`
pizza

Sundarakanda Press Meet
సుందరకాండ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఆగస్ట్ 27న ఫ్యామిలీ అంతా కలసి థియేటర్స్ లో ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను: ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్

You are at idlebrain.com > News > Functions
Follow Us


9 August 2025
Hyderabad

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుందరకాండ ట్రైలర్, సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా టెక్నీషియన్స్ కోస్టార్స్ అందరికీ ఈ సినిమా చాలా మంచి జ్ఞాపకంగా ఉంటుంది. చాలా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ. అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా లాంచ్ చేశారు. వాళ్ళు అందరికీ థాంక్యు. వినాయక చవితి రోజు ఫ్యామిలీ అంతా కలసి థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

శ్రీ దేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ. అందరికి నమస్కారం. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ రోజు కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశాం. ప్రమోషన్స్ లో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా కాలం తర్వాత ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎంటర్టైనర్ ఇది. థియేటర్ కి వచ్చి అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. థియేటర్స్ కి వెళ్లి ఫ్యామిలీతో పాటు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

డాక్టర్ నరేష్ వి కె మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా జనాల్లోకి చాలా అద్భుతంగా వెళుతుంది. ఈ బజ్ ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. ఈ క్రెడిట్ డైరెక్టర్ వెంకీ కి ఇవ్వాలి. ఈ సినిమా తర్వాత తను పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఇప్పటి వరకు రాలేదు. వినాయక చవితికి ఈ సినిమా వస్తోంది. రొమాంటిక్ కామెడీతో పాటు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. ఈ క్యారెక్టర్ లో నారా రోహిత్ ని తప్ప మరెవరిని ఊహించలేను. ఈ సినిమాకి తనే బ్యాక్ బోన్. సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.

వాసుకి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ మంచి సెన్స్ అఫ్ హ్యుమర్ ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది మీకు తెలుస్తుంది. నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు ఇష్టం. రోహిత్ గారికి థాంక్యూ సో మచ్. ఈ టీం తో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వకండి. సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.

డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రాప్ ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అందరికీ థాంక్ యూ. ఆగస్టు 27న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ సినిమా పండగ రోజు రిలీజ్ అవ్వడం ఒక డ్రీమ్ మూమెంట్. సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ సంతోష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న సుందరకాండ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.ఇప్పటికే రిలీజ్ చేసిన రాప్ ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఆడియన్స్, ఇండస్ట్రీ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

తారాగణం: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు.

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు
VFX సూపర్‌వైజర్: నాగు తలారి

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved