pizza
Campus Ampasayya Hindi music launch
‘
క్యాంపస్ అంపశయ్య’ హిందీ ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

06 June 2016
Hyderabad

‘అమ్మా నీకు వంద‌నం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా'క్యాంపస్ అంపశయ్య'  పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేష‌న్స్‌ , ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969లో న‌వీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ పాటను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...

కె.వి.రమణాచారి మాట్లాడుతూ ‘’కళలు, సాహిత్యం అంటే మక్కువ చూపే దర్శకుడు ప్రభాకర్ జైని నా శిష్యుడు. అంపశయ్య నవల ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇంకా దాని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. ఆ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

అంపశయ్య నవీన్ మాట్లాడుతూ ‘’అంపశయ్య విద్యార్థుల మానసిక సంఘర్షణతో కూడుకున్న నవల. ఈ నవలను చాలా మంది సినిమాగా చేయాలనుకున్నప్పటికీ ప్రభాకర్ జైనిగారు మాత్రమే ఈ నవలను సినిమాగా చేయగలిగారు’’ అన్నారు.

ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘’నవీన్ గారు ఏం అనుకుని నవలను రాశారో ఆ భావనను మిస్ కానీయకుండా ప్రభాకర్ గారు సినిమాగా తీశారు. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కలిగించిన ప్రభాకర్ గారికి థాంక్స్’’అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ ‘’ఇది వరకు తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమా పాటను విడుదల చేశాం. ఇప్పుడు హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. క్యాంపస్ చదివే విద్యార్థులకు దగ్గరగా ఉండే చిత్రమిది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, ఎడిటర్:గోపి సిందం, కెమెరా: రవికుమార్ నర్ల, మూలకథ: నవీన్, నిర్మాత: విజయలక్ష్మి జైని, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: ప్రభాకర్ జైని.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved