సాయిధరమ్‌తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `ఇంటిలిజెంట్. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం `తొలిప్రేమ`.ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 9న విడుదలవుతాయని ప్రకటించారు. దీంతో మెగాఫ్యాన్స్ మధ్య చిన్న పాటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. దీన్ని దూరం చేయడానికి ఇరు చిత్రాల నిర్మాతలు డిస్కస్ చేసుకుని `తొలిప్రేమ` చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఇంటిలిజెంట్`, `తొలిప్రేమ` సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నాయని తెలియగానే అందరిలో చిన్నపాటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఇంటిలిజెంట్‌ను ముందుగా ఫిబ్రవరి 9న అనుకున్నారు కానీ.. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నన్నడిగితే తొలిప్రేమను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామని అనడంతో బివిఎస్ఎన్ ప్రసాద్‌గారు తొలిప్రేమను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగింది. ఓ నిర్మాతగా, డిస్ట్రిబ్యటూర్‌గా పోటీ రావడం అనేది ఉండకూడదు. సినిమాను ఎంత కష్టపడి చేసినా, దాని ద్వారా రెవెన్యూ తీసుకురావడమే ముఖ్యం. తెలుగు సినిమాల్లో హీరోలు ఎక్కువయ్యారు. ఒక్కొక్క హీరో మూడేసి సినిమాలు చేస్తున్నారు. 1980లో ఇలా వచ్చాయి. క్రమేణా హీరోలు ఒక్కొక్క సినిమా చేస్తుండటం వల్ల ఇన్ని సినిమాలు రావడం మానేశాయి. గత ఏడాది నుండి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ పడే సినిమాల సంఖ్య ఎక్కువైపోయాయి. ఇలాంటి సిచ్చువేషన్స్‌లో క్లాష్ ఏర్పడుతుంది. అంతే కానీ ఎవరి మధ్య పోటీలు లేవు. చివరకు ప్రసాద్‌గారితో నేనే మాట్లాడి `తొలిప్రేమ` చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేద్దామని చెప్పాను. విషయాన్ని కల్యాణ్‌గారికి చెప్పాం. `ఇంటిలిజెంట్` సినిమా ఫిబ్రవరి 9న వస్తుంది. నేను `తొలిప్రేమ`సినిమా చూశాను. డార్లింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ప్రసాద్‌గారి బ్యానర్‌లో వస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా `తొలిప్రేమ` నిలుస్తుంది. ఈ సినిమాను నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. గత ఏడాది డిస్ట్రిబ్యూటర్‌గానే నేను ఫెయిల్యూర్ చూశాను. ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్‌గా `భాగమతి`తో సినిమా సక్సెస్ కొట్టాను. ఇప్పుడు `తొలిప్రేమ` సినిమా వస్తుంది. ఒక మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు ప్రసాద్‌గారికి థాంక్స్. ఓవర్‌సీస్‌లో ఫిబ్రవరి 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం. మరి ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడిన తర్వాత ఓవర్ సీస్‌లో కూడా డేట్ ఫిక్స్ చేస్తాం`` అన్నారు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``తొలిప్రేమ` సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామని ముందుగా అనుకుని అనౌన్స్ చేశాం. అందుకు కారణం ఫిబ్రవరి 14న వేలెంటెన్స్ డే కావడం. అయితే `ఇంటిలిజెంట్` సినిమా కూడా అదే రోజున వస్తుందని ప్రకటించారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. అయితే మెగా ఫ్యాన్స్ మధ్య కన్‌ఫ్యూజన్ కాకూడదని అనుకుని.. దిల్‌రాజుగారు మాట్లాడి ఫిబ్రవరి 10న మా `తొలిప్రేమ` సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. `తొలి ప్రేమ` గ్యారంటీగా మంచి సినిమా అవుతుంది`` అన్నారు. .