pizza
Fashion Designer S/o Ladies press meet
'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 May 2017
Hyderabad

సుమంత్‌ అశ్విన్‌, అనీషా అంబ్రోస్‌, మానస, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా సీనియర్‌ వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌'. సినిమా జూన్‌ 2న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా...

రాఘవేంద్ర మాట్లాడుతూ - ''ఫ్యాషన్‌ డిజైనర్‌ రాజేంద్ర ప్రసాద్‌గారు, వంశీగారి కాంబినేషన్‌లో వచ్చిన లేడీస్‌ టైలర్‌ సినిమాకు సీక్వెల్‌. లేడీస్‌ టైలర్‌ సినిమాలో బట్టల సత్తి క్యారెక్టర్‌ కొడుకు పండుగాడి పాత్రలో కనపడతాను. వంశీగారి దర్శకత్వంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారెంటీ సినిమాలో నేను యాక్ట్‌ చేశాను. ఆ సినిమాలో నన్ను చూసి ఫ్యాషన్‌ డిజైనర్‌ సినిమాలో క్యారెక్టర్‌ ఉంది చేయాలని అన్నారు. వంశీగారి దర్శకత్వంలో పనిచేస్తే క్రమశిక్షణ అలవడిపోతుంది. సినిమా పూర్తి ఎంటర్‌టైనింగ్‌ మూవీ.సినిమా జూన్‌ 2న విడుదలవుతుంది'' అన్నారు.

మానస మాట్లాడుతూ - ''వంశీగారి సినిమాల్లో ప్రతి చిన్న విషయంలో ఆయన మార్కు ఉంటుంది. గేదెల రాణి అనే క్యారెక్టర్‌లో కనపడతాను. చాలా రఫ్‌ అండ్‌ స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. నా క్యారెక్టర్‌కు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాను. వంశీగారితో పనిచేయడం లక్‌. సినిమాలో వర్క్‌ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన వర్కింగ్‌ స్టయిల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను బాగా చేశానని అందరి ముందు మెచ్చుకున్నారు'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved