్ సినిమా ఇది. ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతోంది. అందరు హారర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ'అన్నారు.
దర్శకుడు అరివళగన్ మాట్లాడుతూ.. నాని గారికి థాంక్ యూ. ఈ కథని నమ్మిన నిర్మాతలకి ధన్యవాదాలు. వైశాలి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. అది వాటర్ బ్యాక్ డ్రాప్ లో వున్న కథ. ఆది నేను మళ్ళీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు సౌండ్ ని హారర్ థీం గా తీసుకోవాలని అనుకున్నాం. సౌండ్ ని విజువైలైజ్ చేసి హారర్ క్రియేట్ చేయడం ఛాలెంజ్ గా అనిపించింది. తమన్ నా బెస్ట్ ఫ్రెండ్. విజువల్ కంటే పదిరెట్లు ఎక్కువ ఇంపాక్ట్ వున్న మ్యూజిక్ ఇచ్చారు. తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారికి థాంక్ యూ. చాలా చక్కని లిరిక్స్ రాశారు. నాకు తెలుగు సినిమా చాలా ఇష్టం. తెలుగు ఆడియన్స్ ని దృష్టి పెట్టుకునే ఈ సినిమా చేశాం. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. కంటెంట్ వున్న సినిమాని ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది'అన్నారు.
దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ... ఆది తో వన్ ఇయర్ గా ట్రావెల్ చేస్తున్నాను. తను ఎక్స్ లెంట్ యాక్టర్. తను ప్రతి క్యారెక్టర్ కి ఒక డిగ్నిటీ తీసుకొస్తారు. ఈ సినిమా గ్లింప్స్ చూసినప్పుడే అద్భుతం అనిపించింది. హాలీవుడ్ స్థాయిలో వుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'అన్నారు.
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. నాని గారు అడుగుపెట్టారంటే విషయం వుంటుంది. ఆది గారి కథల ఎంపిక విభిన్నంగా వుంటుంది. డైరెక్టర్ అరివళగన్, తమన్ మంచి ఫ్రెండ్స్. వారికి మంచి ట్రావెల్ వుంది. ఇందులో నాలుగు పాటలు రాశాను. ఇందులో చిత్ర గారు పాడిన పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట కోసం ఎదురుచూస్తున్నాను. మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది'అన్నారు.
మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..వైశాలీ సినిమాని చాలా ఎంజాయ్ చేశాం. అది వాటర్ అయితే ఇది సౌండ్. ఈ సినిమా చూశాం. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. డాల్బి ఎట్మాస్ వున్న థియేటర్స్ చూడండి. గొప్ప ఎక్స్ పీరియన్స్ వుంటుంది. ఆడియన్స్ థియేటర్స్ లో చూసి సినిమాని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఎన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాతలు ఈ సినిమా చూపించారు. మాకు చాలా నచ్చింది. వెంటనే ఆంధ్ర తెలంగాణ కర్నాటక డీల్ క్లోజ్ చేసుకున్నాం. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ప్రతి సీన్ ఎక్సయిటింగ్ వుంటుంది. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది'అన్నారు.
ఎన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూశే ఏపీ తెలంగాణ కొన్నాం. సినిమా టెర్రిఫిక్ గా వుంటుంది. ప్రతి ఎపిసోడ్ క్యురియాసిటీతో వెళుతుంది. ఆడియన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. వైశాలి కంటే నాలుగు రెట్లు పెద్ద విజయం సాధిస్తుంది'అన్నారు
డీవోపీ అరుణ్ పద్మనాభన్ మాట్లాడుతూ.. అసిస్టెంట్ కెమరామెన్ గా వైశాలి నా ఫస్ట్ ఫిల్మ్. అప్పుడే డైరెక్టర్ గారిని నాకో సినిమా ఇవ్వమని అడిగాను. ఇప్పుడా అవకాశం వచ్చింది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. ప్లీజ్ అందరూ థియేటర్స్ లో చూడండి'అన్నారు.


