pizza

ANAGANAGA OKA RAJU - THE PERFECT FILM FOR A PERFECT SANKRANTHI - JAN 14, 2026.
సంక్రాంతి కానుకగా 'అనగనగా ఒక రాజు'

You are at idlebrain.com > news today >

26 May 2025
Hyderabad

The most awaited entertainer #AnaganagaOkaRaju is all set to hit theatres this Sankranthi - January 14th, 2026.

The Blockbuster Machine Naveen Polishetty is back with another family entertainer and as always whenever he’s on screen, it guarantees a laughter riot. The makers have unveiled a motion poster that’s already grabbing attention and striking the right chord. The poster too sets the tone for a full fledged festive celebration.

Joining him the current lucky charm of Telugu cinema Meenakshi Chaudhary is riding high with back to back blockbusters. The film marks the directorial debut of Maari who’s bringing a fresh and vibrant narrative to life.

Mickey J Meyer delivers another musical banger that perfectly blends with the festive flavour.

The film is bankrolled by Naga Vamsi S and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios presents the film. These production houses carry a reputation for delivering consistent blockbusters. Most recently the Sankranthi hit Daaku Maharaaj and now they’re gearing up for yet another festive winner with Anaganaga Oka Raju in 2026.

Starring: Naveen Polishetty, Meenakshi Chaudhary
DOP: J Yuvraj
Music: Mickey J Meyer
Directer: Maari
Producer: Naga Vamsi S & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presents: Srikara Studios

సంక్రాంతి కానుకగా 'అనగనగా ఒక రాజు'

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రం 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది.

తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్‌ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.

తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా 'అనగనగా ఒక రాజు' వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది.

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి 'అనగనగా ఒక రాజు'లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2026 సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు'తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved