pizza

You’ll see entertainment in 3 Roses Season 2 that surpasses Season 1: Producer SKN at Teaser Launch Event
"త్రీ రోజెస్" సీజన్ 1 ను మించిన ఎంటర్ టైన్ మెంట్ "త్రీ రోజెస్" సీజన్ 2లో చూస్తారు - టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

You are at idlebrain.com > news today >

21 November 2025
Hyderabad

The web series 3 Roses, starring Eesha Rebba, Satyam Rajesh, Harsha Chemudu, Prince Cecil, Hema, Sathyam Rajesh, and Kushita Kallapu in lead roles, became a super hit on Aha OTT. Its second season is now ready to stream from December 12. The series is produced by S K N under the Mass Movie Makers banner, with director Maruthi serving as showrunner. It is written by Ravi Namburii and Sandeep Bolla, and directed by Kiran K. The Season 2 teaser was unveiled today at an event in Hyderabad.

Aha Commercial Head Rajesh Vassireddy said: “3 Roses Season 1 created many records. Since its success, the demand for Season 2 kept growing. Even our management frequently asked when Season 2 would be made. Season 2 is coming on December 12, and we hope you enjoy it.”

Aha Content Head Kavitha said: “The year-end is a festive season, and we believe you’ll celebrate it with 3 Roses Season 2, premiering on December 12. Aha has been delivering back-to-back successful movies and shows with strong content. We hope you continue your support.”

Writer Sandeep Bolla said: “Eesha, who impressed in Season 1, performed even better in Season 2. Eesha and Harsha will thoroughly entertain you. One of my favorite characters is Meghana, played by Raashi, who appears opposite Satya. Kushita shines as Srushti. I once narrated a story to S K N, and since then, he has been encouraging me. Creating a series like this is challenging, but director Kiran succeeded. Season 2 can be enjoyed with the whole family.”

Actor Surya Srinivas said: “I’m happy to have the opportunity to act in 3 Roses Season 2. Acting with Eesha was easy; we used to discuss before scenes. Recently, S K N helping a fan of Mahesh Babu truly inspired me.”

Director Kiran K said: “This is my debut series as a director. It has come out very well. It’s a complete entertainer with engaging performances from the entire cast. Ajay Arasada’s music is a highlight. S K N has every quality a first-time director could hope for in a producer. He provided everything required and has been promoting the series exceptionally.”

Actress Kushita Kallapu said: “I played the character Srushti. She’s a little crazy, but there’s a method to her madness. Srushti is cute, hot, naughty, and crazy - writing such a character isn’t easy. Director Kiran was so calm on set; I never once saw him raise his voice. Working with Eesha and Raashi, who felt like sisters, was delightful.”

Actress Raashi Singh said: “After Season 1 became a big hit, everyone kept asking about Season 2. By the time I joined the project, there was already a lot of buzz around it. I played Meghana, a character very similar to my own personality - she does poojas, goes to pubs, gets into fights. Satya and I did many fun scenes that will entertain you. While working on this series, Eesha and I became good friends. She impresses as an independent woman. You’ll connect strongly with Kushita’s character as well. Please watch 3 Roses Season 2 on aha.”

Actress Eesha Rebba said: “Season 2 has two to three times more entertainment than Season 1. I never expected Season 1 to be such a big success. After reading the script for Season 2, I was confident it would be even bigger. We all felt the fun while shooting. Harsha and I play characters in revenge mode this season. There’s a lot of viral-worthy content. Director Kiran never felt like a newcomer - he handled the series with confidence. Season 2 is strong enough to be released as a movie. Raashi and Satya’s characters will become famous, and their dialogues will go viral. Kushita looks cute and hot; the youth will become her fans. After this series, she will become a star. S K N has produced cult blockbusters, and he’s going to score another success with this series.”

Producer S K N said: “The concept of 3 Roses allows for many seasons. Maruthi gave us such a unique idea. He couldn’t attend because he was busy with the release of the ‘Raja Saab’ song. After Taxiwala, 3 Roses gave me confidence to produce OTT content. Season 2 will offer even better entertainment than Season 1. Ravi Namburi, who directed Season 1, is now making our film Chennai Love Story. On his suggestion, we roped in Kiran as director and Sandeep as writer. Sandeep created unique characters, and Kiran has shown only about 10% of his creativity here - you’ll see his real potential in the future. Eesha is one of the OG Telugu heroines. Raashi learned Telugu and is acting in it. Kushita is a talented Telugu girl. I always try to encourage Telugu actresses in my films. Kushita is also acting in Tamil and Malayalam movies. Raashi is dedicated and will earn more recognition. Eesha works in Tamil, Malayalam, and Telugu films, yet despite her busy schedule, she agreed to this series because it’s a continuation. Satya loved the script and joined us - this is his first web series. Harsha’s character also brings a lot of fun. Ajay Arasada’s music reminds me of Devi Sri Prasad. The series is made with Dolby sound. Aha immediately supports good content. Enjoy 3 Roses Season 2 on December 12. Season 3 will also happen - and that one we’ll release as a movie.”

