pizza
Ctrl - C release on 17 June
జూన్ 17న విడుదలవుతున్న ‘కంట్రోల్ సి’
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 June 2016
Hyderabad


అశోక్, దిశాపాండే హీరో హీరోయిన్లుగా సెకండ్ ఇండిపెండెన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం కంట్రోల్ సి. సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 17న విడుదలవుతుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘’ఒక ఫ్రెండ్ కలను మరో ఫ్రెండ్ ముందుకు తీసుకెళ్లడమనేది చాలా గొప్ప విషయం. సాయిరామ్ చల్లాగారి డ్రీమ్ ను ప్రభాకర్ గారు స్నేహితుడుగా పూర్తి చేశారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమా రూపొందించారు. ఏ సినిమాలో పనిచేయకుండా,షార్ట్ ఫిలిం కూడా చేయకుండా సాయిరాంగారు సినిమా చేయడం చిన్న విషయం కాదు. ముందుగా ఈయన ఒక పెద్ద కథ చెప్పారు. కానీ పెద్ద బడ్జెట్ లోని సినిమా కంటే ముందుగా చిన్న బడ్జెట్ లో ఓ సినిమా చేయమని చెప్పాను. అలా రూపొందిన చిత్రమే కంట్రోల్ సి. ట్విన్ టవర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ ఇది. సాయిరాంగారు కొత్త డైరెక్టర్ లా కాకుండా 10-15 సినిమాలు చేసిన దర్శకుడిలా ఈ సినిమాను చేశారు. ఈ సినిమాలో నైట్ ఎఫెక్ట్స్ చాలా థ్రిల్లింగ్ కు గురి చేస్తాయి. అలాగే పెద్ద సినిమాలను విడుదల చేసే అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి థాంక్స్. జూన్ 17న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు సాయిరామ్ చల్లా మాట్లాడుతూ ‘’ఈ సినిమా విషయంలో ముఖ్యంగా ముగ్గురికి నేను థాంక్స్ చెప్పాలి. అందులో సుకుమార్ మొదటివారు. నాకు సినిమా అంటే సుకుమార్ గారే. ఆయన ఆర్య సినిమా తీసినప్పటి నుండి ఆయనతో పరిచయం ఉంది. ఆయన వలనే నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ సినిమాతో డైరెక్టర్ గా మారాను. అలాగే రెండో వ్యక్తి నా మిత్రుడు ప్రభాకర్. ఓ రకంగా చెప్పాలంటే ప్రభాకర్ మిత్రుడు కంటే ఎక్కువగా నాకు అండగా నిలబడ్డాడు. తనలా సపోర్ట్ మా కుటుంబ సభ్యులు కూడా చేయలేదు. నా ఫ్యాషన్, గోల్ ను తన ఫ్యాషన్, గోల్ గా మార్చుకున్నాడు. ఇక నేను థాంక్స్ చెప్పాల్సింది అభిషేక్ పిక్చర్స్ వారికి ఎందుకంటే ఎన్నో పెద్ద హీరోల సినిమాలను విడుదల చేసిన వారు ఈ సినిమాను విడుదల చేసేందుకు వచ్చింనందుకు థాంక్స్. నేను సుకుమార్ గారితో ముందుగా పెద్ద బడ్జెట్ లో ఓ కథను వినిపించాను. అయితే ఆయన సలహా మేర కంట్రోల్ సి అనే చిన్న బడ్జెట్ మూవీ చేశాను. ఈ చిత్రం రెగ్యులర్ ఫార్మేట్ కు భిన్నంగా ఉంటుంది. స్క్రిప్టే హీరో. క్యారెక్టర్స్ ను స్క్రిప్ట్ నడిపిస్తుంది. ట్విన్ టవర్స్ ప్రమాదం నుండి తప్పించుకున్న హీరో హీరోయిన్ కు ఓ వీడియో టేప్ దొరుకుతుంది. దాంతో వారు ఇండియా వచ్చేస్తారు. ఇండ
ియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేరుతారు. కానీ ఆ వీడియో టేప్ వల్ల ఇండియాలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులేంటనేదే ఈ సినిమా కథ. ప్రతి సీన్ డిఫరెంట్ గా అంచనాలకు అందకుండా ఉంటుంది. సినిమా నిడివి గంట నలబై ఐదు నిమిషాలు. అలాగే చంద్రమౌళిగారు తన సినిమాటోగ్రఫీతో సినిమాను హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరించారు. ఆయన్ను కూడా సుకుమార్ గారు మాట్లాడి ఒప్పించారు. ప్రతి ఒక యాక్టర్, టెక్నిషియన్ మాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా జూన్ 17న విడుదలవుతుంది. ప్రేక్షకులను ఢిఫరెంట్ థ్రిల్లింగ్ కు గురి చేసే చిత్రమిది’’ అన్నారు.

చిత్ర నిర్మాత తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘’కంప్లీట్ డిఫరెంట్ మూవీ. ఇప్పటి వరకు తెరకెక్కిన సాఫ్ట్ వేర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం. ఒక వర్గానికే కాకుండా ప్రేక్షకులందరికీ నచ్చే చిత్రం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. జూన్ 17న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో బెనర్జీ, చంద్రమహేష్, సమీర్ తదితరులు పాల్గొని యూనిట్ కు అభినందనలు తెలిపారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved