స్ఫూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేయడానికి లక్ష్మీ ప్రసన్న మంచు ఆధ్వర్యంలో మేము సైతం ప్రోగ్రాం ఏప్రిల్ 2 నుండి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. సమాజంలో అనారోగ్య, ఆర్ధిక బాధలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ వంతు బాధ్యతగా శ్రమిస్తూ వెండితెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా తమ సత్తా చాటుకోవడానికి మన స్టార్స్ మేము సైతం అంటు ముందుకు వస్తున్నారు. వరుస యాక్సిడెంట్స్ తో నడవలేని పరిస్థితిలో ఉన్న హోటల్ సర్వర్ ని ఆదుకోవడానికి మోహన్ బాబు సర్వర్ గా మారారు. చనిపోయిన కూలి కుటుంబాన్ని ఆదుకోవడానికి రానా కూలీగా మారారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ ఆటోడ్రైవర్ కోసం అఖిల్ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయల వ్యాపారి అయ్యింది. నాని మెకానిక్ గా, శ్రేయ సేల్స్ గర్ల్ గా మారారు. ఇంకా రవితేజ, సమంత, అనుష్క, కాజల్, తమన్నా, రెజీనా, లావణ్య త్రిపాఠి ఇలా ఎందరో స్టార్స్ మహోన్నత ఆశయంతో కోట్లాది అభిమానులకు స్ఫూర్తిగా నిలవనున్నారు. అందుకు వేదికగా మారిన మేముసైతంకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా...
లక్ష్మీ ప్రసన్న మంచు మాట్లాడుతూ ‘’మేము సైతం ప్రోగ్రాం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ ఆలోచనను కార్య రూపంలోకి తీసుకు రావడానికి రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సుశీల్ కుమార్ షిండే గారి కుమార్తె స్మృతి షిండే ముంబైలో ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు. ఆమె ఆ ప్రోగ్రాంను దక్షిణాదిన చేయాలనుకుని నన్ను కలిశారు. నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ ప్రోగ్రాం ఆవిడ ద్వారా నా దగ్గరకు రావడంతో వెంటనే ఒప్పుకున్నాను. ఎమోషనల్ గా, పర్సనల్ గా హ్యపీగా ఫీలయ్యాను. జీవితంలో నిరాశతో ఉన్నవారు నమ్మకాన్ని ఇచ్చే ఉద్దేశంతో చేస్తున్న ఈ షోకు ఎందరో తారలు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇది సక్సెస్ అయితే ఈ ప్రోగ్రాంను తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ప్లాన్ చేస్తారు. ఇందులో నాకు సపోర్ట్ గా నిలిచిన నా కుంటుబానికి, టీంకు థాంక్స్’’ అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘’ఇలాంటి ప్రోగ్రాంను తెలుగులో చేస్తున్న లక్ష్మి గారికి థాంక్స్. ఇందులో నేను క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న పదేళ్ల పాప కోసం కూరగాయల వ్యాపారిగా మారాను. అక్కడ కూరగాయలు కొనడానికి వచ్చినవారు కూడా తమ వంతుగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
సుశాంత్ మాట్లాడుతూ ‘’ఇలాంటి షో దక్షిణాదిన చేయడం చాలా హ్యపీగా ఉంది. దీని గురించి తెలుసుకున్న నేను ఇన్ స్పైర్ అయ్యాను. నేను కూడా ఈ షో లో తప్పకుండా పాల్గొంటాను. లక్ష్మీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో జెమిని టీవీ బిజినెస్ హెడ్ సుబ్రమణ్యం, జెమిని టీవీ నాన్ పిక్షన్ హెడ్ కాశీనాథ్, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సన్ నెట్ వర్క్ తరపును 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. లక్ష్మీ ప్రసన్నకు అభినందనలు తెలియజేశారు.