28 May 2017
Hyderabad
పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం దండుపాళ్యం. అప్పట్లో ఈ చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సాధిచిందిం. ఇప్పుడు అదే టీంతో దర్శకుడు శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మాతగా ఈ చిత్రానికి సీక్వెల్ గా `దండు పాళ్యం 2`.
ఈ సినిమా టీజర్‌ను నిర్మాత వెంకట్ స్నేహితుడు వేణు విడుదల చేశారు. ఈ సందర్భంగా...
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ - ``దండుపాళ్యం కంటే దండుపాళ్యం2 ఐదు రెట్లు బెటర్‌గా ఉంటుంది. నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. భారీ బడ్జెట్‌తోనే సినిమాను నిర్మించాం. జూన్‌లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ - ``తెలుగులో ప్రేమకథ, బాబి, పౌర్ణమి వంటి చిత్రాలకు పనిచేశాను. దండు పాళ్యం సినిమాను ముందుగా చేయాలనుకోలేదు. అయితే కథ విన్న తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేనేమోననిపించి చేశాను. ఫ్రేమింగ్, టేకింగ్ కొత్తగా ఉండే సినిమా ఇది`` అన్నారు.
పూజాగాంధీ మాట్లాడుతూ - ``99.9శాతం మంది ఈ సినిమాను నన్ను చేయవద్దనే అన్నారు. ఎందుకంటే కన్నడంలో సూపర్‌హిట్ మూవీ ముంగారు మలై(తెలుగులో వాన) సినిమాలో నటించిన తర్వాత దండుపాళ్యం సినిమా చేయడమేంటని కూడా అన్నారు. అయితే ఎవరూ ఎక్కువగా వద్దంటారో ఆ పనినే నేను ఎక్కువగా చేయడం అలవాటు. అందుకే దండుపాళ్యం సినిమా ఓకే చేశాను. కథ విన్న తర్వాత మూడు నెలలు పాటు ఈ క్యారెక్టర్‌ను నేను చేయగలనా లేదా అని డౌట్ ఉండేది. దర్శకుడిని ఎప్పుడూ అడుగుతుండేదాన్ని. కానీ ఆయన నాపై నమ్మకంతో చేయగలనని చెప్పేవారు. ఆ నమ్మకం నాలో కలిగించారు. దండుపాళ్యం పోస్టర్స్ విడుదలవగానే ఆ పోస్టర్స్‌ను కాల్చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పూజాగాంధీ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు. ఒక నటిగా ఎత్తుకు ఎదిగాను. మా డైరెక్టర్ శ్రీనివాసరాజుగారు ఛాలెంజింగ్‌గా నాతో ఈ పాత్రను చేయించారు. కన్నడంలో 49 సినిమాలు చేశాను. అయితే దండుపాళ్యంతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. పార్ట్ 3 షూటింగ్ కూడా పూర్తి చేశాం. తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం`` అన్నారు.
Glam gallery from the event |
|
|
|
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ``ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగానే స్క్రిప్ట్ చదివిన మా ఆవిడ భయపడి ఇలాంటి జోనర్ సినిమా ఎలా చేస్తారోనని అంది. కానీ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రేక్షకులు ఊహించేలా సినిమా ఉండదు. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌తో సినిమా స్టార్ట్ అయ్యి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌తో సినిమా పూర్తవుతుంది. నేను ఈ సినిమాతో మెసేజ్ ఇవ్వడం లేదు. క్రైమ్ సినిమాను క్రైమ్ సినిమాలాగానే చూడండి. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత పార్ట్ 3ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం `` అన్నారు.