"త్రీ రోజెస్" సీజన్ 1 ను మించిన ఎంటర్ టైన్ మెంట్ "త్రీ రోజెస్" సీజన్ 2లో చూస్తారు - టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్". ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో "త్రీ రోజెస్" సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఆహా కమర్షియల్ హెడ్ రాజేశ్ వాసిరెడ్డి మాట్లాడుతూ - "త్రీ రోజెస్" ఫస్ట్ సీజన్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయినప్పటి నుంచి సెకండ్ సీజన్ పై డిమాండ్ ఏర్పడింది. మా మేనేజ్ మెంట్ కూడా సీజన్ 2 ఎప్పుడు చేస్తున్నారు అని అడిగేవారు. డిసెంబర్ 12న "త్రీ రోజెస్" సీజన్ 2 స్ట్రీమింగ్ కు రాబోతోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నా. అన్నారు.

ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ఇయర్ ఎండ్ అంటే ఫెస్టివ్ సీజన్. ఈ ఫెస్టివ్ సీజన్ ను డిసెంబర్ 12న ప్రీమియర్ అవుతున్న "త్రీ రోజెస్" సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాం. ఆహా నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్ ఉన్న సక్సెస్ ఫుల్ మూవీస్, షోస్ చేస్తున్నాం. మీ ఆదరణ ఇలాగే ఉండాలి. అన్నారు.

రైటర్ సందీప్ బొల్ల మాట్లాడుతూ - ఫస్ట్ సీజన్ లో ఆకట్టుకున్న ఈషా ఈ సీజన్ 2 లో అంతకంటే బాగా నటించింది. ఈషా, హర్ష ఎంటర్ టైన్ చేస్తారు. నా ఫేవరేట్ క్యారెక్టర్ రాశీ చేసిన మేఘన. సత్యకు పెయిర్ గా రాశీ కనిపిస్తుంది. అలాగే స్రష్టి క్యారెక్టర్ లో కుషిత ఆకట్టుకుంటుంది. ఎస్ కేఎన్ కు గతంలో ఒక కథ చెప్పాను. అప్పటినుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సిరీస్ చేయడం కష్టం, డైరెక్టర్ కిరణ్ సక్సెస్ ఫుల్ గా చేయగలిగాడు. "త్రీ రోజెస్" సీజన్ 2 ను మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు. అన్నారు.

యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ - "త్రీ రోజెస్" సీజన్ 2లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈషాతో కలిసి నటించడం ఈజీ. సీన్ చేసే ముందు డిస్కషన్స్ ఉండేవి. ఇటీవల ఎస్ కేఎన్ మహేశ్ గారి ఫ్యాన్ కు హెల్ప్ చేయడం ఇన్స్ పైర్ చేసింది. అన్నారు.

