సింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శతృఘ్న రాయపాటి(యు.ఎస్.ఎ),స్టెఫానీ(యు.ఎస్.ఎ), జోసెలిన్(యు.ఎస్.ఎ) తారాగణంగా రమ్స్ (యు.ఎస్.ఎ) దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్.ఎ), మోహన్.ఆర్(యు.ఎస్.ఎ), నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్`. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా...
సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడుతూ ``ఎనభై శాతం షూటింగ్ అంతా అమెరికాలోనే జరిగింది. ఉయ్ లవ్ అమెరికా..ఉయ్ మేట్ గన్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తెరకెక్కింది. అమెరికాలో ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఎవర్ని ఎవరు కాల్చినా అడిగే వాడుండడు. ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. డబ్బు సంపాదన కోసం వెళ్లిన అక్కడ వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అమెరికాను ఇష్టపడదాం..కానీ గన్స్ కల్చర్ కూ దూరంగా ఉండాలని చెప్పే సినిమా అది. ఆద్యంతో వినోదంతో తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా అలాంటి వాళ్లలో కొంతమందైనా మారితే దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయినట్లే` అని అన్నారు.
చిత్ర దర్శకుడు రమ్స్ మాట్లాడుతూ ``వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథే గ్రీన్‌కార్డ్. గత 15 సంవత్సరాలుగా నేను అమెరికాలో గమనించిన పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ కథను వారి వారి పిల్లలను అమెరికాకు పంపాలనుకునే తల్లిదండ్రులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. 2004లో 10 డాలర్ల బీర్ కోసం నామీదు ఓ అమెరికన్ గన్ ఎక్కిపెట్టాడు. డ్రగ్ర్స్ మత్తులో ఉన్న అతను బీర్ కోసమే అలా చేశాడు తప్ప వ్యక్తిగతంగా నాపై ఎలాంటి కక్ష లేదు. ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. వాటిని హైలైట్ చేస్తూ ఈ కథకు అక్కడ నటీనటుల అయితే బాగుంటుందని అక్కడ వాళ్లతోనే సినిమా చేశా. ఇప్పటివరకూ ఇలాంటి కథతో ఎక్కడా సినిమా రాలేదు. ఇదే తొలిసారి. సినిమా ఆడియో కూడా అక్కడే రిలీజ్ చేస్తాం. అనంతరం మన వాళ్ల కూడా ఇక్కడ కూడా ఫంక్షన్ చేస్తాం. అన్ని పనులు పూర్తిచేసి సినిమా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం`` అన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ ` మంచి కథ, కథనాలతో రమ్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియో, సినిమా చక్కని విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
సింహ మాట్లాడుతూ ` వినోదం ఉంటూనే కథ ఆద్యంతం..ఆసక్తికరంగా సాగుతుంది. ఎన్ ఆర్ ఐల జీవితాలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో దర్శకుడు కళ్లకుకట్టినట్లు చూపించారు` అని అన్నారు.