Andhra King Taluka Musical Concert
'ఆంధ్ర కింగ్ తాలూకా' నా కెరీర్ లో గర్వపడే సినిమా. నవంబర్ 27న అందరం థియేటర్స్ లో కలుద్దాం: మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది.
మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హలో వైజాగ్. నా కెరీర్ లో గర్వపడే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. రవి గారు నవీన్ గారు చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. డిఓపి జార్జ్ సిద్ధార్థ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. వివేక్ మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్ గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలో కూడా అతను అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మహేష్ లాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాకి కావాలి. తను మరి ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర గారి సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్ర గారితో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మై డియర్ ఫ్యాన్.. జీవితంలో పైకి రావాలంటే పాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే. రెండు ఇక్కడ టన్నులు టన్నులు ఉంది. వస్తున్నాం.. లెగుస్తున్నాం.. మళ్ళీ కొడుతున్నాం. హోంమంత్రి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అభిమానులందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు ఈ సినిమాలన్నీ మీకు గుర్తు ఉండడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. మహేష్ గారు సినిమాని అద్భుతంగా చేశారు. ఎలివేషన్ కమర్షియల్ సాంగ్స్ లవ్వు అన్నీ ఉన్నాయి. రామ్ గారు భాగ్యశ్రీ గారు అద్భుతమైన కాంబినేషన్. రామ్ గారి ఎనర్జీ ఈ సినిమాలో చూడండి. మీ ఫ్యాన్స్ అందరి ఎనర్జీ అక్కడ ఉంది. మైత్రి నవీన్ గారికి రవి గారికి చాలా థ్యాంక్యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి.
హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ .. హలో వైజాగ్. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థాంక్యూ. నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్ గారు అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. ఆయన కింగ్ ఆఫ్ హార్ట్స్. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు. నవంబర్ 27న అందరూ కూడా ఈ సినిమాని చూడాలని కోరుతున్నాను. అందరికీ థాంక్యు.
హోం మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ టైటిల్ వినగానే చాలా కనెక్ట్ అయ్యాను. ఎలక్షన్స్ టైం లో మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేవి చాలా ప్రజాదరణ పొందిన టైటిల్స్. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మైత్రి మూవీ రవి గారికి నవీన్ గారికి అభినందనలు. వైజాగ్ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సినిమాని ప్రమోట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతమైన నటనతో తెలుగులో కూడా ఎంతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. భాగ్యశ్రీ నటన ఎంతో ఆకట్టుకుంది. మీ అందరి అభిమాన హీరో రామ్. తన సినిమాలో చూసేటప్పుడు తన స్ప్రింగ్ పెట్టుకున్నాడా అనిపించేది. తను డాన్స్లు ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు. రామ్ కి అభినందనలు. ఈ సినిమా దర్శకుడు మహేష్ వైజాగ్ వాసి అవ్వడం గర్వపడుతున్నాం. సినిమాకి పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను.
డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ.. నేను సినిమా తీయడం హైదరాబాదులో నేర్చుకున్నాను కానీ సినిమాలో ఉండే ప్రతి ఎమోషన్ వైజాగ్ లోనే ఫీలయ్యాను. రవి గారికి కథ చెప్పినప్పుడు ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. అప్పుడే కంటెంట్ మీద మరింత నమ్మకం వచ్చింది. ఈ సినిమా టీం వర్క్. రైటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్యూ. సినిమా కోసం రాత్రి పాటలు పని చేశారు. మా సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. వివేక్ మర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అదే మా ఫస్ట్ సక్సెస్ గా ఫీల్ అవుతున్నాము భావిస్తున్నాము. రావు రమేష్ గారు మురళీ శర్మ రాహుల్ రామకృష్ణ సత్య రాజీవ్ కనకాల గారు ఇలా ఎంతో మంది అద్భుతమైన నటులు అందరు కూడా తమ పాత్రలని ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ల ముందున్న సినిమాలు కంటే కొత్తగా చేశారు. మేము అనుకున్న దానికంటే 100 టైమ్స్ అద్భుతంగా చేసింది భాగ్యశ్రీ. ఒక డైరెక్టర్ ని డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని. ఉపేంద్ర గారి దగ్గరికి చాలా భయంతో వెళ్ళాను. ఆయన రియల్ మాన్. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను.రామ్ లేకపోతే సినిమా లేదు. సినిమా పట్ల అంత ఫ్యాషన్ అన్న వారిని నేను ఇప్పటివరకూ చూడలేదు. ఆయనకు ఉన్న సినిమా నాలెడ్జ్ అద్భుతం. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్ లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. నవంబర్ 27న అందరు కూడా సినిమా థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మార్విన్ మాట్లాడుతూ.. మాకు ఇంత మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పినా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. ఉపేంద్ర గారికి మేము పెద్ద ఫ్యాన్స్. ఆయనతో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మ్యూజిక్ ఇంత అద్భుత అద్భుతంగా రావడానికి కారణం రామ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేము. ఆయన ఇచ్చిన ఎనర్జీ అద్భుతం. ఆయన ఎనర్జీ వల్లే సాంగ్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. నవంబర్ 27న తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. హలో వైజాగ్. ఇదే వైజాగ్ లో మేం చేసిన రంగస్థలం ఈవెంట్ గుర్తుకొస్తుంది. ఆ ఈవెంట్ కి చిరంజీవి గారు నాగబాబు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ రోజు ఈవెంట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇదే వేదికలో మీ అందరినీ కలవడం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ఈ హీరో రామ్ గారు అందరిని అభిమానులందరు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్ లో చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రార్డరీ ఫిలిం అని చెప్పారు. ఈ సినిమాలో రామ్ గారు, ఉపేంద్ర గారి మధ్య ఉండే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే భాగ్యశ్రీ గారు రాహుల్ రామకృష్ణ అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఒక మెసేజ్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంలో కొట్టాల శివ గారు దిట్ట . శ్రీమంతుడు జనతా గ్యారేజ్ సినిమాల్లో అద్భుతంగా ఒక కథలో గొప్ప సందేశం కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పారు. ఈ సినిమా దర్శకుడు మహేష్ కూడా నెక్స్ట్ కొరటాల శివ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. వివేక్ మర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చిరంజీవి గారు బాలకృష్ణ గారు మహేష్ గారు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చారు. మేము ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకున్నాము. ఇప్పుడు ప్రభాస్ గారు ఫౌజీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా అంతే ఫ్యాషన్తో చేస్తున్నాము. అందరు స్టార్ ఫ్యాన్స్ ని కలిపిన సినిమా ఇది. సినిమా అద్భుతంగా ఉంది. నవంబర్ 27న తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.