'వినవయ్యా రామయ్యా' చిత్రంతో హీరోగా అందరి ప్రశంసలు అందుకున్న నాగఅన్వేష్ హీరోగా నటిస్తోన్న రెండవ చిత్రం 'ఏంజెల్'. సరికొత్త లుక్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరస్వతి ఫిలింస్ పతాకంపై ముప్పా వెంకయ్యచౌదరి సమర్పణలో రాజమౌళి శిష్యుడు పళనిని దర్శకుడుగా పరిచయం చేస్తూ యంగ్ ప్రొడ్యూసర్ భువన్‌సాగర్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'ఏంజెల్'. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఏప్రిల్ 20న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో నాగఅన్వేష్, హీరోయిన్ హెబ్బాపటేల్, దర్శకుడు బాహుబలి పళని, సంగీత దర్శకుడు భీమ్స్, ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి, కమెడియన్ సప్తగిరి, కథా రచయిత రమేష్ రెడ్డి, డైలాగ్ రైటర్ శ్రీనివాస్ సంకల్ప్ పాల్గొనగా చిత్ర నిర్మాత భువన్‌సాగర్ ఫ్లవర్ బొకేలతో టీమ్ అందరికీ స్వాగతం పలికారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ - ''ఠాగూర్' సినిమా నుండి కృష్ణారెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడతారు ఆయన. అనుకున్నది అనుకున్నట్టుగా నిబద్ధతతో చేస్తారు. 'ఏంజెల్' కథ విన్నాను. చాలా కొత్తగా ఉంది. నాగఅన్వేష్ చేయదగ్గ సినిమా అనిపించింది. ఫాంటసీ సినిమా చూసి చాలా కాలం అయింది. దేవలోకం నుండి వచ్చిన ఒక అమ్మాయి సాధారణ వ్యక్తిని ఎలా ప్రేమించింది అనేది సబ్జెక్ట్. సినిమా కొంత చూశాను. చాలా బాగుంది. డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ హార్డ్‌వర్క్ చేశారు. దేవకన్యగా హెబ్బా చాలా బాగా పర్ఫామ్ చేసింది. చిన్నప్పటి నుండి హీరో కావాలని నాగఅన్వేష్ చాలా డెడికేటెడ్‌గా హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. మంచి ట్రైనింగ్‌తో కామెడీని పండించే హీరోలకి లాంగ్ ఫ్యూచర్ ఉంటుందని నా అభిప్రాయం. అలాగే నాగఅన్వేష్ ఈ చిత్రంలో ఫైట్స్, డాన్స్‌తో పాటు కామెడీ సీన్స్‌లో బాగా నటించాడు. డెఫినెట్‌గా హీరోగా మంచి లాంగ్ రన్ ఉంటుంది'' అన్నారు.
ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''టు ఇయర్స్ బ్యాక్ మా నాగఅన్వేష్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'వినవయ్యా రామయ్యా' చిత్రాన్ని నిర్మించాం. కలెక్షన్స్ పరంగా ఆ చిత్రం బాగా హిట్ కాకపోయినా మంచి సినిమా తీశారనే పేరువచ్చింది. ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ సినిమా తియ్యాలి. రొటీన్‌గా వుండకూడదు. డిఫరెంట్ సబ్జెక్ట్ కోసం వెతుకుతున్న సమయంలో రమేష్‌రెడ్డి 'ఏంజెల్' లైన్ చెప్పారు. ఇమీడియట్‌గా ఓకే చేసి ఈ సినిమా మనం చేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ సినిమా తర్వాత 40 మంది నిర్మాతలు, దర్శకులు మా నాగఅన్వేష్‌తో సినిమా తీస్తామని అప్రోచ్ అయ్యారు. అందరూ 2, 3 కోట్ల బడ్జెట్‌లో చేస్తాం అని వచ్చారు. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో, క్వాలిటీతో ఒక రేంజ్‌లో సినిమా తియ్యాలి. 5, 6 కోట్లు లేనిదే సినిమా చేయలేము అని ఎవరికీ డేట్స్ ఇవ్వలేకపోయాం. 9 నెలలపాటు ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసి సెట్స్‌కి వెళ్లాం. అన్వేష్ లుక్, గెటప్ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బాపటేల్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఎక్స్‌ట్రార్డినరీగా పర్ఫామ్ చేసింది. అలాగే సప్తగిరి కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంది. రిలీజ్ తర్వాత అతని పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటారు. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. సినిమా చూశాను. చాలా శాటిస్‌ఫాక్షన్ కలిగింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మా వినాయక్ సినిమా చూసి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సినిమాకి వర్క్ చేసిన మా టీమ్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.
Hebah Patel Glam gallery from the event
దర్శకుడు పళని మాట్లాడుతూ - ''వినాయక్‌గారు ఫస్ట్ కథ విని ఇన్‌స్పైర్ అయి బాగా సపోర్ట్ చేశారు. సినిమా చూసి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఒక పెద్ద డైరెక్టర్ అయి ఉండి కూడా నాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఒక స్టార్‌కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ నాగఅన్వేష్‌లో ఉన్నాయి. హెబ్బాపటేల్ కెరీర్‌లో 'ఏంజెల్' బెస్ట్ ఫిలిం అవుతుంది. సప్తగిరి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అతను చేసిన కామెడీ చూసి సెట్‌లో అందరం ఎంజాయ్ చేశాం. భీమ్స్ మంచి మ్యూజిక్ అందించారు. భువన్‌సాగర్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఈ సినిమా చూసి మా గురువు రాజమౌళిగారు పళని మంచి సినిమా చేశాడు అని చెప్పే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అన్నారు.
నిర్మాత భువన్‌సాగర్ మాట్లాడుతూ - ''షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో ముప్పై నిమిషాలపాటు సిజి వర్క్ ఉంటుంది. రెండు నెలలుగా సిజి వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం'' అన్నారు.
హీరో నాగఅన్వేష్ మాట్లాడుతూ - ''చిన్న సినిమాలా కాకుండా చాలా భారీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఫాంటసీ మూవీ ఇది. నేను, సప్తగిరి చేసిన కామెడీ సీన్స్ బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరూ బ్రిలియంట్‌గా వర్క్‌చేశారు. హెబ్బాపటేల్ వండర్‌ఫుల్ కోస్టార్. డైరెక్టర్ పళని అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో మాట్లాడుతూ - ''సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. రీ రికార్డింగ్ జరుగుతోంది. సినిమా వండర్‌ఫుల్‌గా వచ్చింది'' అన్నారు.
కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో హీరో పక్కన వుండే త్రూ అవుట్ క్యారెక్టర్‌లో నటించాను. ఈ సినిమా నా కెరీర్‌కి చాలా ప్లస్ అవుతుంది. అందుకే ఈ చిత్రానికి నేను చాలా ప్లస్ అవుతాను. నాగఅన్వేష్ ఎంతో హార్డ్‌వర్క్ చేసి ఈ చిత్రంలో నటించాడు. డెఫినెట్‌గా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. గ్రాఫిక్ వర్క్ చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా విజువల్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.