నిఖిల్, రీతూవర్మ, ఈషా గోపికర్ తారాగణంగా దేవాంశ్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కేశవ`. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దర్శకుడు సుకుమార్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
సుకుమార్ మాట్లాడుతూ - ``టీజర్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఓ మాటలు చెప్పాలంటే రొమాలు నిక్కబొడుకున్నాయి. మేకింగ్ చాలా బావుంది. ప్రతిషాట్ అద్భుతంగా ఉంది. హాలీవుడ్ సినిమా తరహాలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. కథ విన్నప్పుడు ఎలా ఎగ్జయిట్ అయ్యానో సినిమాలో ఒక ఎపిసోడ్ చూసినప్పుడు అలాగే అనిపించింది. ఇంత వరకు నిఖిల్ లాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న యాక్టర్ లేడనేంత గొప్పగా తను నటించాడు. నిఖిల్‌తో నటనలో మంచి గాఢత ఉంది. అభిషేక్ నామా ఎటువంటి సందడి లేకుండా నాలుగు సినిమాలను పూర్తి చేసేశాడు. మంచి ప్యాషనేట్ ఉన్న నిర్మాత. సినిమా బ్లాస్ట్ హిట్ సాధిస్తుంది`` అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ - ``డిఫరెంట్ సినిమాలను చేసిన సుకుమార్‌గారు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక దర్శకుడు సుధీర్ గురించి చెప్పాలంటే పదిహేనేళ్ళుగా నాకు మంచి మిత్రుడు. కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉన్నప్పుడు స్వామిరారాతో మంచి సక్సెస్‌నిచ్చాడు. ఇప్పుడు ఏదైనా డిపరెంట్‌గా చేయాలనుకుంటున్నప్పుడు కేశవ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చాడు. నేను చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ ఇది. ఇలాంటి మూవీస్‌ను ఎంకరేజ్ చేస్తేనే కొత్త సినిమాలు వస్తాయి. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
దర్శకుడ సుధీర్ వర్మ మాట్లాడుతూ - ``సినిమా కథను నిర్మాత అభిషేక్‌గారి కంటే ముందు పూర్తిగా విన్నది దర్శకుడు సుకుమార్‌గారే. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెలలో సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
అభిషేక్ నామా మాట్లాడుతూ - ``డిఫరెంట్ మూవీ. మా బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. స్వామిరారా తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
నిఖిల్, రీతూవర్మ, ఈషా గోపీకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, అజయ్, వెన్నెలకిషోర్, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్ః డ్రాగన ప్రకాష్ ,వెంకట్, డైలాగ్స్ః కృష్ణ చైతన్య, అర్జున్, కార్తీక్, సాహిత్యంః కృష్ణ చైతన్య, ఆర్ట్ః రఘు కులకర్ణి, ఎడిటింగ్ః ఎస్.ఆర్.శేఖర్, మ్యూజిక్ః సన్నీ ఎం.ఆర్, సినిమాటోగ్రఫీః దివాకర్ మణి, నిర్మాతః అభిషేక్ నామా, కథ, కథనం, దర్శకత్వంః సుధీర్ వర్మ.