pizza
Juliet lover of Idiot release on 15 December
డిసెంబ‌ర్ 15న `జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్‌`
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

12 December 2017
Hyderaba
d

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా కొత్తపల్లి అనురాధ సమ‌ర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ వోధిరాల దర్శకత్వంలో కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మించిన చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో నవీన్ చంద్ర, కవెుడియన్ ఆలీ, దర్శకుడు అజయ్ వోధిరాల పాల్గొన్నారు. ఆలీ మాట్లాడుతూ ‘‘ఇడియట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. జూలియట్ అనే సినిమా తెలుగులో రాలేదు. ఇంగ్లీష్‌లో వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఆ సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది. అందాల రాక్షసి చిత్రం నుంచి నవీన్ చాలా మంచి సినిమాలు చేశాడు. ఇది అతనికి మరో అంద‌మైన లవ్‌స్టోరీ. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని చెయ్యడం వల్ల కొంత ఆలస్య‌మైంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఓ కామెడీ విలన్‌గా కనిపిస్తాను. ఎంతో మంది డైరెక్టర్లని, హీరోలను ఆదరించారు. ఒక మంచి కథతో వస్తున్న ఈ టీమ్‌కి కూడా మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ``టెటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్‌కి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాటలు అందరికీ నచ్చాయి. హీరోయిన్ నివేదా మొదట కమిట్ అయిన సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాలు చేశారు. మంచి కోస్టార్. చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేసింది. ఇందులో ఆలీగారు కామెడీ విలన్‌గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇద్దరం కలిసి 20 రోజులు చేశాం. ఆయన నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. డైరెక్టర్ అజయ్‌గారు ప్రతి సీన్‌ని ఎంతో నేచురల్‌గా తీశారు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు.

దర్శకుడు అజయ్ వోధిరాల మాట్లాడుతూ ‘‘సింపుల్‌గా వుండే ది బెస్ట్ లవ్ స్టోరీ ఇది. కొంత ఫ్రెష్‌గా వుంటుంది. వెరైటీగా చేశారని అందరూ అప్రిషియేట్ చేస్తారన్న నమ్మకం నాకు వుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే నవీన్‌కి సూపర్‌హిట్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను మా సినిమా సూపర్‌హిట్’’ అన్నారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved