టాలీవుడ్ నిర్మాణ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రం ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ ‘’సినిమా కథ చెప్పేటప్పుడు నిర్మాతలకు ఓ బడ్జెట్ తో వెళ్ళాం. ఈ సినిమాకు ప్రొడక్షన్ కంటే ప్రమోషన్ ముఖ్యమని భావించి, ఒక కోటితో సినిమా, ఒకటిన్నర కోటితో ప్రమోషన్ చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమా చేశాం, ఫిభ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. శ్రీచరణ్ అద్భుతైమన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సినిమాటోగ్రఫర్ కూడా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక యాక్టర్, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ క్షణం ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని చెప్పగలను’’ అన్నారు.
అడవిశేష్ మాట్లాడుతూ ‘’క్షణం అనేది నా పర్సనల్ డ్రీమ్. హీరోగా, విలన్ గా ఏడు చిత్రాల్లో నటించాను. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కు పనిచేశాను. క్యారీ వాన్ కు అలవాటు పడ్డ నేను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. చెట్టు క్రింద, పుట్టకింద నిలబడి సినిమా చేశాను. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాను. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఎవ్వరూ తిట్టుకోరు. ఈ మధ్య విడుదలైన చిత్రాల్లో హానెస్ట్ పిలిం అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు.
నిర్మాత ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ ‘’నేను మాటల కంటే చేతల్లో చూపించాలనుకునే వ్యక్తిని. ఒక కోటిలో సినిమా తీయాలనేదే మా భావన. సినిమా నిర్మాణానికి 1.1 కోటి ఖర్చయింది. సినిమా ప్రమోషన్ కోసం 1.1 కోటి ఖర్చు పెట్టాం. సినిమా రిజల్డ్ అంతా దేవుడి దయ. మాప్రయత్నాన్ని అందరూ ఆశీర్విదిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘’చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. నా పార్ట్ వరకు మాత్రమే చూశాను. ఫుల్ మూవీ చూడనేలేదు. నేను కూడా సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఏ మూవీ, ఫీల్డ్ అయినా ప్యాషన్, డిజైర్ అనే అంశాలపైనే ఆదారపడి ఉంటాయి. ఆయన అలాంటి సినిమాలను తీసి ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తే ఆ సినిమా చివర పివిపి అనే పేరు ఉంటుంది. అలాగే దర్శకడు రవికాంత్ ప్యాషన్ తో సినిమా తీశాడు. సినిమా బాగా తీశాడు. రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. శేష్ కాలిఫోర్నియా నుండి సినిమాల్లోకి వచ్చాడు. శ్రీచరణ్ ఇలా అందరూ ప్యాషనేట్ టీం ఈ సినిమాకు పనిచేసింది. ఫిభ్రవరి 26న సినిమా రిలీజ్ అవుతుంది. అంరదూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అనసూయ, ఆదాశర్మ, రవివర్మ ఇలా మంచి నటులతో కలిసి వర్క్ చేశాను’’ అన్నారు.
ఆదాశర్మ మాట్లాడుతూ ‘’రవికాంత్, శేష్ నా పై నమ్మకంతో ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వారికి థాంక్స్. పివిపి నమ్మకంతో ఈ సినిమాను నిర్మించారు. పివిపి బ్యానర్లో పనిచేయడంతో కాన్ఫిడెంట్ పెరిగింది. అందరి పీడ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ అయనుందుకు ఆనందంగా ఉంది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
అనసూయ మాట్లాడుతూ ‘’ఫిభ్రవరి 26న సినిమారిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. ట్రైలర్ విడుదలైన తర్వాత ఎక్సె పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మంచి కథతో రూపొందించిన చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.