డైరెక్టర్ కిరణ్ కె కరవల్ల మాట్లాడుతూ - డైరెక్టర్ గా నా డెబ్యూ సిరీస్ ఇది. చాలా బాగా వచ్చింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సిరీస్ మొత్తం ఎంటర్ టైనింగ్ తో ఎంజాయ్ చేస్తారు. మంచి కాస్టింగ్, వాళ్లు ఇచ్చిన పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటాయి. అజయ్ అరసాడ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ కు ఎలాంటి ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటారో ఆ క్వాలిటీస్ అన్నీ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ లో ఉన్నాయి. ఈ సిరీస్ చేసేందుకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు, అలాగే బాగా ప్రమోట్ చేస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ కుషిత కల్లపు మాట్లాడుతూ - ఈ సిరీస్ లో స్రష్టి అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ కు కొంచెం తిక్క ఉంది కానీ దానికో లెక్క ఉంటుంది. స్రష్టి క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రాయడం కష్టం ఎందుకంటే స్రష్టి క్యూట్, హాట్, నాటీ, క్రేజీగా ఉంటుంది. మా డైరెక్టర్ కిరణ్ గారు కనీసం గట్టిగా మాట్లాడటం కూడా సెట్ లో చూడలేదు. అంత కూల్ గా షూటింగ్ జరిగింది. సిస్టర్స్ లాంటి ఈషా, రాశీతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ - "త్రీ రోజెస్" సీజన్ 1 పెద్ద హిట్ అయ్యాక సీజన్ 2 గురించి ప్రతి ఒక్కరూ అడుగుతూ వచ్చారు. నేను ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికే ఈ సిరీస్ పై బయట చాలా క్రేజ్ ఉండేది. మేఘన క్యారెక్టర్ లో నేను నటించాను. మేఘన క్యారెక్టర్ కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి. నాలాగే మేఘన పూజలు చేస్తుంది, పబ్ కు వెళ్తుంది, ఫైట్స్ చేస్తుంది. నేను, సత్య కలిసి చాలా ఫన్ సీన్స్ చేశాం. అవన్నీ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఈషా మంచి ఫ్రెండ్ అయ్యింది. ఇండిపెండెంట్ వుమెన్ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. కుషిత క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు. "త్రీ రోజెస్" సీజన్ 2ను ఆహాలో చూడండి. అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ - "త్రీ రోజెస్" సీజన్ 1 కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2లో ఉంటుంది. సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా ఆ ఫన్ ను ఫీల్ అయ్యాం. నేను, హర్ష ఒక రివేంజ్ మోడ్ లో క్యారెక్టర్స్ చేశాం. ఈ సీజన్ 2 లో చాలా వైరల్ కంటెంట్ ఉంది. మా డైరెక్టర్ కిరణ్ కొత్త దర్శకుడిలా అనిపించలేదు. కాన్ఫిడెంట్ గా సిరీస్ చేశాడు. "త్రీ రోజెస్" సీజన్ 2 ను సినిమాగా రిలీజ్ చేయొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. ఈ సీజన్ లో రాశీ, సత్య చేసిన క్యారెక్టర్స్ ఫేమ్ అవుతాయి. వాళ్ల కాంబినేషన్ సీన్స్ లోని డైలాగ్స్ వైరల్ గా మారుతాయి. కుషిత క్యూట్ గా, హాట్ గా కనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ తనకు ఫ్యాన్స్ అవుతారు. ఈ సిరీస్ తర్వాత కుషిత స్టార్ అవుతుంది. ఎస్ కేఎన్ గారు తన ప్రొడక్షన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ తోనూ సక్సెస్ అందుకోబోతున్నారు. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - "త్రీ రోజెస్" కాన్సెప్ట్ తో ఎన్ని సిరీస్ లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ మారుతి గారు ఇచ్చారు. ఆయన రాజా సాబ్ సాంగ్ రిలీజ్ పనుల్లో ఉండి రాలేకపోయారు. టాక్సీవాలా మూవీ చేశాక ఓటీటీలో ఏదైనా కంటెంట్ ప్రొడ్యూస్ చేసేందుకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది "త్రీ రోజెస్". సీజన్ 1ను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2 లో చూస్తారు. ఫస్ట్ సీజన్ రవి నంబూరి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తను మా చెన్నై లవ్ స్టోరీ మూవీ రూపొందిస్తున్నాడు. ఆయన సజెషన్ మీదే కిరణ్ ను డైరెక్టర్ గా , సందీప్ ను రైటర్ గా తీసుకున్నాం. ఈ సిరీస్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సందీప్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్ గా కిరణ్ క్రియేటివిటీలో "త్రీ రోజెస్" సీజన్ 2 10శాతం మాత్రమే. తన ప్రతిభను ఫ్యూచర్ లో చూస్తారు. ఈషా మన తెలుగు హీరోయిన్స్ లో ఓజీ అనుకోవచ్చు. రాశీ సింగ్ తెలుగు నేర్చుకుని నటిస్తోంది. కుషిత టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయి. నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నాను. కుషిత తమిళంలో, మలయాళంలో మూవీస్ చేస్తోంది. రాశీ డెడికేషన్ ఉన్న నటి. ఆమె ఇంకా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఈషా తమిళ, మలయాళం, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యుటీ ఉన్న సిరీస్ కాబట్టి ఇతర సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె చేస్తానని ముందుకువచ్చింది. సత్య ఈ స్రిప్ట్ ను ఇష్టపడి నటించేందుకు వచ్చారు. సత్య ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. అలాగే హర్ష క్యారెక్టర్ కూడా మంచి ఫన్ అందిస్తుంది. అజయ్ అరసాడ మ్యూజిక్ వింటే నాకు దేవి శ్రీ ప్రసాద్ గుర్తొస్తాడు. ఈ సిరీస్ కోసం మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డాల్బీ సౌండ్ లో ఈ సిరీస్ చేశాం. మంచి కంటెంట్ ఉంటే వెంటనే ఓకే చెప్పి సపోర్ట్ చేసే ఓటీటీ ఆహా. డిసెంబర్ 12న "త్రీ రోజెస్" సీజన్ 2 చూసి ఎంజాయ్ చేయండి. "త్రీ రోజెస్" సీజన్ 3 కూడా ఉంటుంది. ఆ సీజన్ ను సినిమాలా రిలీజ్ చేస్తాం. అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved