స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2` . `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలైంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ను నిర్మాత లయన్ సాయి వెంకట్ సత్కరించారు. ఈ సందర్భంగా...
లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ - ``ఈ సినిమాను నేను తెలుగులో నిర్మాతగా విడుదల చేయడానికి ప్రధాన కారణం తమ్మలపల్లి రామసత్యనారాయణ. పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఏప్రిల్ 21న విడుదలైన చిత్రాల్లో థియేటర్స్‌తో పాటు కలెక్షన్స్ పెరిగిన ఏకైక సినిమా మా పిశాచి 2. ప్రతిరోజూ హిట్ టాక్‌తో థియేటర్స్ పెరుగుతూ వచ్చాయి. ఈ మేజర్ సక్సెస్‌కు కారణం డిస్ట్రిబ్యూటర్స్. అందుకనే వారిని సత్కరించాలని నిర్ణయం తీసుకున్నాను`` అన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ - ``కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయనడానికి పిశాచి 2 వంటి సినిమాలే ఉదాహరణ. విడుదలైన రోజు నుండి సక్సెస్ టాక్‌తో కలెక్షన్స్ పరంగా, థియేటర్స్ పరంగా సినిమా మంచి ఆదరణను పొందుతుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు
థాంక్స్`` అన్నారు.
చిత్ర హీరోయిన్ శిప్రా గౌర్ మాట్లాడుతూ... హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అయిన ఈ చిత్రం కన్నడంలో కూడా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు, కన్నడంలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ - ``సినిమా బావుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా అనువాద సినిమానా, స్ట్రయిట్ సినిమానా అని చూడరు. ఆదరిస్తారు. బాహుబలి2 ను కూడా తట్టుకుని కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడే రోజులు పోయాయి. ఇలాంటి తరుణంలో చిన్న సినిమాను బ్రతికించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిశాచి 2 సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. పెద్ద హిట్ చేశారు`` అన్నారు.