నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. నందమూరి బాలకృష్ణ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ``ఆర్.కె.స్టూడియోస్ అనగానే మా రామకృష్ణ సినీ స్టూడియోస్ గుర్తుకు వచ్చి బావోద్వేగం కలిగింది. అది కూడా ఈ ఫంక్షన్‌కు నేను రావడానికి ఒక కారణం. ఇక సినిమాలు అందరూ కష్టపడే చేస్తారు.అయితే జయాపజయాలు దైవాదీనాలు. కానీ ఏ పనిచేసినా శ్రద్ధతో, అంకిత భావంతో పనిచేయాలి. నాన్నగారి కాలం నుండి నేటి వరకు తెలుగు చిత్రసీమలో వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలు వస్తూనే ఉన్నాయి. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అలా విలక్షణంగా కాలాన్ని కూడా మన వెంట పరుగెత్తించింది కూడా టాలీవుడ్ పరిశ్రమే. గుంటూరు టాకీస్ అనగానే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఈలపాటి రఘురామయ్యగారు, సురభినాటకాలు ఇలా అన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ నెల 27, 28న హిందూపూర్ లేపాక్షిలో ఉత్సవాలు నిర్వహించడానికి నేను కొంత మందితో కలిసి చర్చలు జరుపుతున్నప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణకు నన్ను రమ్మని ఆహ్వానించారు. ఈ సినిమాను హిందూపూర్‌లో చిత్రీకరించడం వల్ల, ఆ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యం వల్ల ఇక్కడకు వచ్చాను. కన్‌ఫ్యూజన్ కామెడితో ట్రైలర్ కొత్తగా,గమ్మత్తుగా ఉంది. డైరెక్టర్ ప్రవీణ్‌లో సినిమా పట్ల ప్యాషన్ కూడా కనపడుతుంది. ఇంతకు ముందు ఆయన చందమామ కథలు వంటి చిత్రంతో నేషనల్ అవార్డుని దక్కించుకున్నారు. నరేష్, సిద్ధు, రష్మీ, రాజారవీంద్ర, శ్రద్ధాదస్ ఇలా సినిమా గురించి ప్యాషన్ ఉన్న మంచి ఎనర్జిటిక్ కుదిరింది. ప్రవీణ్ ఇలాంటి మంచి చిత్రాలను మరెన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత రాజ్‌కుమార్‌గారికి ఇది మొదటి సినిమా. సినిమా పెద్ద సక్సెస్ సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తేవాలి`` అన్నారు.
నరేష్ మాట్లాడుతూ ``డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గన్ నుండి వచ్చిన సరికొత్త బుల్లెట్ ఈ చిత్రం. ప్రవీణ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. యూనివర్సల్ పాయింట్‌తో సినిమాను సరికొత్తగా రూపొందించారు. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ మూవీ. ఈ సినిమాలో నేను, సిద్ధు లీడ్ రోల్స్ చేస్తున్నాం. ఈ సినిమా నాకు ట్రంప్ కార్డ్ అవుతుంది. సిద్ధు కెరీర్‌కు మైల్ స్టోన్ అవుతుంది. నిర్మాత రాజ్‌కుమార్‌గారు చాలా కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016లో కొత్త జనరేషన్‌కామెడి చిత్రంగా అందరినీ అలరిస్తుంది`` అన్నారు.
లక్ష్మీ మంచు మాట్లాడుతూ ``ఈ సినిమా అవుట్‌పుట్ కోసం యూనిట్ ఎంత కష్టపడిందో నాకు బాగా తెలుసు. చందమామ కథలు సమయంలోనే ఈ కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యాను. అందరూ కష్టపడి అనుకున్నట్లు సినిమాను వచ్చేలా చూసుకున్నారు. కన్వెక్షన్ ఉన్న సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి సినిమాను తీసినందుకు ప్రవీణ్ సత్తారును అభినందిస్తున్నాను`` అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ``మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నందమూరి బాలకృష్ణగారికి మా కృతజ్ఞతలు. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందనుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
హీరో సిద్ధు మాట్లాడుతూ ``నా కెరీర్‌లో ప్రవీణ్ సత్తారుగారు, గుంటూరు టాకీస సినిమా మైల్ స్టోన్స్‌గా నిలిచిపోతాయి. ఈ సినిమాతో మంచి పేరు వస్తే ఆ క్రెడిట్ వస్తే అది ప్రవీణ్ సత్తారు గారికే చెందుతుంది. చెడ్డపేరు వస్తే నాకే చెందుతుంది`` అన్నారు.
రష్మీ మాట్లాడుతూ ``లీడ్ రోల్ చేశాను. అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు గారికి, నిర్మాత రాజ్‌కుమార్‌గారికి థాంక్స్`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ మాట్లాడుతూ `` అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రద్ధాదాస్, సినిమాటోగ్రాఫర్ రాంరెడ్డి, స్నిగ్ధ, ఎడిటర్ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, నరేష్, శ్రద్ధాదాస్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవిప్రకాష్, అపూర్వ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల, నిర్మాత: రాజ్ కుమార్.ఎం., కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.